image_print
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading

ముందడుగు (కథ)

ముందడుగు -రోహిణి వంజారి పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు.  సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది.  ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో  ఫేస్బుక్, వాట్సాప్ లు  మార్చి మార్చి గంట  నుంచి చూస్తున్నాను.  అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు.  కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు  అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే […]

Continue Reading

మిణుగురులు (కథ)

మిణుగురులు -శ్రీసుధ మోదుగు సాయంత్రం బుగ్గ వాగు  దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరూ, దూరంగా చిన్న కొండలు వర్షాకాలంలో ఆకుపచ్చగా, ఎండాకాలంలో పసుపచ్చగా మారిపోతాయి. ఎలా చూసినా అందంగానే ఉంటాయి. “బుగ్గ వాగులో నీళ్లు లోతు లేనట్లు కనిపిస్తాయ్, కానీ లోతెక్కువ. ఎప్పుడూ వాగులో దిగకు. శివా! వింటున్నావా?” “ఆ … కాక.”   “శివ! మీ అమ్మ వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా?”  “కాక! అమ్మ మంచిది కాదా?”  “మంచిది శివ.”  “పున్నమ్మ చెప్పింది అమ్మ మంచిది కాదు, వచ్చి […]

Continue Reading
Posted On :

మాటవిన్న మనసు (కథ)

మాటవిన్న మనసు -విజయ దుర్గ తాడినాడ ‘ఎందుకిలా జరిగింది?’  ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా అనుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?  ఈ ప్రశ్న కేవలం ఆరు నెలల నుండి నా మనసుని తొలిచేస్తోంది. జరగాల్సినదంతా జరిగిపోయింది. ఊహించనిది జరిగిపోయింది.  […]

Continue Reading

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది. గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది. ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను. నెమ్మదిగా […]

Continue Reading

ముసురు (కథ)

ముసురు –మణి వడ్లమాని వాన  జల్లు  పడుతూనే ఉంది. ఒక్కసారి  పెద్దగా, ఒక్కోసారి చిన్నగా  జల్లులు  పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం,సందడిగ  కోలాహలంగ ఉంది , కుర్చీలలో  కూర్చొని   కునికి పాట్లు పడేవారు కొందరు. పుస్తకాలు  తెచ్చుకొని  చదువుకునే  వారు మరి కొందరు.  చెవులకి  హియర్  ఫోన్స్  పెట్టుకుని  మ్యూజిక్  ని వింటూ ఉండేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి   ఎవరి కి వాళ్ళు  యేదో రకంగా  బిజీ గా ఉన్నారు. “బయట వాతావరణం బాగా […]

Continue Reading

గౌతమి (కథ)

గౌతమి -కిరణ్ విభావరి “నాన్నా! అంటరానితనం అంటే ఏంటి నాన్న?” ఆదివారం అని తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చున్న నన్ను నా కూతురు గౌతమి ముద్దు ముద్దు గా అడిగింది. దానికి ఈ సంవత్సరం 9 పోయి పది వస్తోంది. నాలుగో తరగతి చదువుతోంది. మంచేంటో చెడు ఏంటో తెలిసి, తెలియని వయసు. పెద్ద వాళ్లు చెప్పిందే నిజమని నమ్మే అమాయక పసితనం దాని కాటుక కళ్ళల్లో కనిపిస్తుంటే పేపర్ పక్కన పెట్టి దాన్ని ఎత్తుకొని పక్కన […]

Continue Reading

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” (కవిత)

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” -వంజారి రోహిణి తిరుగుబాటు – పోరుబాటరణరంగంలో యుద్ధం…ప్రాచీన చరిత్ర లోరాజులకు రాజులకు మధ్యరాజ్యాలకు రాజ్యాలకు మధ్యరాజ్య కాంక్షతో రక్తాన్నిఏరులై పారించారు…చివరికి అందరి ప్రాణాలు గాల్లోఅన్నీ కట్టెలు మట్టిలో….ఆధునిక చరిత్ర లోప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యదేశానికీ దేశానికీ మధ్యకులానికీ కులానికీ మధ్యమతానికీ మతానికీ మధ్యమనిషికి మనిషికి మధ్యఆధిపత్యం కోసం అణిచివేతవివేక రహిత విద్వేషం….ఫలితం…కొందరి గెలుపు కొందరి ఓటమిహత్యలు ఆత్మాహుతులువరదలై పారిన నెత్తుటి కన్నీరువర్తమాన ప్రపంచంలోఅందరికీ ఒకటే శత్రువుకరోనా వైరస్మనుషులంతా ఒకటైప్రాంతాలన్నీ ఒకటైదేశాలన్నీ ఒకటైవిశ్వ మంతా […]

Continue Reading

తప్పటడుగు(కథ)

తప్పటడుగు -వంజారి రోహిణి “నీతా! బంటి, రీతూ రడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది, పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత.  ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు. “నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి” […]

Continue Reading