
నడుస్తున్న భారతం (కవిత)
– వేముగంటి మురళి
ముఖానికి మాస్క్దుఃఖానికి లేదుఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్నిమెలిపెడుతున్నది ఒంట్లో నగరాల నరాల్లో విచ్చలవిడిగా మండుతున్న భయంపూరిగుడిసెలోచల్లారిన కట్టెల పొయ్యిఅవయవాలు ముడుచుకొని ఉండడమేపెద్ద శ్రమ కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదుకాలాన్ని వెనకకు తిప్పలేదుప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది తిరిగే కాలు మూలకు,ఒర్రే నోరుకు రామాయణ తాళంగదంతా ఆధ్యాత్మిక ధూపదీప యాగంకంట్లో నిండుతున్న విశ్వాసాల పొగలుఎర్రబారిపోయింది పిచ్చి మనసు రోడ్డుమీద ఒక పక్కకు పక్షుల రాకడమరోదిక్కు వలసొచ్చిన మనుషులు పోకడ పిట్టలు ఎగరగలవుకరువు అమాంతం నెత్తిమీద వాలుతుందిభుజం మీద చినిగిన బోళ్ల సంచిరొండికి పాలకు ఏడుస్తున్న పసిపిల్లగాడుఇది నడుస్తున్న భారతం
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

నేను సిద్దిపేటలో 1972లో జన్మించాను.
మా బాపు పద్యకవి కావడం వల్ల కొంత సాహిత్య జ్ఞానం అబ్బింది. నందిని సిధారెడ్డి, దేశపతి మిత్రుల వల్ల ప్రాపంచిక దృక్పథం తెలిసింది.
