
విడదీయ లేరూ !!!
-గిరి ప్రసాద్ చెల మల్లు
నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం బహిర్గతం నేను ఆమె అధరాలను స్పృశిస్తూ నాసికాన్ని నా ఆధీనంలోకి తీసుకు రాగానే ఆమె ఉఛ్వాసనిశ్వాసాల గాఢత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆమె కింది కనురెప్పల వారగా నేను ముడతలను మూసేస్తూపై కనురెప్పల ఈర్ష్యను గమనిస్తూ ముంగురులను ముద్దాడుతూ ఆమె రక్షణలో అనునిత్యం నేను నాది ప్రేమో, బాధ్యతో గాని ఆమె వెంట నేను నేను లేకుంటే ఆమెకు తీరని వెలితినేను రంగుల్లోకి మారుతుంటేఆమె మోములో వెలుగు నా మోహంలో ఆమె ఆమె స్కార్ఫ్ ని నేను-
*****

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేసాను. చదువు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని కవితలు వ్రాస్తున్నాను. ప్రేమ కవితల్లో కూడా ప్రవేశం. కవితలు వివిధ దిన వార మాస వెబ్ పత్రికల్లో ప్రచురితం.
