
రైన్ కోటు
-యలమర్తి అనూరాధ
గోడకు వేలాడదీయబడి
బిక్కు బిక్కు మంటూ చూస్తూ
ఎడారి జీవితాన్ని గడిపేస్తూ..
గాలివాన నేనున్నా అనాలి
విప్పుకున్న గొడుగులా
అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా
ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది
కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ
వెచ్చదనం అంతా నీ సొంతం చేస్తుంది
కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ
గూటిలో గువ్వలా తన ఒడిలో కాపాడే
తల్లి మనసుకు ఏం తీసిపోదు
చినుకు చినుకు కి చిత్తడవుతున్నా
చిరునవ్వుతో నిన్ను హత్తుకుంటూనే
నిలువెల్లా రక్షణ కవచం అవుతూనే
శ్వాస ఆగుతుందేమోనని కలవర పడుతూనే
వర్షం ఆగితే మళ్లీ అది చలనం లేని బొమ్మే గా!
*****
Please follow and like us:

యలమర్తి అనూరాధ నివాసం హైదరాబాద్. కృషాజిల్లా ముదునూరులో జన్మించారు. 1978 నుంచి కవితలు రాస్తున్నారు. అనేక సాహిత్య పురస్కారాలు పొందారు.

Rain Coat lo inthundaa 😲
Chaalaa Baagaa cheppaarandi👌
Thanks andee