ప్రమద

శిరీష బండ్ల

ఆంగ్ల ఇంటర్వ్యూ: Molly Kearns

తెలుగు అనుసృజన : సి.వి. సురేష్  

ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపిస్తూంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా శిరీష బండ్లతో ఇంటర్వ్యూని తెలుగులో నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా అందజేస్తున్నాం-

శిరీష బండ్ల ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ , దాని సోదర సంస్థ లకు ప్రభుత్వ వ్యవహారాలు & వ్యాపార అభివృద్ధిపై పనిచేస్తున్నారు.  వర్జిన్- గెలాక్టిక్  అంతరిక్ష కార్యక్రమాలైన కక్ష్యలలోకి ప్రవేశపెట్టడం వంటివే కాక, స్పేస్ షిప్ ప్రోగ్రామ్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. గతంలో బండ్ల  శిరీష వ్యాపార అంతరిక్ష యాన పరిశ్రమల సంఘం అయిన “కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఫెడరేషన్ (సిఎస్ఎఫ్)” లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సిఎస్‌ఎఫ్‌లో శిరీష వాణిజ్య అంతరిక్ష పరిశ్రమను ప్రోత్సహించడం, వ్యాపారాత్మకంగా అంతరిక్ష యానాన్ని నిజం  చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అనేక  విధానాలపై పనిచేశారు. “పర్డ్యూ” విశ్వవిద్యాలయంలో ఆమె అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్న సమయంలో నే నాసా-అనుబంధంగా ఉన్న జీరో-గ్రావిటీ పై పని చేస్తున్న విద్యార్థుల అవకాశాల కోసం పనిచేసే  బృందానికి  నాయకత్వం వహించారు.  ఆ సందర్భంగా ఆమె జీరో-గ్రావిటీ  విమానంలో ప్రయాణించారు.  అదనంగా శిరీష జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను కూడా చేసారు. 

 

రోదసీ పై మీ మనసులో ఆసక్తి ఉందని ఎప్పుడు గ్రహించారు ? 

పిల్లలందరికీ ఉన్నట్లే నాకూ  వ్యోమగామిగా మారి అంతరిక్షంలోకి వెళ్లాలని  కోరిక బాల్యం నుండి బలంగా ఉండేది.  నాతో పాటే నా ఆ కోరిక కూడా ఎదుగుతూ వచ్చింది.  నేను టెక్సాస్ లోని హ్యూస్టన్లో పెరిగాను.  మాకు అతి సమీపం లోనే జాన్సన్ స్పేస్ సెంటర్ ఉంది.  దాని కారణ౦గా,  నాకు , ఆ ప్రాంతాన్ని అనేక సార్లు చూసి, పరిశీలించే అవకాశం వచ్చింది. అది నాలోని అంతర్లీమైన  ఆలోచనలకు ఒక రూపం వచ్చి బలపడేలా చేసింది. రోదసీ  ఒక  ప్రశాంత ప్రదేశం అనే ఆలోచన  నా మనసులో బలపడింది. పెరిగే కొద్దీ నేను ఆ వైమానిక దళ  మార్గంలో వెళ్లాలనీ,  పైలట్ కావాలని కృత నిశ్చయం లోకి వస్తూ,  అదే ప్రథమ లక్ష్యంగా అనుసరించి, ఆ క్రమంలో  నాసా వ్యోమగామినయ్యాను. నేను అనుకొన్న  మార్గం ఇదే అని, నిజంగా నమ్మేలా చేసి, అది నేను ఈ అంతరిక్ష పరిశ్రమలో ఎలా మనగలిగానో అవగతమైంది. దురదృష్ట వశాత్తు నాకు కంటి చూపు కూడా తక్కువ. స్కూల్ రోజుల్లో ఈ లోపం నా ఆశయాలైన వ్యోమగామి, పైలట్ కావడానికి అడ్డ౦కి  అని భావించాను.  

 

2004 లో స్పేస్‌షిప్-1,  అన్సారీ x  బహుమతిని గెలుచుకుని, రోదసీ లోకి అనేకసార్లు వెళ్లి వచ్చిన మొదటి ప్రైవేట్ వాహనంగా పేరు గాంచింది. ఆ సాఫల్యం నన్ను నా ఆశయ దారిలో నుండి పక్కకు తప్పిపోకుండా నిల్పింది.  కేవలం నాసా ఒక్కటే మార్గం కాదని,  నా అభిరుచిని అనుసరించి అంతరిక్షంలోకి ప్రయాణించగలనన్న నమ్మకాన్ని నిలిపింది. ఆ క్షణం నుండే, నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలని నిర్ణయించుకున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న వాణిజ్య అంతరిక్ష రంగం నాకు ఆశాజనకమైన కెరీర్ గా అనిపించింది.  

సాధారణ ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యా మార్గం నుండి తప్పుకొని, బదులుగా జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మీరు MBA ను అభ్యసించడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం  ఏమిటి?

 

నాకు నేర్చుకోవడమంటే చాల ఇష్టం. దాన్ని ప్రేమిస్తాను.  కాని  తరగతి గదుల్లో నేర్చుకోవడం కంటే, స్వయంగా తెలుసుకొని నేర్చుకునేదానిని.  అందుకే నేను ఆ  “పర్డ్యూ” లో కలిసి పనిచేయడాన్ని చాలా ఇష్టపడ్డాను. నేను ఒక ఏడాది మొత్తం పాఠశాలకు వెళ్లాను.  ఆ తరువాత ప్రతి సెమిస్టర్ నేను ఒక ఇంజనీరింగ్ సంస్థలో ఇంటర్న్ షిప్  చేసాను. ఆ అనుభవం నిజంగా నాలో  నైపుణ్యాలను పెంచుకోవటానికి, అవి  ఉపయోగపడే  స్థితికి తీసుకు రావడానికి సహాయపడింది. నేను నా బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత,  పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేదని భావించే వారిలో నేనూ ఒకరినని భావించారు. నేను, పర్డ్యూలో పనిచేయడం ప్రారంభించినప్పుడు, నేను తెలుసుకున్న అంశం ఏమంటే, అప్పటివరకు నేను చదివిన విద్య ద్వారా వ్యాపార దృక్పధం పొందలేదని తెలిసి వచ్చింది.  నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా, నాకు నా  విద్యను కొనసాగించే అవకాశం లభించింది.  కాబట్టి నేను నా ఎంబీఏ డిగ్రీ  పొందాలని నిర్ణయించుకున్నాను. అంతే కాక, అంతరిక్ష యాన రంగం లో వ్యాపార, వాణిజ్య దృక్పథం  ఏముందా ? అని లోతుగా పరిశీలించడం మొదలు పెట్టాను. ఇది నిజానికి సాంకేతిక దృక్పథం తో పని చేసే అంశానికి విరుద్ధమైనా. 

“పర్ డ్యూ  జీరో-గ్రావిటీ” బృందంతో కలిసి  పనిచేసే సమయం మీకు కలిగిన అనుభవం , అంతే కాక, వారితో కలిసి సున్నా గురుత్వాకర్షణ లో రోదసి లో ఎగిరే అవకాశంపై మీ అనుభవం ఏమిటి?

 

చాలా అద్భుతంగా ఉంది. సున్నా-గురుత్వాకర్షణలో ప్రయాణించే అవకాశాన్ని పొందడం నేను ఎప్పటికీ పూర్తిగా చెప్పలేను.  అదే సమయంలో, నాసా మరియు పర్డ్యూలో ఈ కార్యక్రమం ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని.  నేను ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదన ప్రక్రియను పూర్తి చేసి,  చాల నిధులు పొందగలిగాను.  ఈ ఆనందాన్ని విద్యార్థిగా నేనెప్పుడూ అనుభవించలేదు. ఈ అనుభవం నాకు ఒక ప్రాజెక్ట్ ప్రారంభం నుండి నిర్వహణ, ముగింపు వరకు నాకు పూర్తి అవగాహన వచ్చేలా చేసింది.  ఇది నాకు గొప్ప అనుభవం. నేను జట్టులో పనిచేయడం, ఒక సమస్య- దాని పరిష్కారం, తగిన సమాచారాన్ని సేకరించడం తదితర అంశాల గురించి చాలా నేర్చుకున్నాను.  ఆ నైపుణ్యత కలిగి ఉండటం నాకు  చాలా ఉపయుక్తమైనది. సూక్ష్మ గురుత్వాకర్షణ అప్లికేషన్స్ అనే అంశం కంటే, నేను ఆ ప్రాజెక్ట్ ద్వారా చాలానే  నేర్చుకున్నాను.

 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఉత్తర అమెరికాలోని మొట్ట మొదటి అతిపెద్ద ఇండో-అమెరికన్ సంస్థ. తానా యూత్ స్టార్ అవార్డును పొందడం ఎలా సాధ్యపడిందో  మీరు మాతో పంచుకోగలరా?

 

సాధారణంగా నా కుటుంబ జీవితానికి, అంతరిక్ష పరిశ్రమలో నేను చేస్తున్న వృత్తికీ , నేను చేసే పనుల మధ్య ఎలాంటి సంబంధం లేదు.  కాబట్టి నేను అంతరిక్ష సమాజంలో చేస్తున్న నా పనికి గుర్తింపు ప్రత్యేకమే. ఎందుకంటే, నేనున్న అంతరిక్ష పరిశ్రమ , అందుకు ఏ మాత్రం సంబంధం లేని నా ఇతర సమాజానికి నిజంగా  ప్రత్యేకమే. నేను వ్యక్తుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడం, శ్రద్ధ వహించే విషయాల గురించి మాట్లాడటం ఎప్పుడూ గొప్ప అంశమే. ఇంకో విషయం తెలుసా! తానా అవార్డుల వేడుకకు నా  కుటుంబం మొత్తం హాజరయ్యింది. ఆ సంవత్సరం,  అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలకు గుర్తింపు పొందిన ఇద్దరు వ్యక్తులలో నేను ఒకదానిని.  మన చుట్టూ ఉన్న సమాజం లో  క్రొత్త వ్యక్తులను కలవడం, సమాజంలోని ఇతరులతో కనెక్ట్  అవ్వడం నాకు చాలా గొప్ప అవకాశం అనిపించింది. 

 

“మాథ్యూ ఇసకోవిట్జ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్” అంటే ఏమిటి? ఆ కార్యక్రమంతో మీరు ఎలా మమేక మయ్యారు?

 

కళాశాల చదువు తరువాత, నేను వాషింగ్టన్ డి.సి. లో, వ్యాపార రోదసి విమానయాన ఫెడరేషన్లో  అంతరిక్ష పాలసీ ఉద్యోగం కోసం ఒక  ఇంటర్వ్యూను ముగించాను. నాకా ఉద్యోగం వచ్చింది. అంతే కాక, నాకు ఒక క్రాష్ కోర్స్ లో శిక్షణ ఇచ్చిన మా ప్రొఫెసర్ పేరు  మాథ్యూ ఇసకోవిట్జ్ .  నన్ను ఈ రోదసీ విధాన సమూహం లోకి తెచ్చిన మొదటి వ్యక్తి  మాథ్యూ ఇసకోవిట్జ్.  దీనికంటే ముందు నేను చేసిన పనులపైన, నేను చేసిన డిజైన్ ల పైన, నిర్ణయాలు, ప్రోగ్రామ్స్ పైన నాకంత సంతృప్తి కరమైన ప్రోత్సాహం ఉండేది కాదు. 

దురదృష్టవశాత్తు, మాథ్యూ 2017 లో కన్నుమూశారు. సిద్ధాంతం ,  వ్యాపారం మరియు ఇంజనీరింగ్ గురించి మాథ్యూకు ఎప్పుడూ అరుదైన, గొప్ప అవగాహన  ఉండేది.  అతని కుటుంబం,  భవిష్యత్ తరాలకు మంచి అవగాహనను కల్పించాలని,  దానిని ఆ తరాలు అనుకరించాలని కోరుకొనే వారు. అందుకే ఆయన కుటుంబ సభ్యులు “ మాథ్యూ ఇసకోవిట్జ్ ఫెలోషిప్”  కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాది వారి  ప్రయత్నాలను పూర్తి చేయడానికి, వారు నన్ను ఆ ఫెలోషిప్ బోర్డులోకి సభ్యురాలుగా తీసుకువచ్చారు. గత సంవత్సరం ఇంజనీరింగ్ రంగంలో జూనియర్లు, సీనియర్లు లేదా పోస్ట్-గ్రాడ్ అయిన 24 మంది సభ్యులు ఉన్నారు.  మేము ఆ సంస్థను వాణిజ్య విభాగం లో ఉంచాము, కాబట్టి  అక్కడ వారు వ్యవస్థాపక అంతరిక్ష కేంద్రీకృత వాతావరణంలో అనుభవాన్ని పొందడానికి అవకాశాన్ని ఇచ్చినట్లైంది. ఆ సంస్థలో ఉన్న వారికి బయట నుండి ఒక మాస్టర్ ను మెంటార్ గా ఉంచాము, అది ఆ విద్యార్థులకు ఫెలోషిప్‌కు కూడా ఆ మెంటర్‌షిప్ ఉపయుక్తమైనది.  మా ఈ ప్రయత్నాలన్నీ కేవలం అనుభవం, ఇంటర్న్ షిప్ అనే అంశాల కంటే ఎక్కువగా ఉపయోగపడి,  వారు ఆ ఫెల్లోషిప్ కార్యక్రమం పాస్ కావడమే కాకుండా,  తర్వాత తరగతి విద్యార్థులకు, తన చుట్టూ ఉన్న వారికి  ఇవన్నీ వివరించే స్థాయి కి చేరుకునే అవకాశాలు అధికం చేశాయి. 

 

ఇప్పటికి వరకు మీ నేపథ్యం గురించి తెలుసుకున్నాము.  కాకపోతే,  ఇంకా ఎక్స్ప్లోర్ కాని  సౌర మండలం (గలక్టిక్) , సౌర కక్ష్యల పరిశోధనలో  మీ ప్రస్తుత స్థానం ఏమిటి?

 

నేను ప్రభుత్వ వ్యవహారాల్లో పనిచేస్తాను, కాబట్టి నేను ప్రాథమికంగా రెండు సంస్థలకు సంధిగా వ్యవహరిస్తాను. నాకు వాషింగ్టన్ D.C లో ఒక చిన్న కార్యాలయం ఉంది; ఒక ప్రత్యేక చిన్న  జట్టు, ఈ రెండు సంస్థలకూ, ప్రభుత్వ సంబంధిత పరిశ్రమను వృద్ధి చేయడంలో సహాయపడే అంశాలపై మేము నిమగ్నమై ఉంటాము. అలాగే, ఈ పాలసీ మేకర్స్ తో ఎప్పటికప్పుడు సత్సంబంధాలు ఏర్పరచుకొని,  పెరుగుతున్న నిబంధనలతో  మా పరిశ్రమాభివృద్ధిని సమతుల్యం చేస్తాము. నేను స్పేస్‌షిప్ -2  పే-లోడ్‌ల అభివృద్ధికి  ఉపయోగపడే సహాయాన్ని నేను అందిస్తుంటాను.  విశ్వ విద్యాలయాల నుండి , వ్యాపార దృక్పథం తో పని చేసే ఉన్నత క్వాలిటీ మైక్రో గ్రావిటీలను అందించే పరిశోధనా కేంద్రాల నుండి  స్పేస్ షిప్-2కు అవసరమైన పే-లోడ్ లను తెప్పించేందుకు పనిచేసే బృందం తో కలిసి ప్రయత్నిస్తుంటాను.  పరిశోధన, అభివృద్ధి మరియు శాస్త్ర అనువర్తనాల కోసం మేము ఏర్పాటు చేస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగపడేలా చూడటం పై  నాకు నిజంగా ఆసక్తి ఉంది!

 

భిన్న విద్యానేపధ్యాల నుండి వచ్చే వారికి,  అంతరిక్ష పరిశ్రమపై అత్యంత ఆసక్తి ఉన్న వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?

అన్ని రకాలైన అవకాశాలను వారు సద్వినియోగ పరచుకోవాలంటాను.  పాఠశాలలో  ఏర్పాటు చేస్తున్న క్లబ్ లలో కానీ, ఈ పరిశ్రమలో బాగా నైపుణ్యం, ప్రవేశం ఉన్నవారికి మెయిల్ చేయడం కానీ, మాట్లాడటం కానీ, జరగడం వల్ల, ఆ అంతరిక్ష పరిశ్రమ లో క్లబ్‌లో చేరడం లేదా మీరు నేర్చుకోవటానికి ఆసక్తి ఉన్న పరిశ్రమలోని ఎవరికైనా ఇమెయిల్ పంపడం వంటివి చెయ్యాలి.  ఈ ప్రయత్నాలన్నీ సాధారణమైనవి అయినా మరింత తెలుసుకోవడానికి అన్ని రకాల అవకాశాలను వెతకాలని నేను ఖచ్చితంగా చెబుతాను. నేను ఆ అంతరిక్ష పరిశ్రమను ప్రేమిస్తాను. ఎందుకంటే, మనమందరం ఆ అంతరిక్షం పై ప్రేమలో ఉన్నాము.  ఆ రోదసీ పై మనందరికీ ఉన్న ప్రేమ, అభిరుచి  కారణంగా అది మనందరినీ కలుపుతుంది. అంతేకాక, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకమయ్యేలా మనం ఆ పరిశ్రమ యొక్క భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఈ పరిశ్రమగురించి, ఎవరైనా వారి వారి కోరికల  గురించి మీతో మాట్లాడటానికి ఇష్టపడటాన్ని, మరింత లోతుగా ఆ పరిశ్రమ గురించి లోతుగా తెలుసుకొనేందుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారినీ, సాంకేతిక దృక్కోణం నుండి లేదా ఈ పనులకు మద్దతు ఇచ్చే అంశాలను కనుక్కోవడం చాల సులభం.  ఆ రకమైన అభిరుచి తో మమేకమవ్వడమనే భావన చాల గొప్పది. అందుకే అందరూ ఆ పరిశ్రమకు చేరుకోండి!

 

చివరగా, రాబోయే కాలం లో అంతరిక్ష పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చెందడాన్ని మీరు చూడాలనుకుంటున్నారు?

 

ఇప్పుడిప్పుడే మనకు కీలకమైన దశ వైపుకు మళ్ళాము.  ఎక్కడైతే, రోదసీ లోకి పంపే అనేక వాహనాలు ఉంటాయో, అక్కడ మనం వాణిజ్య పరమైన సేవలను అందించే స్థితికి చేరుకుంటాము.  ఎలాంటి చట్టపరమైన, క్రమబద్ధీకరణ అడ్డంకులు లేకుండా చూసినప్పుడు ఈ విన్నూత్న ప్రయోగాలు చేసేందుకు వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి.  ఈ పరిశ్రమకు  వాణిజ్య పరంగా భారీ అవకాశముందని ఎలా చెప్తున్నానంటే, ఈ పరిశ్రమకు తన స్వంత మార్కెట్ పరిధి ఉంది. అంతే కాక, ఈ పరిశ్రమ బ్రాండింగ్, మార్కెటింగ్, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక న్యాయవాదుల అవసరం ఎంతైనా ఉంది. అనేక రకాలైన నిపుణులు ఈ పరిశ్రమ వైపు మళ్లుతారన్నది నిర్వివాదాంశం. అదే నేనూ ఆశిస్తున్నాను. 

*****

 

ఒరిజినల్ ఇంటర్వ్యూ : మోలీ కేయార్న్స్  గురించి- 

ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో,  నాసా గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌లో మోలీ కియర్న్స్ డిజిటల్ మీడియా స్పెషలిస్ట్. ఆమె ఇటీవల అలబామా విశ్వవిద్యాలయం నుండి B.S. మార్కెటింగ్ , డిజిటల్ & సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 

*****

Please follow and like us:

14 thoughts on “ప్రమద -శిరీష బండ్ల”

  1. చాలా మంచి పరిచయం సర్. నేటి యువతకు మార్గదర్శకంగా ఉంది. అమ్మాయి శిరీష కు , మీకు హృదయపూర్వక అభినందనలు.
    ఆ విశేషాలు చదువుతూ ఉంటే సంకల్పం ఆయుధమైతే సాధించలేనిది ఏదీ లేదు అని అర్థం అయ్యింది 👌👏👏👏
    ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన నెచ్చెలి పత్రిక సంపాదకుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

    1. హృదయపూర్వకంగా మీరు తెలిపిన ఈ స్పందన అమూల్యమైనది..చాలా ధన్యవాదాలు సునంద మేడం..

  2. ఈ నెల 11 వ తేదీన అంతరిక్షంలోకి ప్రవేశింపబోతున్న తెలుగమ్మాయి శిరీష బండ్ల ఇంటర్యూను మీ అందమైన సులభమైన అనుసృజనతో అందరికి అందుబాటులోకి తెచ్చిన మీకు మరియు ఆ అమ్మాయికి అభినందనలు.

    1. మీ ఆత్మీయ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు సర్

    1. చాలా ధన్యవాదాలు మీ స్పందనకు

  3. 11.07.21 దేశం గర్వపడాల్సిన రోజు.మన తెలుగు బిడ్డ అంతరిక్షం లో దేశ జెండా రెపరెప లాడించే తరుణాన్ని సగర్వన్గా చెప్పుకోవాలి. దురదృష్టం ఏమంటే పాతాళం లోకి కుంచించిన మెదళ్లు “”అమ్మాయి ఏవిట్లు?”” అని అంతర్జాలం లో వెదుకుతున్నాయ్😢 గర్వించదగ్గ ఇంటర్వ్యూ అందించారు.ధన్యవాదాలు💐💐💐💐

    1. నిజం అన్న … ఖచ్చితంగ చెప్పారు.. ప్రత్యెక ధన్యవాదాలు మీ ఆత్మీయ స్పందనకు

    2. మీ ఆత్మీయ స్పందన విలువైనది..ధన్యవాదాలు అన్న

Leave a Reply to నాగభూషణం దాసరి Cancel reply

Your email address will not be published.