అవనీమాతకు అక్షరమాల

– ముప్పలనేని ఉదయలక్ష్మి

కనుచూపు అందినంతమేర పచ్చని పైరునేల

ఎదురుగాఉన్న నా  మనసులో భావపరంపర

ఆనందించే అద్భుత ఆకాశంలా

జీవితకాలం హత్తుకున్న నాన్నప్రేమలా

ఆలంబనై నిలబెట్టిన వెన్నెముకలా

అమ్మ మమకారానికి ప్రతిరూపం ఈభూమి !

కన్నపేగు దీవెనకు అస్థిత్వమయి

ఆర్ధిక ఉన్నతికి సోపానమై

ఈశ్వరుని దయకు ఇచ్ఛాస్వరూపిణివై

ఊపిరికి ఎదురీదే ఏటికి తీరంచూపి

ఓర్పు విలువకు ఉదాహరణను చేశావు

ఓపలేని బరువును  మోస్తూ గమ్యంకేసి నడిపావు

చల్లని మనసుతో   చలివేంద్రమయ్యావు

-2-

తల్లిలా ఆదుకుంటూ నమ్మకమై నిలబెట్టావు

పంటఫలమై భద్రతాకౌగిట్లో  భరోసానిచ్చావు

మమతాయతివై  సత్యశ్వాసల అంతః కరణమైనావు

హలంతో గాయపరుస్తున్నా వరాలే కురిపించావు

ఇన్ని ఇచ్చి నన్ను నీవుగా మార్చిన నా అవనీ …..

పంచభూతాత్మకమైన ఈ దేహం

నీలో ఒక రేణువుగా మారిపోతేకూడా

నీ ఋణం కొంతైనా తీరుతుందామ్మా  !!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.