
స్వరాలాపన-4
(మీ పాటకి నా స్వరాలు)
-డా||కె.గీత
మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.
మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను. మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!
***
చిత్రం: మాయాబజార్ (1957)
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
సంగీతం : ఘంటశాల & సాలూరు రాజేశ్వరరావు
రాగం: మోహన రాగం
ఆరో: స రి2 గ3 ప ద2 స*
అవ: స* ద2 ప గ3 రి2 స
లాహిరి లాహిరి లాహిరిలో
దదసస రిరిసస రిగసరిగా
ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా తూగెనుగా
గాదప గగరిస సారిగరీ గారిససా గారిససా
ఆ ఆ ఆ ….
సరిగపా దపదపా
ఆ ఆ ఆ ….
గపదసా రిసరిసా
చరణం:
తారా చంద్రుల విలాసములతో ఓ… ఓఓ
సరిగప పాపప పదాస దపపా దసదాపా
విరిసే వెన్నల పరవడిలో
పదదా పాగరి సరిరిపగా
ఉరవడిలో || తారా||
సరిరిపగా
పూల వలపుతో ఘుమఘుమలాడే
గాప దసససా దససస సరిసద
పిల్ల వాయువుల లాలనలో
దాస దాపపప పాసద పగరిస
లాహిరి లాహిరి లాహిరిలో
దదసస రిరిసస రిగసరిగా
ఓహో జగమే ఊగెనుగా, ఊగెనుగా తూగెనుగా
గాదప గగరిస సారిగరీ గారిససా గారిససా
ఆ ఆ ఆ ….
సరిగపా దపదపా
ఆ ఆ ఆ ….
గపదసా రిసరిసా
చరణం:
అలల ఊపులో తియ్యని తలపులు…..
చెలరేగే ఈ కల కలలో
మిల మిలలో
అలల ఊపులో తియ్యని తలపులు
చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమ నౌకలో
హాయిగ జేసే విహరణలో || లాహిరి||
చరణం:
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో
మధురిమలో
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే
చల్లని దేవుని అల్లరిలో
*****
*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-
https://www.youtube.com/watch?v=7ZBVOi5gJ-s

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
