
ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు
-యామిజాల శర్వాణి
చరిత్రలో అన్ని రంగాలలో పేరు ప్రఖ్యాతలు గడించిన మహిళలు ఎంత మందో ఉన్నారు రచయిత్రులుగా రాజకీయ వేత్తలుగా నటీ మణులుగా ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ప్రస్తుతము కొంతమంది మహిళా శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రములో (సైన్సులో) ప్రపంచానికి వారు అందించిన సేవలను గురించి తెలుసుకుందాము. ఇప్పటికే మేడమ్ క్యూరీ లాంటి పేరు ప్రపంచవ్యాప్తముగా సైన్సు చదువుకున్న అందరికి పరిచయమైనదే. అలాగే చాల మంది మహిళా శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ చాలా మందికి తగినంత గుర్తింపు రాలేదు అయినప్పటికీ వారి కృషి వారి సేవలు ప్రపంచము మరచిపోదు అటువంటి మహిళా శాస్త్రవేత్తలు ధృడ సంకల్పం తో వారు సైన్సు రంగములో చేసిన కృషిని తెలుసుకుందాము. వీరి కృషి చంద్రమండలం పై కాలు పెట్టటం దగ్గర నుండి కుష్టు వ్యాధి ట్రీట్మెంట్ వంటి అన్ని రంగాలలో మనకు కనిపిస్తుంది. వీరి కృషి నిజంగానే ప్రపంచ గతిని మార్చేసింది.. 1.మేడమ్ క్యూరీ(1867-1934) :-మహిళా శాస్త్రవేత్తలలో చెప్పుకోవలసి వస్తే మొదట మేడం క్యూరీ గురించి చెప్పుకోవాలి రేడియోధార్మికత మీద పరిశోధనలు చేసి రేడియం, పొలోనియం వంటి అతి ముఖ్యమైన రేడియోధార్మిక మూలకాలను కనిపెట్టి రేడియోధార్మికత అనే పదాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈవిడ ప్రముఖ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త. 1896 లో రేడియోధార్మికతను కనిపెట్టి రేడియో యాక్టివ్ ఐసోటోపులను వేరు చేసే టెక్నీక్ లను డెవలప్ చేసి మానవాళికి ఏంతో మేలు చేసింది. మొదటి ప్రపంచయుద్ధము సమయములో మొబైల్ X-రే యూనిట్ ను కనిపెట్టింది. 1903లో మొదటిసారిగా నోబెల్ బహుమతి అందుకున్న మహిళా శాస్త్రవేత్తగా చరిత్ర పుటలలోకి ఎక్కింది. అంతే కాకుండా 1911లో రసాయన శాస్త్రములో రేడియంను ఐసొలేట్ చేసినందుకు రెండవసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ,ఆ విధముగా రెండు సార్లు నోబెల్ బహుమతి పొందిన మహిళా శాస్త్రవేత్తగా భౌతిక రసాయన శాస్త్రాలలో రికార్డ్ సృష్టించింది మేడం క్యూరీ. X-రే మరియు యురేనియం పై జరిపిన పరిశోధనలు సైన్సులో అటామిక్ ఫిజిక్స్ అనే కొత్త రంగ రూపకల్పనకు దారితీసింది. 1934 లో తన పరిశోధనల ఫలితముగా ఎక్కువ కాలము హై ఎనర్జీ రేడియేషన్ కు ఎక్స్పోజ్ అవటం వలన చనిపోయింది. ఈవిడ భర్త కూతురు కూడ రేడియోధార్మికతలో పలు ప్రయోగాలు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు. 2.జానకి అమ్మాళ్ వృక్ష శాస్త్రవేత్త(1897-1984):-ఈవిడ భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త అనేక హై బ్రీడ్ పంటల స్పీసీస్ ను డెవలప్ చేసింది వాటిని నేటికీ రైతులు పండిస్తున్నారు. అటువంటి వాటిలో వంగ, చెరకు లలో ఆవిడ ఉత్పత్తి చేసిన వంగడాలు ప్రముఖమైనవి చెరకు లో ఆవిడ ఉత్పత్తి చేసిన వంగడాల వలన భారతదేశములో తీపిదనము ఎక్కువగా ఉండే చెరకును పండిస్తున్నారు. ఇంతకూ మునుపు ఆ వంగడాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొనేవారు. అవే కాకుండా, ఈవిడ అనేక రకాల పుష్పించే జాతుల మొక్కల క్రోమోజోముల పై విస్తృత పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలను “ద క్రోమోజోమ్స్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ “అనే పుస్తక రూపములో వెలువడింది. ఈ పుస్తక రచనలో ఆవిడ మరో వృక్ష శాస్త్రవేత్త సి.డి డార్లింగ్టన్ తో కలిసి పనిచేశారు. ఈవిడ కృషికి గుర్తింపుగా ఒక ప్యూర్ వైట్ పూలువుండే మొక్కకు ఆవిడ పేరు పెట్టారు ఆ మొక్క పేరు “మాగ్నోలియా కోబుస్ జానకి అమ్మాళ్” 3.షీన్ షుంగ్ వూ భౌతిక శాస్త్రవేత్త(1912-1997):-ఈవిడను చైనాలో “ఫస్ట్ లేడి ఆఫ్ ఫిజిక్స్” అంటారు అలాగే చైనా మేడం క్యూరీ అని కూడా అంటారు. చైనాలోని షాంగై సమీపాన గల చిన్న గ్రామములో మే 31, 1912లో జన్మించిన ఈవిడ 1936లో అమెరికా వచ్చి యునివేర్సిటి ఆఫ్ మిచిగాన్ లో Ph.D చేసి అమెరికన్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిస్ట్ గా బీటా డికె మీద పరిశోధనలు చేసి ఆ ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసింది. ఈవిడ పరిశోధనలు “ద వూ ఎక్స్పెరిమెంట్స్” గా ప్రసిద్ధి కెక్కాయి. ఈవిడ చేసిన పరిశోధనలు ఆవిడ సహచరులకు 1957లో నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. కానీ ఆవిడ పరిశోధనలకు గుర్తింపుగా 1978లో భౌతిక శాస్త్రములో వుల్ఫ్ బహుమతి వచ్చింది 4. కెరొలిన్ హెర్స్చేల్ అస్ట్రానమర్ (1750-1848):-ఆస్ట్రానమీలో పరిశోధనలు చేసి గుర్తింపు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా చెప్పవచ్చు. ఈవిడ తోకచుక్కను కనిపెట్టిన ఘనత పొందింది. తన శాస్త్రీయ పరిశోధనలకు గాను జీతము తీసుకున్న మహిళా శాస్త్రవేత్త కూడా ఈవిడే. అలాగే 1780 లోనే బ్రిటన్ కు చెందిన రాయల్ సొసైటీలో గౌరవ సభ్యత్వాన్ని పొందిన మొదటి మహిళా కూడా ఈవిడే. ఈవిడ తన సోదరుడైన విలియం తో కలిసి రాత్రులందు ఆకాశాన్ని పరిశోధించి ఇద్దరు 2,500 నేబులే మరియు స్టార్ క్లస్టర్లను రికార్డ్ చేశారు. ఈవిడ ఒక్కత్తే 14 నేబులే ఎనిమిది తోకచుక్కలు కనిపెట్టింది. ఆవిడ కనిపెట్టిన విషయాలను అస్ట్రానమర్ రాయల్ కు పంపగా 1787లో 3వ కింగ్ జార్జ్ ఆవిడకు నెల జీతము అఫర్ చేశారు . ఆవిడ కెరీర్ లో సుమారు 500 ల నక్షత్రాలపై పరిశోధనలు చేసి 1848లో 97 ఏళ్ల వయస్సులో చనిపోయింది. .. 5.ఎలీస్ బాల్ రసాయన శాస్త్రవేత్త( 1892-1916) :-ఈవిడ 20 ఏళ్ల వయస్సులోనే 20వ శతాబ్దము ఆరంభములో కుష్టు వ్యాధి ట్రీట్ మెంట్ లో ప్రగతి సాధించింది. వాషింగ్టన్ మరియు హవాయి యూనివర్సిటీల నుండి డిగ్రీలు పుచ్చుకొంది. ఈవిడ హవాయి యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న మొదటి మహిళ. అక్కడే ఆవిడ కుష్టు వ్యాధి నయము చేయటానికి పరిశోధనలు ప్రారంభించి మొదటిసారిగా ఇంజక్టబుల్ లెప్రసీ ట్రీట్ మెంట్ ను డెవలప్ చేసింది. ఈ ఇంజక్షన్ ను ఒక చెట్టు ఆయిల్ నుండి డెవలప్ చేసింది. ఈ రకమైన ట్రీట్ మెంట్ ను బాల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ను కొన్ని వేలమంది లెప్రసీ రోగులను నయము చేయటానికి వాడారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మేధావి 24 ఏళ్ల వయస్సుకే ప్రయోగశాలలో క్లోరిన్ గ్యాస్ కు ఎక్స్పోజ్ అవటం వలన చనిపోయింది. 6.కేథరీన్ జాన్సన్ గణిత శాస్త్రవేత్త (1918-2020):-ఈవిడ నాసా కేంద్రములో గణిత శాస్త్రవేత్తగా ఉండి స్పేస్ మిషన్ పరిశోధనలలో పాలు పంచుకుంది. ఈవిడను హ్యూమన్ కంప్యూటర్ గా ప్రశంసించారు. ఈవిడ అపోలో 11లాంటి ఎన్నో స్పెస్ క్రాఫ్ట్ ల ఫ్లయిట్ పాత్ లను క్యాలుక్యులేట్ చేసి అనలైజ్ చేయటానికి సహాయపడింది. ఈవిడ కృషి వలన అపోలో స్పెస్ క్రాఫ్ట్ చంద్రమండలం మీద దిగి మళ్లా భూమికి తిరిగి వచ్చింది. ఈవిడ అనేక క్లిష్టమైన గణిత సమస్యలను సులువుగా పరిష్కరించేవారు. ఈవిడ క్యాల్యుక్యులేషన్స్ అనేక మంది రోదసి యాత్రికులను అంతరిక్షంలోకి పంపటానికి సహాయపడ్డాయి. కేథరిన్ 101 సంవత్సరాల వయస్సులో 2020 లో మరణించింది. ఈవిడ జీవిత చరిత్రను 2016లో హిడెను ఫిగర్స్ అనే పేరుతొ సినిమాగాతీసారు ఈ సినిమాలో ఈవిడ పాత్రను తరాజి పి హెన్షన్ తెరపై పోషించింది. . 7.రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రసాయన శాస్త్రవేత్త :-వాట్సాన్ మరియు క్రీక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు DNA నిర్మాణాన్ని కనుగొన్న ఘనత చేజిక్కుంచుకున్నారు. కానీ వారి పరిశోధనలు విజయవంతమవటానికి రోజలిండ్ కృషి ఏంతో ఉంది.ఈ ఇంగ్లీష్ శాస్త్రవేత్త ఫిజికల్ కెమిస్ట్రీలో కేంబ్రిడ్జ్ యునివర్సిటి నుండి Ph.D తీసుకొ
*****

నా పేరు యామిజాల శర్వాణి. M.B.A, B.Ed చేశాను. కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో గృహిణి పాత్ర నిర్వహిస్తున్నాను. అడపాదడపా ఇలా కొన్ని రచనలు చేస్తుంటాను. నా రచనలు బాలల పత్రికలైన బుజ్జాయి వంటి వాటిలో ప్రచురితమయ్యాయి.
