గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

నులివెచ్చని మనప్రేమను ధ్యానంలో చూసుకోనీ

చలి పెంచిన తలపులనొక కావ్యంగా రాసుకోనీ

విరిచూపులు విసిరినపుడు ఎదలోపల సరిగమలు

కంటి మెరుపు పూయించిన కుసుమాలను కోసుకోనీ

నీ చూపులు నా తనువున తుమ్మెదలై చరించెను

సిగ్గులన్ని పూవులుగా నీ పూజను చేసుకొనీ

తలపు కౌగిలించినపుడు తనువణువూ తరించెను

వలపునంత  దండ చేసి నీమేడలో వేసుకోనీ

చెలి వలచిన ప్రేమికుడవు హరివిల్లై విరిసావు

పదిలముగా నీ చిత్రమే మదినిండగ గీసుకోనీ

ఇద్దరొకటై లోకమిపుడు మాయమయె చిత్రంగా

నా దేహము లోనె నేను నీ ఊపిరి తీసుకోనీ

*****

Leave a Reply

Your email address will not be published.