image_print

నువ్వు లేని ఇల్లు (కవిత)

నువ్వు లేని ఇల్లు -డా|| కె.గీత నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని రిక్కించుకుని ఉండే చెవులు కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా సాయంత్రం గూటికి చేరే వేళ నువ్వు కనబడని ప్రతి గదీ కాంతివిహీనమై పోయింది నువ్వు వినబడని ప్రతీ గోడా స్తబ్దమై వెలవెలబోయింది నీతో తాగని ఈవెనింగ్ కాఫీ ఖాళీ కప్పై సొరుగులో బోర్లా పడుకుంది […]

Continue Reading
Posted On :

జగదానందతరంగాలు-1(ఆడియో) ఎంత బెంగనిపిస్తుంది?

https://www.youtube.com/watch?v=oBtGD-dbmfk జగదానందతరంగాలు-1 ఎంత బెంగనిపిస్తుంది? -జగదీశ్ కొచ్చెర్లకోట   ఎంత బెంగనిపిస్తుంది? నీగది రేపట్నుంచి నీదికాదు.  అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి.  ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి తెరుస్తావు.  వ్యాపకానికి కాదు. జ్ఞాపకాలకోసం!  లెక్కల పుస్తకం తెరిస్తే లెక్కలేనన్ని మధురానుభూతులు! స్నేహితులతో అరకు వెళ్ళినపుడు కొన్న నెమలీకల విసనకర్ర మొత్తం పాడైపోయినా ఒక పింఛాన్ని అత్యంత శ్రద్ధగా దాచుకున్నావు. గుర్తుందా? దానికోసం తాటాకుల్లోంచి మేతకూడా తెచ్చిపెట్టావు.  నీపేరు కనుక్కోమని మొదటి పేజీ నుంచి ముప్ఫయ్యారో […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నులివెచ్చని మనప్రేమను ధ్యానంలో చూసుకోనీ చలి పెంచిన తలపులనొక కావ్యంగా రాసుకోనీ విరిచూపులు విసిరినపుడు ఎదలోపల సరిగమలు కంటి మెరుపు పూయించిన కుసుమాలను కోసుకోనీ నీ చూపులు నా తనువున తుమ్మెదలై చరించెను సిగ్గులన్ని పూవులుగా నీ పూజను చేసుకొనీ తలపు కౌగిలించినపుడు తనువణువూ తరించెను వలపునంత  దండ చేసి నీమేడలో వేసుకోనీ చెలి వలచిన ప్రేమికుడవు హరివిల్లై విరిసావు పదిలముగా నీ చిత్రమే మదినిండగ గీసుకోనీ ఇద్దరొకటై లోకమిపుడు మాయమయె చిత్రంగా […]

Continue Reading

కంప్యూటర్ భాషగా తెలుగు-5

ఆన్ లైన్ – తెలుగు విస్తరణ -డా||కె.గీత తెలుగుభాష  కంప్యూటర్ల మీద వాడుకలోకి వచ్చిన 90’వ దశకం పూర్వార్థం నుండి ఇప్పుడు 2020వ దశకం ప్రారంభం వరకూ తెలుగు ప్రస్థానంలో విప్లవాత్మకమైన మార్పు యూనికోడ్ వచ్చిన తర్వాతే జరిగింది. తెలుగుకి సంబంధించి తొలిదశలో ప్రారంభమైన ఎన్నో సైట్లు యూనికోడ్ లేకనే విఫలమయ్యాయని చెప్పవచ్చు. “ఆన్ లైన్” అంటే కంప్యూటరు తో కంప్యూటరు, నెట్ వర్కు తో నెట్ వర్కు “అనుసంధానం” అయి ఉండడం. ఇలా అనుసంధానంలో  విజయవంతంగా […]

Continue Reading
Posted On :

మా కథ -5 దొమితిలా జీవితం

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం పులకాయోలో నా బాల్యం నేను సైగ్లో-20లో 1937 మే 7న పుట్టాను. నాకు మూడేళ్ళప్పుడు మా కుటుంబం పులకాయోకు వచ్చేసింది. అప్పట్నించి నాకు ఇరవై ఏళ్లిచ్చేవరకు నేను పులకాయోలోనే గడిపాను. ఆ ఊరికి నేనెంతో రుణపడి వున్నాను. ఆ ఊరిని నా జీవితంలో ఒక భాగంగా భావిస్తాను. నా హృదయంలో పులకాయోకు, సైగ్లో – 20కి ముఖ్యమైన స్థానాలున్నాయి. నా బాల్యమంతా అంటే […]

Continue Reading
Posted On :