షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం రాసుకుంటారో తెలియనికాలమిది. బిడ్డా.! జీవితం సీరియల్ కాదురా..!ఇప్పుడో షార్ట్ ఫిలిం. ***** కె.మునిశేఖర్కె.ముని శేఖర్ కవి, రచయిత. నివాసం గద్వాల్ జిల్లా నారాయణపురం.
Continue Reading
కొత్తేమీ కాదు –కె.మునిశేఖర్ త్వరలో యాభైవేల ఉద్యోగాలుభర్తీ అనంగనే సచ్చినపాణం లేసొచ్చినట్లయిఆగబేగ పట్నం పైనమైనం ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అనంగనేకన్నవారిని కళ్ళల్లో పెట్టుకునేరోజులొచ్చెనని తెగసంబురపడ్డాం ఖాళీల లెక్క తేల్చండనిఅధికారులకు ఆదేశాలొస్తే..తప్పిన మా జీవితపు లెక్కనుసరిచేసుకోవచ్చనుకున్నం కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లుకు తడిసిపోవడం మాకుకొత్తేమీ కాదు గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ..కొన్నాళ్ళకు నిరాశ చెందిన గాలొదిలినబెలూన్ అవ్వడం మాకు అలవాటేకానీ…చిన్నఆశ మా ఆశలు, ఆశయాలు సర్కారుపక్షపాతపు కొక్కానికి వేలాడుతుంటే చూసి..కనబడనికన్నీళ్ళ మూటలు మోస్తున్నబతుకులు మావి పోయినంత దూరం తలూపడానికిమీ పెరట్లో పాలేరులం కాదు.!రేపటి మీ ఉనికిని ప్రశ్నించేపట్టభద్రులం ***** కె.మునిశేఖర్కె.ముని శేఖర్ కవి, […]
Continue Reading
scroll to top
error: Content is protected !!