షార్ట్ ఫిలిం (కవిత)
షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం రాసుకుంటారో తెలియనికాలమిది. బిడ్డా.! జీవితం సీరియల్ కాదురా..!ఇప్పుడో షార్ట్ ఫిలిం. ***** కె.మునిశేఖర్కె.ముని శేఖర్ కవి, రచయిత. నివాసం గద్వాల్ జిల్లా నారాయణపురం.
Continue Reading