కొత్తేమీ కాదు

కె.మునిశేఖర్

త్వరలో యాభైవేల ఉద్యోగాలుభర్తీ అనంగనే సచ్చినపాణం  లేసొచ్చినట్లయిఆగబేగ పట్నం పైనమైనం ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అనంగనేకన్నవారిని కళ్ళల్లో  పెట్టుకునేరోజులొచ్చెనని తెగసంబురపడ్డాం ఖాళీల లెక్క తేల్చండనిఅధికారులకు ఆదేశాలొస్తే..తప్పిన మా జీవితపు లెక్కనుసరిచేసుకోవచ్చనుకున్నం కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లుకు తడిసిపోవడం మాకుకొత్తేమీ కాదు గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ‌..కొన్నాళ్ళకు నిరాశ చెందిన గాలొదిలినబెలూన్ అవ్వడం మాకు అలవాటేకానీ…చిన్నఆశ మా ఆశలు, ఆశయాలు సర్కారుపక్షపాతపు కొక్కానికి వేలాడుతుంటే చూసి..కనబడనికన్నీళ్ళ మూట‌లు మోస్తున్నబతుకులు మావి పోయినంత దూరం తలూపడానికిమీ పెరట్లో పాలేరులం కాదు.!రేపటి మీ ఉనికిని ప్రశ్నించేపట‌్ట‌భద్రులం

*****

One thought on “కొత్తేమీ కాదు (కవిత)”

  1. కవిత చాలా బాగుంది.. ప్రశ్నించే గొంతుక లకు మరో స్వరం తోడైంది..అభినందనలు..

Leave a Reply

Your email address will not be published.