కవిత్వం జీవితం సమాంతరేఖలని విశ్వనించే నేను జర్నలిజం వృత్తిలో కొనసాగాను. ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఫ్రీలెన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నాను. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్. 360 డిగ్రీస్‘ పేరుతో 59 వ్యాసాల సంపుటిని వెలువరించాను. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల వారిగా సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్రతో కూడిన పుస్తకాలను వెలువరిస్తుండటంలో భాగంగా ’అంబర్ పేట ః ఆకాశానికి పూసిన మందారం‘ పేరుతో 225 పేజీలతో కూడిన పుస్తకంను 2019 వెలువరించడం జరిగింది. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంపై పని కొనసాగుతున్నది.
పూల పరిమళ స్నేహం -కోడం పవన్ కుమార్ ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి కలయికలోఒక మొక్క జీవం పోసుకునేదిఒక ఆత్మీయత టీ కప్పును పంచుకునేదిఒక బాధ మేఘమై ఆకాశంలో పరుగులు పెట్టేదికాలం క్షణాల్లో కరిగికలుసుకున్న చోట తీపి గురుతును వదిలేదిమైదాన ప్రాంతాలను వదిలిమహానగరాలను దాటిమెరీనా తీరం వెంట అలలై దూకేవాళ్ళంఅలసి అలసి […]
నిన్నర్థం చేసుకుంటున్నాను -కోడం పవన్ కుమార్ ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నానుఇకనుంచి నేను నిన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను వంటగది తాలింపు వాసనలోనీ చెమట సౌందర్యం కానరాలేదుతలలోంచి గుప్పెడు మల్లెలు మత్తెక్కిస్తుంటేనీవొక మాంసపు ముద్డగానే కనిపించావుఇంట్లో ఇంటిచుట్టూ పరుచుకున్నలెక్కలేనన్ని నీ పాదముద్రల్లోశ్రమ సౌందర్యాన్ని గుర్తుపట్టలేకపోయానుఇంట్లోని అన్ని అవసరాలను చూసుకునేమరయంత్రంగానే భావిస్తూమాటల కీ ద్వారా నా అవసరాలను సమకూర్చుకున్నానువిశ్రాంతి కోసమోనిద్ర కోసమోపడకమీద నడుం వాల్చితేనాలోని కోర్కెకు అక్కరకొచ్చేఅపూర్వమైన కానుకగానే భావించానుపురిటినొప్పులతో మెలికలు తిరుగుతుంటేమొలక పూసిన ఆనందభాష్పాలు నీ కంటినుంచి రాలుతుంటేస్త్రీగా నీ బాధ్యత తీరిందని కొట్టిపడేశానునీ ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండాగాల్లో గిరికీలు కొడుతున్న నన్నుఓ వేణునాదాన్ని చేద్దామన్న నీ […]