నిర్గమించిన కలలు (కవిత)
నిర్గమించిన కలలు (కవిత) -సుజాత.పి.వి.ఎల్ నిరీక్షణలో నిర్గమించి..కలలు మరచికలత నిదురలోకలవరపడుతున్న కనులు బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..ముళ్ళతో ముడిపడిన నా జీవితం..ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?సంతోషాలన్నీనీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..పెదవులపై చిరుదరహాస దివిటీని వెలిగిచడం ఎలా!?నా కళ్ళలో కన్నీటి చారికలు కనిపించకూడదన్నావు..నువ్వే కనిపించనంత దూరాన దాగున్నావు..నీవు లేని భూతలంనాకు శూన్యాకాశమని మరిచావు..అందుకే..నిన్ను చేరలేని దూరాన్ని తుడిచేస్తూకళ్ళమాటు దాగిన జ్ఞాపకాల ఆణిముత్యాల తలపులనుఆఖరిసారిగా తిరగేస్తున్నాయి అరమోడ్పు కనులు..! ***** సుజాత.పి.వి.ఎల్పేరు సుజాత.పి.వి.ఎల్. వృత్తి హిందీ టీచర్. సికిందరాబాద్ లో నివాసం. కవితలు, […]
Continue Reading