అమ్మ బహుమతి! (కవిత)
అమ్మ బహుమతి! -డా|| కె. గీత నిన్నా మొన్నటి శిశుత్వంలోంచి నవ యౌవ్వనవతివై నడిచొచ్చిన నా చిట్టితల్లీ! నీ కోసం నిరంతరం తపించే నా హృదయాక్షరాలే అక్షతలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నా నీకు పద్ధెనిమిదో పుట్టినరోజు శుభాకాంక్షలు! నీ చిన్నప్పుడు మొదటి టీకా రాత్రి నువ్వు కింకపెడుతూ ఏడుస్తున్నపుడు తడిసిన నా భుజాన కన్నీళ్లు నావే వచ్చీరాని నడకల్తో నాకోసం గేటు దగ్గిర కాపలా కాసి వీథి చివరకి పరుగెత్తుకొచ్చి పడ్డప్పుడు నీ మోకాలి మీద చివికిన రక్తం నాదే నీ ముద్దు ముద్దు మాటలు ఇంకా తాజాగా నా గుండెల్లో రోజూ పూస్తూనే ఉన్నాయి నీ బుల్లి అరచేత పండిన గోరింట నా మస్తకంలో అందంగా అప్పటి నుంచీ అలా వేళ్లాడుతూనే ఉంది క్రమశిక్షణా పర్వంలో నేను నిన్ను దార్లో పెట్టడం పోయి నువ్వు నన్ను దూరం పెట్టినపుడల్లా Continue Reading