image_print

కథామధురం-ఆ‘పాత’కథామృతం-18 ఆచంట కొండమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-18 “శ్యామల” – ఆచంట కొండమ్మ  -డా. సిహెచ్. సుశీల 1935 గృహలక్ష్మి పత్రిక జూన్ నెలలో ప్రచురింపబడిన ఆచంట కొండమ్మ రచించిన ” శ్యామల” కథ ఒక ‘ట్రయాంగిల్ లవ్ స్టొరీ ‘. ఆ రోజుల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఒక ఆశ్చర్యం. అదీ ఒక రచయిత్రి రాయడం అంటే సంచలనమే. ఆడపిల్లలు కాలేజీ చదువుల వరకు రావడం, పొరుగూరుకి వెళ్ళి చదవడం, అక్కడ ‘ప్రేమ’ చిగురించడం అనే కథాంశం […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-17 శ్రీమతి అలివేలు మంగతాయారు

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-17 ” పరివర్తనము” -శ్రీమతి అలివేలు మంగతాయారు  -డా. సిహెచ్. సుశీల సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు పరదేవతను తన్మయత్వంతో కీర్తించారు. భక్తి తో అర్చించారు.  ఆ “సౌందర్యం” కేవలం శారీరక సౌందర్యం కాదు. మాతృమూర్తి అన్న భావం. జ్ఞానప్రదాయిని  అన్న భావం. ప్రబంధ కవులు కూడా ప్రబంధ నాయికను నఖశిఖ పర్యంతం వర్ణనలతో నింపివేశారు. ప్రబంధ లక్షణాల్లో ,’అష్టాదశ వర్ణనలు’ ఒకటి. ఇక్కడ ఈ వర్ణనలు కేవలం బాహ్య సౌందర్యమే. తర్వాతి కాలంలో […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-16 పులిపాక బాలాత్రిపురసుందరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-16 ” పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము” -పులిపాక బాలాత్రిపురసుందరమ్మ  -డా. సిహెచ్. సుశీల           ad vertere అనే లాటిన్ పదం నుండి ఆంగ్లం లో advertisement అనే పదం వచ్చింది. “ఒక వైపుకి తిరగడం” అని తెలుగు లో అర్ధం. ప్రేక్షకులను తమ వైపుకి తిప్పుకోవడం “ప్రకటన” ప్రధాన లక్షణం, లక్ష్యం. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఏదైనా సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-15 ఆచంట సత్యవతమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-15 “గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే” — ఆచంట సత్యవతమ్మ  -డా. సిహెచ్. సుశీల ఆది శంకరాచార్యుల వారు యావద్భారత దేశం పర్యటించి హైందవం, సనాతన ధర్మం సంబంధిత గ్రంథాలను, భాష్యాలను, వ్యాఖ్యానాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేకమంది శిష్యులు వారిననుసరించారు. శంకరాచార్య నాలుగు ప్రముఖ పీఠాలను ఏర్పాటు చేయడమే కాక సన్యాసుల కొరకు వివిధ ప్రాంతాలలో మఠాలను ఏర్పాటు చేసారు. శంకరుల వారి తదనంతరం వారి శిష్య ప్రశిష్య గణాలు […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-14 భాస్కరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-14 ప్రభావతి – రచయిత్రి “భాస్కరమ్మ”  -డా. సిహెచ్. సుశీల ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 ఆగస్టు, భారతి పత్రికలో ప్రచురించబడింది.            కాకినాడ పట్టణంలో శాస్త్రవిజ్ఞానంలోను, సంప్రదాయ, సంపదలలోను, దాతృత్వం లోను యోగ్యుడైన ఒక నియోగ బ్రాహ్మణుడు పెమ్మరాజు గోపాల్రావుగారి సంతానములో మొదటి పుత్రిక లక్ష్మీదేవమ్మ. ఆమెకు పదునారవ ఏట ఒక కుమారుడు పుట్టిన ఆరు నెలలకే భర్త మరణించగా పిల్లవాడిని అల్లారుముద్దుగా […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగు నాటకరంగంలో పూర్వం స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించడానికి కారణం నాటకాల్లో నటించడం సంసారపక్షం స్త్రీలకు కూడదన్న బలమైన విశ్వాసం సమాజంలో ఉండడమే. ఈ నాటికీ నాటకాల్లో స్త్రీ పాత్రలు చాలా పరిమిత సంఖ్యలో ఉండడం గమనించవచ్చు. అలాంటి రోజుల్లో నాటక చరిత్రలో ప్రముఖుడు బళ్ళారి రాఘవ తను ప్రముఖ న్యాయవాది అయినా నాటకరంగం పట్ల ప్రత్యేకాభిమానంతో, నిజానికి అదే తన జీవిత […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగులో తొలి కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ అన్న ప్రచారం విస్తృతంగా ఉన్నా, స్త్రీవాదులు ప్రత్యేకంగా శ్రద్ధగా పట్టుదలగా చేసిన పరిశోధన వల్ల 1902లో భండారు అచ్చమాంబ గారి ” ధన త్రయోదశి” తొట్టతొలి కథ అని నిర్ధారణ అయింది. 1893 నుండే ఆమె చాలా కథలు రాసినట్టు తెలిసినా 10 మాత్రమే లభ్యమై నాయి. అలాగే అనేక కథలు, […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-11 ఆచంట శారదాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-11 ఆచంట శారదాదేవి  -డా. సిహెచ్. సుశీల స్త్రీలు కలం పట్టిన నాటి నుండి కూడా ‘ స్త్రీ పురుష సంబంధాలలోని అసమాన తలు’ గురించి అవగాహనతో రాసినట్టే స్పష్టమవుతోంది. భర్త ఎలాంటి వాడైనా అతన్ని భరించడం, పూజించడమే ‘సతీ ధర్మం’ వంటి కథలు కొన్ని వచ్చినా, ‘ స్త్రీ కి మెదడు ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచనలు అభిరుచులు ఉంటాయి’ అన్న స్పృహ తో రాసిన కథలే ఎక్కువ. భావుకత, ప్రకృతి […]

Continue Reading