
“నెచ్చెలి మాట”
“అభినందన మందారమాల”
-డా|| కె.గీత
“నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది.
విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ప్రతినెలా 10 వ తారీఖున తప్పనిసరిగా మీముందుకు వచ్చే “నెచ్చెలి” వనితా మాస పత్రికలో ఆసక్తిదాయకమైన ధారావాహికలు, కాలమ్స్ తో బాటూ కథలు, కవిత్వమూ, ఇంకా అనేకానేక శీర్షికలూ మీ సాహిత్యపూదోటలో ఎప్పటికీ దాచుకునే అపురూప కుసుమాలై ప్రత్యక్షమవుతాయి.
నెచ్చెలిలో లబ్దప్రతిష్టులతో బాటూ చక్కని అభివ్యక్తి కలిగిన కొత్త వారికీ స్థానం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల నుండీ వసుధారాణి రాస్తున్న “ఇట్లు మీ వసుధారాణి” కాలమ్ ప్రారంభం అవుతూంది.
“నెచ్చెలి” ఇంగ్లీషు లోనూ పేరున్న వారితో బాటూ, యువరచయిత(త్రు)లు రాస్తున్న చక్కని కాలమ్స్, కథలు, కవితలూ ఉన్నాయి.
నెచ్చెలిని అద్భుతంగా ఆదరిస్తున్న సాహిత్య ప్రేమికులైన మీ అందరికీ నెచ్చెలి అందిస్తూన్న రచనాభినందనమందారమాల ఇది-
కాలమ్స్
చంద్ర లత – ఉనికి పాట – మనిషికి ప్రకృతికీ మధ్యన నిరంతరం సాగే అనివార్య ఉనికిపాట్ల ఆకళింపు
సి.రమణ -రమణీయం- అందాల జీవితంలోరమణీయాంశాల పరిచయం
డా|| గోగు శ్యామల – పునాది రాళ్ళు – తెలంగాణా దళిత స్త్రీల చరిత్రలు
షర్మిల కోనేరు -షర్మిలాం”తరంగం” – అంతరంగాన్వేషణ
జగద్ధాత్రి -ప్రమద – నెలానెలా ప్రపంచవ్యాప్త సాహితీమణుల పరిచయం
గణేశ్వరరావు-చిత్రం – ఫోటో కథలు
వసుధారాణి- “ఇట్లు మీ వసుధారాణి”- నెచ్చెలితో ప్రత్యేకంగా రాణమ్మ కబుర్లు
డి.కామేశ్వరి -జ్ఞాపకాల సందడి- సరదా జ్ఞాపకాల గల్పికలు
ధారావాహికలు
జ్యోతిర్మయి మళ్ల -గజల్ జ్యోతి – నెలానెలా ఒక సచిత్ర గజల్
నాగరాజు రామస్వామి -క’వన’ కోకిలలు- నెలానెలా ప్రపంచవ్యాప్త కవితామణుల పరిచయం
ఆర్టిస్ట్ అన్వర్ -చిత్రలిపి- బొమ్మల కథలు
ఎన్. వేణుగోపాల్ (అనువాదం)- మా కథ (దొమితిలా చుంగారా ఆత్మకథ)
జగద్ధాత్రి – కథా మధురం – నెలనెలా ఒక మంచి తెలుగు కథ – పరిచయం
ఆర్. శాంతసుందరి – అనుసృజన – అనువాద సాహిత్యశీర్షిక
కె.వరలక్ష్మి – జీవనయానం (రెండవ భాగం) – ఆత్మకథ
విమర్శ
కాత్యాయనీ విద్మహే – నారి సారించిన నవల- తెలుగులో స్త్రీల నవలల సమగ్ర పరిశీలన
వ్యాసాలు
డా||కె.గీత -కంప్యూటర్ భాషగా తెలుగు (నెలనెలా తెలుగు భాష ని కంప్యూటరీకరించడం వెనుక దాగున్న ఆసక్తికర అంశాల పరిచయం)
ఆడియో& వీడియో
కిరణ్ ప్రభ -నారీ”మణులు”- ప్రసిద్ధ స్త్రీలపై టాక్ షో
డా||కె.గీత -వెనుతిరగని వెన్నెల (ఆడియో నవల)
ట్రావెలాగ్స్
డా||కె.గీత -యాత్రాగీతం- ప్రపంచ వ్యాప్త యాత్రా కథనాలు
బాల నెచ్చెలి
అనసూయ కన్నెగంటి -చిన్నారులకు ప్రత్యేకంగా ”తాయిలం”కథలు
Neccheli-English
Varudhini- Diary of a New Age Girl (An Indo American High School girl’s experiences (K.Geeta’s Daughter & The third generation Author)
Sahithi- Behind The Scenes Of “Time” Machines (Stories of an enthusiastic Photographer’s eye)
Swatee Sripada- A Translated Story and A Poem every month
Jagadhatri- America Through My Eyes -Naa Kallatho America Translated Travelogs of DrK.Geeta
Dr Geeta Madhavi Kala- Monthly Essays- Telugu As A Computational Language (Interesting aspects behind the computerization of Telugu)
And many more specials-
ఇంకా అనేక కథలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు నెల నెలా మీకోసం-
మీ అభిప్రాయాలు అందజేసి వీరందరినీ ఆశీర్వదించడం మరిచిపోకండేం!
p.s: “నెచ్చెలి” కి పురుషులు కూడా నిరభ్యంతరంగా రాయవచ్చు. (వివరాలకు “రచనలు- సూచనలు” పేజీ చూడండి)
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

Good. Beginning. Wish you all the best.
Thank you Shyamala garu-
మహిళా లోకానికి సరికొత్త నెచ్చెలి మీ నెచ్చెలి అంతర్జాల మాసపత్రిక.వినోద,విజ్ఞానదాయకంగా ఉంది డాక్టర్ గీతగారు .అభినందనలు.
వసుధ గారూ, థాంక్యూ సో మచ్