జ్ఞాపకాల సందడి-15

-డి.కామేశ్వరి 

వరలక్ష్మీవ్రతం  నాడు తప్పకుండ నాకు  గుర్తువచ్చే మాట ఓటుంది. మా అక్క  బావ  ఓసారి పూజ  టైంకి  మాఇంట్లో వున్నారు . అక్కని ,నన్నుచూసి మావారు వీళ్ళు మన భార్యలు  మనడబ్బు  ఖర్చుపెట్టి మళ్ళీ జన్మలో మంచి మొగుడు రావాలని పూజలు  చేస్తారు ఎంత అన్యాయం అంటూ  జోకారు.నేను ఊరుకోనుగా  ఆలా కోరుకున్నారంటే దానర్ధం ఏమిటో మరి రిటార్ట్ ఇచ్చా , మా బావగారు అయితే  మరి మేం  ఏ కేటగిరి  అంటారు  అన్నారు .నే  జవాబు ఇచ్చే లోగానే మా ఆయనగారు ఈ ఆడవాళ్ళకి  ఎం చేసిన మెప్పు,తృప్తి వుండదండి రోజంతా వాళ్ళ కొంగు పట్టుకు  తిరగాలనుకుంటారు  ఆడవాళ్ళ ల మొగాడు ఎక్సప్రెస్ చెయ్యడు,మా ప్రేమ గుండెల్లో  ఉంటుంది  అడవారికీ  అర్ధం  కాదు అన్నారు గొప్పగా . ఎంతయినా రచయిత్రినికదా ‘అబ్బో  ఇనపెట్టి నిండా డబ్బుంది అంటే ఎంలాభం ,అది తీసి ఖర్చుపెట్టినపుడు గదా తెలుస్తుంది పోనీ ఓ సారి తలుపు తీసన్న చూపిస్తే గదా తెలుస్తుందిఅన్న . నిజమేగదా నీవంటే నాకిష్టం ,నీవు ఈచీరలో ఎంతబాగున్నావో ,నీ చేతిలో. ఏదోవుంది ఎంతబాగుందో కూర ,లాటి మాటలు ,డబ్బుఖరచలేనిమాటలు కూడా అనడానికి  మగాళ్ళకి నోరుపెగలదు ఇంట్లో పెళ్ళాం గదా అనేదేంవుంది అని మెచ్చుకోడానికి ఇగో అడ్డు వస్తుంది పాపం . అయినా  మన ఆడవారికి  మొగుడ్ని గుప్పెట్లో. ఎలాపెట్టుకోవాలోతెలిసి  చావదు .కొంతమందిని చూసా మొత్తం సరెండర్  అయిపోయి ఆమ్మో మీరులేకుండా నేవెళ్ళలేను అంటూ కూరనారా తెచ్చుకోడానికి  మొగుడుండాలి .మీరు సెలెక్ట్ చేసి తెస్తేనే చీర కట్టుకుంటా, అంటూ ఆధారపడిపోతే  మొగుడుగారు సంబరపడిపాయి ఆవిడా మంచితనానికి  ఈయనపొంగిపోతాడు .మగాడికి ఇండివిడ్యువాలిటీ వుండే భార్యని భరించలేదు . ఏమిటోపాతకాలం మాటలు ఆకాలంలో  ఇంత తెలివి ,జ్ఞానం ఎక్కడెడ్సింది. చావు తెలివిఇదంతా అంతాఅయ్యాక .ఇప్పటి అమ్మాయిలని చుస్తే ఎలా తిప్పుకుంటున్నారో మొగుళ్ళని .ఫిఫ్టీ ఫిఫ్టీ పంచేసుకుంటున్నారు  పనులు చక్కగా .అంతేగా మరి సంపాదన కావాలంటే చచ్చినట్టు adjust అవ్వాల్సిందే .  ఏ రోజులు బాగున్నాయి  అని ఆలోచిస్తే సరిగా  జవాబుతట్టదు.  ఇప్పుడుమొగుల్లచేతిలో  బాధపడేవారు లేకపోలేదు .అపుడూమొగుడ్ని కొంగున కట్టేసుకున్నవారున్నారు ,conclusion  …ఆఖరికి పూజ కొద్దీ పురుషుడు  నమ్మక తప్పదేమో …వరలక్ష్మి పూజ చేసుకోండి  మంచి మొగుడికోసం  భక్తి శ్రేధాలతో..ఈ మొగుడికో పాదాభి వందనం చేయండి పాపం వాళ్ళ డబ్బు  ఖర్చుపెడుతున్నామని బాధపడకుండా .తోచి తోచినమ్మ  పోస్ట్ ….?..

రోజుల తరబడి  ఒకదానితరువాత ఒకటివచ్చే పండుగలు ,సంబరాలు ,పూజలు ,యాగాలు దేముళ్ళకి, వజ్రాభరణాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ప్రభుత్వాలు  ప్రజలకి కనీస అవసరాలు సమకూర్చకపోతే నిలదీయలేని ప్రజలు  నిస్సహాయంగా అనుభవిస్తున్నారు .మనదేశంలో సానిటరీ సిస్టం అంత దరిద్రంగా  ఏదేశంలోను ఉండదు. భవనాలు కట్టేవరకే తప్ప మాయింటినెన్స్ అన్నది జీరో.ముఖ్యంగా ప్రభుత్వ అధీనంలో వున్నవి .స్కూల్స్, ఆఫీసులు ,ఆసుపత్రులు ,బస్టాండ్లు  అడుగుపెట్టలేనంత ఘోరంగా ఉంటాయి . శుభ్రం చేసే స్టాఫ్ అరకొర ,పనిచేసిన చేయకపోయినా పర్యవేక్షణ చేసే దిక్కుండదు .జీతాలు ముట్టిపోతుంటే వాళ్ళకెంబాధ,ప్రజలు ,ముఖ్యంగా స్త్రీల పరిస్థితి  దుర్భరం .ఏదన్న ఇలాటి సమస్యలు ప్రభుత్వాలని విమర్శించేవి ,మతాలు,రాజకీయాలు గురించి రాస్తే రకరకాల విమర్శలు ఎదురుదాడులు ,వ్యక్తిగతంగా తీసుకోడం  ఇలాటివి ఎదురుకుని మనకెందుకు అని అందరు నోరు ముస్కుని కళ్లప్పగించి చూస్తూ ఊరుకోడం  ఇది పరిస్థితి ఆమధ్య జపాన్లో ఒక స్కూల్ వీడియో చుస్తే ఎంతముచ్చట వేసిందో .పిల్లలు స్కూల్ అయ్యాక ఎవరి తరగతులు వారు తుడుచుకుని అన్ని సర్ది ,డిస్టింగ్ చేసి  గదులు ఎవరికారిడార్ ముందు మ్యాప్ చేసి రెడీ చేసివెళ్లారు.వంతులవారీగా బాత్రూమ్స్ ,కామన్ ఏరియా పెద్దపిల్లలు చేస్తారు.స్కూల్ నీటుగా పెట్టె బాధ్యత స్టూడెంట్సదే .పిల్లలకి చిన్నప్పటినించి శుచి శుభతత నేర్పితే ఎక్కడపడితే అక్కడ పడేయరు.అదే మన దేశంలో ఏదన్న ప్రైవేట్ స్కూల్ లో చేయిస్తే లక్షలు జీతాలు తీసుకుంటూ బాత్రూములు  కడిగిస్తారా అనితిడతారు తప్ప పిల్ల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచిస్తారా .కనీసం ప్రభుత్వ బడుల్లో ఎంత బీదపిల్లలైనా పేరెంట్స్ వప్పుకుంటరా .మన ప్రజలు అలాటివారే ,వాడి వచ్చేయడం తప్ప నీరయినా పోయారు .దానికి తోడు మన దౌర్భాగ్యం నీళ్లురాని కుళాయిలు .ఇదేపరిస్థితి .వాక్యూమ్ టాయిలెట్స్ ఖరీదుతోకూడినవి ,అనవసర ఖర్చులు ,కోట్లు ఖర్చుపెట్టే సెక్యూరిటీలు తగ్గించి అత్యవసర మయిన సమస్యలమీద ప్రభుత్వాలు దృష్టిపెట్టనిదే బాగుపడదు పరిస్థితి .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.