image_print

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క -డి.కామేశ్వరి  కోటేశ్వరరావు కోటికి పడగలెత్తిన వాడు. ఆయనకి అందమైన భార్య వుంది. ఆరు ఫ్యాక్టరీలున్నాయి, ఆరు భవంతులున్నాయి . ఆరు కంపెనీలలో షేర్లున్నాయి. ఆరు బ్యాంకుల్లో ఎకౌంట్లున్నాయి, అరవై లక్షలున్నాయి, ఆరు కార్లు , అరవై మంది నౌకర్లు, ఆరువేల మంది పనివాళ్ళు అయన చేతి కింద వున్నారు. ఆయనింట్లో ఆరు ఎయిర్ కండిషన్లు బెడ్ రూములు , ఆరు రంగుల ఫోన్లు, ఆరు టెలివిజన్లు , ఆరు టేపు రికార్డులు….. […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-5 అరటి తొక్క

కాదేదీ కథకనర్హం-5 అరటి తొక్క -డి.కామేశ్వరి  నాలుగురోడ్ల జంక్షన్ దగ్గిర — బిజీ బజారు సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు ముందు కోటమ్మ — వీర్రాజు ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టుకుంటూ జుత్తులు పట్టుకుని కొట్టు కుంటున్నారు. చుట్టూ చేరిన జనం ఏ గారడీనో, సర్కసో చూస్తున్నంత కుతూహలంగా , ఆనందంగా తిలకిస్తున్నారు ఆ పోట్లాట — “దొంగసచ్చినోడా– ఆడకూతుర్ని , దిక్కుదివాలం లేనిదాన్ని కిళ్ళీ బడ్డీ ఎట్టుకుని నాలుగు రాళ్ళు తెచ్చుకు గంజినీళ్ళు తాగుతంటే కల్లల్లో […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-4 రొట్టె ముక్క

కాదేదీ కథకనర్హం-4 రొట్టె ముక్క -డి.కామేశ్వరి  రైలు కీచుమంటూ ప్లాట్ ఫారం మీద ఆగింది. అంతవరకు నిద్ర పోతున్నట్టున్న ప్లాట్ ఫారం ఒక్కసారిగా మేల్కొంది. రైలు ఆగడం చూసి అంతవరకు చింతచెట్టు కింద గోటేబిళ్ళ ఆడుతున్న పెంటిగాడు, సిన్నిగాడు ఒక్క పరుగున వచ్చి గద్దల్లా వ్రాలారు రైలు దగ్గిర. అక్కడనించి వాళ్ళ ఆకలి పాట మొదలు “అమ్మా ఒక ముద్దపడేయి తల్లీ — బాబూ నిన్నకాడ నించి గంజి నీళ్ళు లేవు ఒక పైసయియ్యి బాబూ, సిన్న […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-3 సబ్బుబిళ్ళ

కాదేదీ కథకనర్హం-3 సబ్బుబిళ్ళ -డి.కామేశ్వరి  పెద్దోళ్ళ ఆశలు, కోరికలు ఆకాశాన్నంటే వయినా ఇట్టే తీరుతాయి – తీర్చుకుంటారు! చిన్నోళ్ళవి చిరు కోరికలయినా – వాటిని పరిస్థితులు తారుమారు చేస్తాయి – దేవుడూ గారడీ చేసేస్తాడు! ఇదే సబ్బుబిళ్ళ గారడీ కధ! సబ్బుబిళ్ళ! ఘుమఘుమలాడ్తూ కోవాబిళ్ళ రంగులో , కోడిగుడ్డు ఆకారంలో వుండే సబ్బుబిళ్ళ అంటే పదమూడేళ్ళ రత్తికి ఎంతో ఇష్టం! అమ్మగారు స్నానం చేసి వచ్చాక, బట్టలు తీసుకొచ్చేనెపంతో వెంటనే బాత్ రూంలో దూరి ఆ వాసన […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-2 అగ్గిపుల్ల

కాదేదీ కథకనర్హం-2 అగ్గిపుల్ల -డి.కామేశ్వరి  ‘అప్పా , అగ్గి రాజెట్టి నావా – కాస్త అగ్గెట్టు ” పిడక పట్టుకుని గుడిసెలోకి వచ్చింది రత్తాలు. అప్పాలేదు, అగ్గీ లేదు – కాని అగ్గిలాంటి సింహాద్రి – ఫాక్టరీ నుంచి వస్తూ సుక్కేసుకు వచ్చి సగం మత్తులో నులక మంచానికి అడ్డం పడి వున్నాడు. సింహాద్రిని చూస్తే నిప్పని చూసినట్టే రత్తాలుకి భయం – ఆడి సూపుసోకితే కాలి భస్మం అవుతుందని భయం – దగ్గిరకెడితే కాలుతుందని భయం […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-1 కుక్కపిల్ల

కాదేదీ కథకనర్హం-1 కుక్కపిల్ల -డి.కామేశ్వరి  చలి ఎముకలు కొరికేస్తుంటే పాడుపడిన యింటి అరుగు మీద, ఇంటి మీదే కాక వంటి మీదా ఏ కప్పూ లేని సింహాద్రి – పొట్టలోకి కాళ్ళు తప్ప పెట్టుకోడానికో ఏమి లేని సింహాద్రి కాళ్ళు ముడుచుకుని మూడంకేసి , చలితో జ్వరంతో వణుకుతూ మూలుగు తున్నాడు. అడుక్కోడానికో మట్టి మూకుడు, దాహం తీర్చుకోడానికో పాత డాల్డా డబ్బా, మానం కప్పుకోడానికి ఏ ధర్మాతుడో దయతల్చి యిచ్చిన చిరుగుల కాకి నిక్కరు, ఏ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -48

జ్ఞాపకాల సందడి-48 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 25           అమ్మమ్మ, అమ్మ తరంలో ఆడవాళ్ళ బతుకులు. అధ్వాన్నంగా ఉండేవి.  పిల్లలను కనడం పెంచడం వంటింటి చాకిరీతో, రాత్రి పగలు సతమతమవడం తప్ప వారికంటూ వేరే ప్రపంచం ఉండేది కాదు. ప్రతి ఇంటా ఇవే కథలు, ఇదే చాకిరీ. కనీసం ఇంటికో విధవరాలుండేది. చిన్నప్పుడే,  పదేళ్ళకే పెళ్లి చేయడం, కాపురానికి వెళ్ళకుండానే, భర్త పోతే గుండు గీసి, తెల్ల పంచ కట్టించి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -47

జ్ఞాపకాల సందడి-47 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 24           ఆ రోజుల్లో అందరు సుష్ఠుగా తినేవారు పూటపూటా. మధ్యాహ్నం అంత హెవీగ తింటే మళ్లీ  ఏమీ తినలేం ఇప్పుడయితే. సాయంత్రం ఫలహారాలు. మళ్ళీ రాత్రి భోజనాలు. అలా ఐదు రోజులు పెట్టింది పెట్టకుండా మెనూ రాసుకుని వండించేవారు.  ఆ తిండి చూస్తే ఆశ్చర్యం  వేస్తుంది. అప్పటి అరుగుదల శక్తి అలా ఉండేది. పై ఊరి నుంచి  వచ్చిన వారు బండి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -46

జ్ఞాపకాల సందడి-46 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 23          పెళ్ళికి మూడు రోజులుందనగా నాన్న మందీ మార్బలంతో దిగేవారు. ఒక సూపర్ వైజర్, నలుగురు కూలీలను వెంట బెట్టుకుని దిగేవారు. హడావుడి మొదలు. పందిర్లు వేయడం, గాడిపొయ్యి తవ్వించడం, పెరడంతా బాగు చేయడం, గడ్డి గాదం పీకించి, చదును చేయించి, ఎత్తుపల్లాలు లేకుండా నాలుగైదు సార్లు దిమిసా కొట్టించి, నాలుగయిదుసార్లు పేడనీళ్ళు జల్లించే వారు. ఆ రోజుల్లో టేబుల్ మీల్స్ ఎక్కువుండేవి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -45

జ్ఞాపకాల సందడి-45 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 22           ఆ రోజుల్లో పెళ్లి అంటే రెండు నెలలు ముందే పనులు మొదలుపెట్టే వారు. మంచి రోజు చూసి విఘ్నేశ్వర పూజచేసి పసుపు దంచి, మీదు కట్టేవారు. మీదు అంటే పసుపు గుడ్డలో, పూజ బియ్యం, దంచిన పసుపు వేసి మూటకట్టి దాచి పెళ్లినాడు అవి తలంబ్రాల  బియ్యంలో కలిపేవారు. అంటే పెళ్లి పనులకి శ్రీకారం చుట్టడం అన్నమాట. ముందు అప్పడాలతో మొదలు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -44

జ్ఞాపకాల సందడి-44 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -20          మా నాన్న క్లబ్ నించి తెచ్చే ల.న మ్యాగజైన్స్ లో భారతిలో ఒకే ఒక్క కథ వేసినా, ఎంత మంచి కథలుండేవో! అలా చదివిన పురాణం కథలలో ‘కోతి’ అనే కథ ఈనాటికీ నా మనసులో నిలిచిపోయింది. పురాణంవి ఎన్నో మంచి కథలు చదివి ఆయన అభిమానిని అయిపోయాను.           ఆయన, నీలి, సీతాజడ… పేర్లు గుర్తు లేవు. […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -43

జ్ఞాపకాల సందడి-43 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -18           ఆ రోజుల్లోనే రామచంద్రాపురంలో మంచి లైబ్రరీ ఉండేది. శరత్ బాబు, చలం, కొవ్వలి, జంపన, బకించంద్ర ఛటర్జీ, అడవి బాపిరాజు వగైరా పుస్తకాలుండేవి. నాకు పన్నెండేళ్ళు వచ్చిన దగ్గర నుండి పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. దానికి కారణం మా అక్క అనిచెప్పాలి. లైబ్రరీకి అపుడపుడు నన్ను దొంగతనంగా పంపేది. అపుడు చలం, కొవ్వలి పుస్తకాలు ఇంట్లో పెద్దవాళ్ల చదవనిచ్చే వాళ్ళు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -42

జ్ఞాపకాల సందడి-42 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -16           చిన్నపుడు బాగా పెరిగాం  అంటే ఇన్ని బట్టలు, ఇంతంత బంగారాలు పెట్టుకుని సిరిసంపదల మధ్య పెరిగాం అని కాదు. మామూలు మధ్య తరగతి వాళ్ళమే. ప్రతీ పండక్కీ బట్టలు, ఆడపిల్లలందరికి తలో గొలుసు, రెండు జతల బంగారు గాజులు, చెవులకి దుద్దులు, వేలికి ఉంగరం ఉండేవి అంతే. అలా చిన్నప్పటి నుంచీ అలవాటయి పోయి ఇప్పుడున్నా పెట్టుకో బుద్ధి వేయదు. అత్తవారు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -41

జ్ఞాపకాల సందడి-41 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -15           కరెంట్ అంటే ఆ రోజుల్లో మాకు తెలిసిన అర్థం దీపాలు దాంతో వెలుగుతాయని. మరి ఈ నీళ్లలో కరంట్ ఏమిటో అంతుబట్టక పోయినా, కారు ఉన్న పడవ ఒక పక్కకి లాగేయడం, అందరు భయపడి కరెంట్ లాగేస్తుంది అని అరవడం… ఇదంతా ఏమిటో తెలియక భయపడిపోయాం పిల్లలందరం. పదేళ్ల పిల్లకి ఏం తెలుస్తాయి ఈ విషయాలు?  ఇప్పటిలా ఏం ఎక్సపోజర్ ఉండేది […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -40

జ్ఞాపకాల సందడి-40 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -13           ఆయనకి పప్పు అంటే కందిపప్పు వేయించి పప్పు వండడం కాదు, కందులు వేయించి పప్పులు విసిరి, పొట్టు  తీసి వండాలి. పప్పు సన్నని సెగ మీద కుంపటి మీద ఉడికిన ఆ పప్పు రుచి తల్చుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది.  అలాటి కమ్మని పప్పు అన్నంలో నెయ్యి వేసుకుని తినే ఆ రుచి సామిరంగా ఉంటుంది.  అలా ఒకో ముద్దకి ఒకో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -39

జ్ఞాపకాల సందడి-39 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -11 మా అమ్మ           అమ్మ అంటే వేళవేళకి కమ్మగా వండి పెట్టేదన్న అర్ధమే మాకు తెల్సిన అర్ధం ఆనాడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన వంటింట్లోనే ఉండేది అమ్మ. మా అమ్మమ్మ గారి ఇల్లులా  ధర్మసత్రంలా కాకపోయినా ఆరుగురు పిల్లలున్నాయిల్లు. ఆవిడా వంటలు చేస్తూ, టిఫిన్లు చేస్తూ.,పప్పులుఉప్పులూ బాగుచేస్తూనో, మజ్జిగ చేస్తూనో, చదన్నలు పెడుతూనో., వంటిల్లు తన సామ్రాజ్యం అన్నట్టుండేది . మా నాన్నగారు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -38

జ్ఞాపకాల సందడి-38 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -9 మా తాతగారు            మా తాతగారు చల్ల కామేశ్వరరావు గారు. ఆ రోజుల్లో పెద్ద లాయరు .పెద్దాపురం లో పుట్టి కాకినాడలో ఇంటరు, మద్రాస్ లో లా చదివి, కాకినాడలో లాయరుగా ప్రాక్టీస్ పేట్టి, ఆయన ఆ రోజుల్లో బాగా ఆర్జించారు. మా తాతగారు ఆరడుగుల పొడుగుతో చక్కగా ఉండేవారు. మా అమ్మమ్మయితే ఏంతో అందగత్తె కిందేలెక్క. పచ్చటిచ్చాయ.  కళ కళలాడే మొహం. […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -37

జ్ఞాపకాల సందడి-37 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -8 మా అమ్మమ్మ (రెండవ భాగం)           అపుడు బంధువుల మధ్య సహాయ సహకారాలు, అభిమానాలు, ఆప్యాయతలు కాదనలేని అవసరాలుండేవి. కనుక పిల్లలను పంపడానికి వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఇంట్లో పెట్టుకోడానికి వీళ్ళు అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో మా నాన్న గారికి తరచుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడంతో బదిలీ అయి వెళ్లే ఊర్లలో చదువులు, స్కూల్స్ సరిగాలేక అమ్మమ్మగారింట్లో అక్కను, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -36

జ్ఞాపకాల సందడి-36 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -5 వారాలబ్బాయి (మొదటి భాగం)           వారం అంటే పల్లెల నించి చదువుకోడానికి వచ్చే బీద అబ్బాయిలు కలిగిన  వారింట ‘వారంలో ఒక రోజు మీ ఇంట భోజనం పెట్టండి’ అని అడిగి, ‘ఫలానా రోజు మీ ఇంటికి వస్తాను’ అని చెప్పడం అన్న మాట. అలా బ్రాహ్మణ ఇళ్లల్లో ఏడు రోజులు వారం కుదుర్చుకుని ఆ ఇంటి అరుగు మీద పడుకుని, నూతి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -35

జ్ఞాపకాల సందడి-35 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -4            ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అన్ని ఊళ్ళల్లో. .పెద్ద పట్టణాల్లో తప్ప. కిరసనాయిలు, దీపం లాంతరు పెట్టుకుని పిల్లలు అందరూ చుట్టూ కూర్చుని చదువుకునే వారం. అందుకే ఎక్కువగా ఉదయం పూట  ఎక్కువ చదువుకునే వారం . ఆరు గంటలకల్లా లేపేసేవారు. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఏడు నించి తొమ్మిది వరకు చదువుకుని, చద్దన్నాలు తినేసి స్కూలూకి వెళ్లి, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -34

జ్ఞాపకాల సందడి-34 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -3   మా చిన్నతనంలో చదువులు చెపితే మీరు ఆశర్య పోతారు. ఇప్పటిలా ఎల్కేజీ పిల్లకి సయితం రెండుకేజీల బరువుండే బ్యాగుల  పుస్తకాలుండేవి కావు. ఇలా మూడేళ్ళ పిల్లని స్కూల్లో పడేయడం ఉండేదికాదు. అసలు ఐదో క్లాస్ వరకు ఇంట్లోనే చదువుకుని ఐదో క్లాసులో చేరేవారం. అప్పటి వరకు అక్షరాలు నేర్చుకోవడం, ‘అల, వల’ అంటూ తెలుగు వాచకం మొదలెట్టడం, అంకెలు నేర్చుకోవడం, కూడికలు,  తీసివేతలు అన్నీ ఇంట్లోనే. ఇంట్లో పిల్లల […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -33

జ్ఞాపకాల సందడి-33 -డి.కామేశ్వరి  కావమ్మ  కబుర్లు -2 మానయనమ్మ  పేరు లచ్చయ్యమ్మట  మరీ పాత కలంపేరు   అని మోడిఫైచేసి లక్ష్మి అని చేర్చి సుందరలక్ష్మి అనిఅక్కకి పెట్టారు .తాతగారి పేరు సుబ్బారావు అనిఅన్నయ్యకి పెట్టారు .గుంటూరు వాళ్ళ ధర్మమని బతికున్న వాళ్ళపేర్లు పెట్టారుకనక. మా అమ్ముమ్మపేరు. సూరమ్మ అని పెట్టలేదుట నాకు .అది వింటే గుడ్డిలో మెల్ల సూరమ్మ కంటే కామేశ్వరి కాస్త నయంగావుందని. అప్పటినించి నోరు మూసుకున్న . పోనీ కామేశ్వరిని కాస్త నాజూకుగా […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -32

జ్ఞాపకాల సందడి-32 -డి.కామేశ్వరి  కావమ్మకబుర్లు-1 కావమ్మకబుర్లు —–ఎవరీ కావమ్మా ఏమకతని మీరేం ఆలోచలో పడక్కరలేదండోయి ,ఈ కామేశ్వరేఁ  కావమ్మ-ఇంట్లో పిలుపది !ఇప్పుడంటే ఎనభయో పడి లో పడ్డాను కనక కావమ్మా అన్నకాముడు అన్న కావమ్మగారన్న నాకేమి అభ్యతరం లేదు .చిన్నప్పుడు నాకు జ్ఞానం వచ్చినన్దగ్గనించి అంట ఇదే పిలుపు .పట్టుమని పదేళ్లు లేని పిల్లని అంత పెద్దదాన్ని. చేసే ఆ మోటు పిలుపు. విన్నప్పుడల్లా ఉడుకుమోత్తనం వచ్చేది .తక్కిన అప్పచెల్లెళ్లకి. సుందరి, aహేమ, శ్యామల, అన్న మంచి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -31

జ్ఞాపకాల సందడి-31 -డి.కామేశ్వరి  ఆరోజుల్లో అంటే మా కాలంలో అమ్మలు, అమ్మమ్మలు ఎంత సులువుగా పదిమందిని కని  పెంచేవారు! ఏడాదికి ఒకరిని మహా అయితే ఏణ్ణర్ధానికి ఒకరిని కని పడేసేవారు. కడుపులో పిల్ల, చంకలో ఎడ పిల్లతో కోడి పిల్లల్లా ఉండేవారు. నొప్పులు మొదలవగానే పురిటి గది  తలుపులు తీసి, తుడిపించి, కడిగించి, నులక మంచం వాల్చి పక్క తయారు చేయించడం. ఉన్నవాళ్లలో పెద్దకుర్రాడిని మంత్రసానిని పిలుచుకు రమ్మని తోలడం. వాడు పరిగెత్తి వెళ్లి పిలుచుకురావడం .అపుడు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -30

జ్ఞాపకాల సందడి-30 -డి.కామేశ్వరి  మాగ్నిఫిషియంట్ సెంచరీ: మనకు మాములుగా బ్రిటిష్ , యూరోప్ , హిస్టరీ  తెలిసినంతగా ఇతరదేశాల చరిత్ర , అక్కడి రాజరికాలు ,ప్రజా జీవితం ,వాతావరణ  స్థితిగతులు, ఆచారవ్యవహారాల గురించి తెలియదు. ఇప్పుడంటే గూగుల్ నిమిషాల్లో ఏదికావాలన్నా చెప్పేస్తుంది. మా రోజుల్లో హిస్టరీ, జాగ్రఫీలో చదివిన పాఠాల వల్ల  తెలుసుకొన్న వాటివల్ల కొంచెం తెలిసేది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని చాల రోజులు పాలించారు కనక వాళ్ళ చరిత్ర తెలిసేది. ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -29

జ్ఞాపకాల సందడి-29 -డి.కామేశ్వరి  భోజ్యేషు మాత, శయనేషు రంభ  అని పెద్దలు ఏనాడో చెప్పారు. అదేమాటలు నసీరుద్దీన్షా ఏదో సినిమాలో, ఆద్మీ జో బి కర్త హాయి  పేట్  కె లియే ఔర్ పేటికే నిచ్ కె లిఏ కర్తా అని చెప్పాడు. అంచేత మొగుడిని వశ పర్చుకోడానికి అమ్మాయిలు ఈ సూత్రం ఫాలో అవాలి. అంటే మొగుడు కాస్త బాగా వుంటే  అబ్బా చూడగానే ఎంత నచ్చేసారో పడిపోయాను. అంటే ఉబ్బి పోని మొగుడుంటాడా. అదేబాగులేనివాడు అంటే […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -28

జ్ఞాపకాల సందడి-28 -డి.కామేశ్వరి  మా చిన్నతనంలో పచ్చళ్ళు పెట్టడం అంటే ఆదో  పెద్ద ప్రహసనం. పెద్ద గంపెడు ఉసిరికాయలు  చింతకాయలూ  తెచ్చి ,ఏడాదికి సరిపడా పెట్టి ,జాడీలలో  పెట్టి, వాసినికట్టి ,కావలసినపుడు కాస్త తీసి పచ్చడినూరుకునేవారు . ఏ  సీజన్లో లో దొరికేవి అప్పుడు పెట్టునేవారు. పదిమంది ఇంట్లో జనం ,వచ్చిపోయే బంధువులు విడికాపురాలుండే కూతుళ్ళకి వచ్చినపుడు ఇంత  సీసాల్లో పెట్టివ్వడానికి ,ఇలా కనీసం పెద్దగంపెడు కాయలుండేవి . ఉసిరికాయలు కడిగి బట్టమీద ఎండలో ఆరబెట్టి , […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -27

జ్ఞాపకాల సందడి-27 -డి.కామేశ్వరి  తెలుగు సాహిత్యానికి మరో శరాఘాతం , ప్రముఖ ఈనాడు గ్రూపునించి ప్రచురణ  అయ్యే నాలుగు మాసపత్రికలు ఆగిపోవడం ,నిజంగా ఎంత బాధాకరం  ,ఎంతటి దుర్దశ తెలుగు సాహిత్యానికి. ఈమధ్య ఎందరో సాహితీపరులు కళాకారులూ పోయినపుడు విచారంగా నివాళులు అర్పించినట్టు ఇప్పుడు ఒకో సాహిత్య  పత్రిక ఊపిరి ఆగిపోతుంటే నివాళులు అర్పించాల్సిందేనా నిస్సహాయంగా. అంతటి ప్రముఖ సంస్థలే పత్రికాభారం మోయలేక వెంటిలేటర్ మీద బతికించే  ప్రయత్నాలు చాలింక ప్రశాంతంగా దాటిపోనీండి అని  మనసురాయిచేసుకుని తమవారికి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -26

జ్ఞాపకాల సందడి-26 -డి.కామేశ్వరి  ఈ  కరోనా  కట్టడి  వచ్చాక  netflix  హాట్స్టార్ చూడడం ఒక్కటే కాలక్షేపం అయి  ఎన్నెన్ని  సినిమాలు  సీరియల్స్  shotfilms ! ఎంతో గ్రిప్పింగ్ గా, 20,25ఎపిసోడ్స్  ప్రత్యేకం ott  కోసం తీసిన రెల్స్టిక్ గా తీసిన  క్రైమ్  అట్టడుగు వర్గాల కధలు  చూసాక అసలు  మామూలు  సినిమాలు  చూడలేకపోతున్నా.   ఎంత అద్భుతంగా, అనవసరమైన  చెత్త  లేకుండా పోలీస్  వ్యవస్థ,   జైళ్లలో కరుడుకట్టిన నేరస్తులు, నిరపరాధులు అన్యాయంగా నేరస్తులుగా శిక్షించపడడం (జైల్ ) హాట్స్టార్), […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -25

జ్ఞాపకాల సందడి-25 -డి.కామేశ్వరి  మై  చిల్డ్రన్  అండ్  యువర్  చిల్డ్రన్  ఆర్ ఫైటింగ్  విత్ అవర్  చిల్డ్రన్ –   హాస్యంగా  విదేశీయుల గురించి  అనడం  వింటుంటాం . ఈ మధ్య టర్కిష్  సీరియల్స్ కి అడిక్ట్  అయిపోయి తెగచూస్తున్నా. సీరియల్స్ బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగా చక్కటి అందమైన మనుషులు లొకేషన్స్  తో కట్టిపడేస్తున్నాయి. అయితే అన్నిటిలో కామన్  పాయింట్  భార్యాభర్తలు  డైవోర్సులు , ఇద్దరికీ పిల్లలు , కొంతమంది తండ్రుల డిమాండ్ తో తండ్రుల […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -24

జ్ఞాపకాల సందడి-24 -డి.కామేశ్వరి  నవంబర్ నెల  వచ్చిందంటే  మేము  బతికే  వున్నాం అని ప్రభుత్వానికి  విన్నవించుకునే  నెల.   మేము చూడందే   నమ్మం  మమ్మల్ని  దర్శించాల్సిందే అని ప్రభుత్వం  రూల్. చచ్చినవారిని  బతికున్నట్టు  డెత్ సెర్టిఫికెట్స్ సృష్టించగలిగే  ఘనులున్న  ఈ  దేశంలో  మరి  ప్రభుత్వాలు  మాత్రం పాపం  ఏంచేయగలదు. సరే ముసలి వారు  కర్రలు పట్టుకు  మనవళ్ల  చేతులు పట్టుకునో  వాకర్లు  పట్టుకునో  పడుతూ లేస్తూ  వెళ్లి  ఫోటో  అంటించి  సంతకం  పడేస్తే  మళ్ళి  ఏడాది  వరకు  […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -23

జ్ఞాపకాల సందడి-23 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక ,ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం. స్వేచ్ఛ కోల్పోయిన ఖైదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం. అలాటిది  రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, ఒక పెద్ద అటక  (annex ) మీద ప్రాణభయంతో  రెండుకుటుంబాలు ఎనిమిదిమంది సభ్యులు దాక్కుని ఎవరికంటా బడకుండా, అనుక్షణం భయంతో ,గట్టిగ మాట్లాడకూడదు , శబ్దాలు చేయకూడదు, మనుషుల ఉనికివున్నట్టు బయటి ప్రపంచానికి తెలియకుండా […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -22

జ్ఞాపకాల సందడి-22 -డి.కామేశ్వరి  నాలుగు రోజుల  క్రితం మనవడి పెళ్ళికుదిరి  దసరా శుభదినాన ముత్తయిదువులు  పసుపు దంచి శుభారంభం చేసారు అన్న నా పోస్టుకి “ముత్తయిదువులంటే ఎవరు?”  అని సత్యవతి వ్యంగమో, ఎత్తిపొడవడమో  నాకు తెలియదు అన్నారు. పండగ రోజులు ,ఇంట్లో బంధువులు ,మనవరాలు వచ్చివెళ్లే హడాడావిడీ శుభకార్యం అని అన్నప్పుడు చేసిన విమర్శకి నొచ్చుకున్నా. ముత్తయిదువంటే ఆవిడకి తెలియదనుకునేటంత వెర్రిదాన్ని కాదు. గంటలకొద్దీ టైపు చేసే తీరిక లేక ఊరుకున్నా. ఆమె నా స్వవిషయాన్ని విమర్శించకుండా […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -21

జ్ఞాపకాల సందడి-21 -డి.కామేశ్వరి  శ్రీ పివి నరసింహరావుగారు  ప్రధానమంత్రిగా వున్నప్పుడు  వారి  మనవరాలు  పెళ్లి హైదరాబాద్ లో మా చెల్లెలుశ్యామల మరిదికొడుకుతో పెళ్లిఅయినపుడు  మేమందరం వెళ్ళాము .అపుడు  ఆయన్ని కలిసి నా పుస్తకాలూ కొన్ని ఇవ్వడం అయన  నా వివరాలు అడగడం  ఓ రచయిత్రిగా నాకు  ఎంతో సంతోషం ,గర్వం  కలిగించిన  క్షణాలు . ఆయన స్వతహాగా బహుభాషాప్రవీణులు కాకరచయితా కూడా .ఆ పెళ్లికికూడా మొత్తంరాజకీయ ,సినిమా ప్రముఖులు ఎంతోమంది వచ్చారు .తేదీ సరిగా గుర్తు లేదుకానీ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -20

జ్ఞాపకాల సందడి-20 -డి.కామేశ్వరి  మా అన్నయ్య పెళ్లి  68 లో ఢిల్లీ లో జరిగింది. ఆపెళ్ళికి  అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి, వివి గిరి . మొత్తం ఇందిరాగాంధీ కేబినెట్ మంత్రివర్గం, చీఫ్ జస్టిస్ లాటి పెద్దలు అందరు ఎటెండ్ అయ్యారు. ప్లానింగ్ కమీషన్ మెంబెర్  శ్రీ బుర్ర వెంకటప్పయ్యగారి  అమ్మాయి పెళ్లికూతురు. వెంకటప్పయ్యగారు  ఆ రోజులలో ఐసిఎస్ అంటే  బ్రిటిష్ వారి కాలంలో  ఇంగ్లాండ్ వెళ్లి పరీక్షా పాస్ అయి వచ్చి, కలెక్టర్ , సెక్రటరీ  […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -19

జ్ఞాపకాల సందడి-19 -డి.కామేశ్వరి  నేను గత రెండేళ్ల నించి ఈ ఇంట్లోకి వచ్చిందగ్గర నించి బెడ్ మీద కూర్చుని యోగ చేస్తున్నా కింద కూర్చోలేక . నా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం నిలువెత్తుది వుంది. నేను కపాలభాతి చేస్తూ కన్నార్పకుండా  రెండు మూడు నిముషాలు తదేకంగా ఎదుట అద్దం వైపు నా వైపు దృష్టి ఉంచి చేసేదాన్ని.  మూడునిమిషాలు అయ్యాక కళ్ళు ముసుకు విశ్రాంతి ఇచ్చేదాన్ని . కళ్ళుమూసుకోగానే  అద్భుతంగా  ఎదురుగా  నా బొమ్మ నీడ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -18

జ్ఞాపకాల సందడి-18 -డి.కామేశ్వరి  ఈ రోజు కట్టుపొంగల్  నైవేద్యం  అమ్మవారికి. పాపం ఆతల్లికూడా   మూడురోజులుగా  రకరకాల నయివేద్యాలు ఆరగించి  కాస్తభారంగావుండి  ఒకటి రెండురోజులు  తేలికగావుండేవి  పడితేబాగుండుననుకుంటిందిగదా .ఆవిడ సంగతి ఏమో నాకు  తేలిగ్గా. తినాలనిపించి ఈజీగా  అయిపోయే  కట్టుపొంగల్చేశా,  అందరికి తెలిసిన వంటే,తెలియనివారికి … అరగ్లాసు బియ్యం ,అరగ్లాసు పెసరపప్పు ,కడిగి  అరగంట నానాక నీరు వార్చి పెట్టుకోండి .చిన్నకుక్కరులో  రెన్డుచెంచాలా నెయ్యివేసి   అరచెంచా జీలకర్ర ,,అరచెంచా కచ్చాపచ్చాగా చితకొట్టిన  మిరియాలు ,ఇంగువ. కరివేపాకు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -17

జ్ఞాపకాల సందడి-17 చిట్కా…. -డి.కామేశ్వరి    చాలామందికి  దంతసమస్య వుంటుందీరోజుల్లో. దంతసమస్యఅనగానే నోరుకంపు , పళ్ళు ఊడిపోవడం అనేవి. ముందునించి  పళ్ళని శుభ్రంగా  వుంచుకోకపోవడం, పళ్ళమధ్య ఆహారపదార్ధాలు ఇరుక్కుని కుళ్ళువాసన ,ఇన్ఫెక్షన్ తో చిగుళ్ళు వాచి బలహీనపడి  దంతాలు రాలడం, పయోరియా వ్యాధికి దారితీస్తుంది. మనిషి నోరువిప్పితే భరించలేని దుర్వాసన. చిన్నప్పటినించి  ఏది తిన్న నోరుపుక్కిలించి కడుక్కోవడం పిల్లలకి నేర్పాలి. లేవగానేహడావిడిగా  నోట్లో బ్రష్ ఆడించేసి  ఒకసారి నోట్లో కాసిని నీళ్ళుకూడా పోసుకోకుండాఉమ్మేసి, నాలిక  ఎంతమంది పిల్లలు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -16

జ్ఞాపకాల సందడి-16 -డి.కామేశ్వరి  మనం ఒక మొక్కనాటితే పెరిగి పువ్వులో, కాయో పండో ఇవ్వడానికి కొన్ని ఏళ్ళు  పడుతుంది. కడుపులో బిడ్డ ఎదిగి బయట పడడానికి తొమ్మిదినెలలు పడుతుంది. బియ్యం అన్నం అవడానికి అరగంటన్నా పడుతుంది. ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. ఆఖరికి పాలనించి నెయ్యి కావాలంటే పెరుగవాలి, చిలకాలి,  వెన్నతీయాలి, నెయ్యికాచాలి. అన్నీ ఎంతో కష్టపడితే తప్ప ఫలితం చేతికందదుకదా! మరి దేముడిని మనం ఒక కొబ్బరికాయ కొట్టేసో, పది ప్రదక్షిణాలు చేసేసి, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -15

జ్ఞాపకాల సందడి-15 -డి.కామేశ్వరి  వరలక్ష్మీవ్రతం  నాడు తప్పకుండ నాకు  గుర్తువచ్చే మాట ఓటుంది. మా అక్క  బావ  ఓసారి పూజ  టైంకి  మాఇంట్లో వున్నారు . అక్కని ,నన్నుచూసి మావారు వీళ్ళు మన భార్యలు  మనడబ్బు  ఖర్చుపెట్టి మళ్ళీ జన్మలో మంచి మొగుడు రావాలని పూజలు  చేస్తారు ఎంత అన్యాయం అంటూ  జోకారు.నేను ఊరుకోనుగా  ఆలా కోరుకున్నారంటే దానర్ధం ఏమిటో మరి రిటార్ట్ ఇచ్చా , మా బావగారు అయితే  మరి మేం  ఏ కేటగిరి  అంటారు  […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -14

జ్ఞాపకాల సందడి-14 -డి.కామేశ్వరి  The sky is  pink …. ఈ మధ్యే ఈ అద్భుతమైన  సినిమా చూసా. ఇంత గొప్ప సినిమా ఎలా మిస్ అయ్యానో, పేరుకూడా విన్న గుర్తు  లేదు. మొన్న రోహిత్  “తప్పకుండా చూడు” అంటే సరే అనుకుని పెళ్లి హడావిడి అయ్యాక netflix లో చూస్తే కనపడలేదు. మళ్లీ మర్చిపోయి నిన్న వెతికితే దొరికింది. సినిమాకాదు జీవితం చూస్తున్నంత సహజంగా ప్రతి సీను, ప్రతిమాట, నటన… ఏం చెప్పాలి? ప్రియాంకచోప్రా ,ఫరనక్తర్, భార్యాభర్తలు. కొడుకు, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -13

జ్ఞాపకాల సందడి-13 -డి.కామేశ్వరి  కరోనా  …హహ …కరోనా తాత వచ్చినా  భారత జనాభాని  ఏమి చెయ్యలేక తోకముడిచి  పారిపోతుంది. కుళ్ళు కాళ్లతో కుళ్ళునేలమీద పానీపూరి  పిండి తొక్కి తొక్కి మర్దించే పానీపూరీలు లొట్టలేసుకుతింటం, బండిమీద ఆకుకూరలమ్మేవాడు డ్రైనేజీ వాటర్ లో ఆకుకూరలు కడిగేసినా చూస్తూ కూడా కొనేసి వండేసుకుంటాం, రోడ్డుసైడ్ బండిమీద టిఫిన్ లు సప్లై చేసేవాడు  ఎంగిలి ప్లేట్లు రోడ్డుమీద కుళ్ళుగుంటలో కడిగేసినా ఎగబడి తింటాం, చెత్తకుప్పలమధ్య ఆవాసముండే కోట్ల జనాభా పందులమధ్య హాయిగా బతికేస్తారు, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -12

జ్ఞాపకాల సందడి-12 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక , ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం , స్వేచ్ఛ కోల్పోయిన ఖ్యదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం . అలాటిది  రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, ఒక పెద్ద అటక  (annex ) మీద ప్రాణభయంతో  రెండు కుటుంబాలు ఎనిమిదిమంది సభ్యులు దాక్కుని ఎవరికంటా బడకుండా , అనుక్షణం భయంతో , గట్టిగ మాట్లాడకూడదు , శబ్దాలు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -11

జ్ఞాపకాల సందడి-11 -డి.కామేశ్వరి  2012 – వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైం అవార్డు  అందుకోడానికి  హ్యూస్టన్ వెళ్లినప్పటి మాట. 1986  లో అమెరికా  యూరోప్  టూర్  వెళ్ళినపుడు  ఒక నెలరోజులు ఉండి చూడాల్సినవి చూసా  కాబట్టి  ఈసారి  అవార్డు  ఫంక్షన్  హ్యూస్టన్ లో, డల్లాస్ లో సన్మానం అయ్యాక  నా ముఖ్య బంధువుల ఇళ్లలో తలో రెండుమూడు రోజులు ఉండేట్టు  ప్లాన్చేసుకున్నా. వాషింగ్టన్ లో మనవడు నిర్మల్ , చెల్లెలు కూతురు కల్పనా వున్నారు. నాకు మునిమనవడు  […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -10

జ్ఞాపకాల సందడి-10 -డి.కామేశ్వరి  మేము భువనేశ్వర్లో  వుండేటప్పటి మాట. మా బావగారు హనుమంతరావు గారు మద్రాస్ లో ఏదో కంపెనీ లో పని చేస్తూ  బిజినెస్  పనిమీద భువనేశ్వర్ వస్తుండేవారు. ఒకసారి వచ్చినపుడు  ఆయన మహంతి అనే ఆఫీసర్ని  కలవాలని  ముందుగా అప్పోయింట్మెంట్  ఫిక్స్  చేసుకోడానికి ఇంటికి ఫోన్ చేసారు. ఈయనకి  ఒరియా ఎలాగో రాదు హిందీ  రెండు ముక్కలు వచ్చు. అటు నించి  ప్యూన్ ఫోన్తీసాడు. ”హలో, మై మద్రాస్ సే రావు బోలా  మహాన్తిసాబ్ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -9

జ్ఞాపకాల సందడి-9 -డి.కామేశ్వరి  నవ్యలో  నా కథ ‘తానొకటితలచిన ‘ చదివి  చాలామంది ఫోన్ చేసారు. ఎక్కువమంది సీనియర్ సిటిజన్స్ . మా ఇంటికథే అని మెచ్చుకున్నారు . సగం మంది  యూత్ కథ చాలాబావుంది, మీ మొదటి కథా అని కొందరు, ఇంకేమన్నా వచ్చాయా, అని మరి కొందరు , పుస్తకాలువుంటే చెప్పండి అని కొందరు అడుగుతుంటే నాహిస్టరీ అంతా ఎంతకని చెప్పడం, అలాని చెప్పకపోతే అయ్యో ఇదే నా మొదటికథ అనేసుకుంటే ఎలా. ప్రలోభాన్ని  […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -8

జ్ఞాపకాల సందడి-8 -డి.కామేశ్వరి  సాధారణంగా  అరవైయై డెబ్బయి  ఏళ్ళువచ్చేసరికి ఆధ్యాత్మిక  చింత మొదలవుతుందంటారు. చాలామంది ఆధ్యాత్మిక పుస్తకాలూ, లలితా పారాయణాలు,  ప్రవచనాలు గుళ్లూ గోపురాలచుట్టూ  ప్రదక్షిణలు, హనుమంచాలీసాలు చదువుకుంటూ నా వయసువాళ్ళందరూ కాలక్షేపం చేయడం చూసా. మరి నాకెందుకో  ఆ వైపుకే బుద్ధి మళ్లడం లేదు. ఒకటి రెండుసార్లు. చూద్దాం దానివల్ల ఎమన్నామార్పు, మంచి జరుగుతుందేమో అని బుద్ధి మళ్లించడానికి ఎంత ప్రయత్నించినా కాన్సెన్ట్రేషన్ కుదరలేదు. ఎవరన్నా పూజలకు పిలిచి లలితా పారాయణ చేద్దాం అంటే సరే […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -7

జ్ఞాపకాల సందడి-7 -డి.కామేశ్వరి  ఒకసారి  ఎప్పుడో ఏదోసభలో  ఎవరో నవలకి, కథకి  తేడా ఏమిటి? “పేజీలసంఖ్య-  అనద్దు, స్వరూప భేదం గురించి చెప్పండి” అని తెలివైన ప్రశ్న  వేశారు. కాస్త ఆలోచించి ఇలా అన్నాను:- “నవల జీవితం అనుకుంటే, కథ అందులో ఒకరోజు అనచ్చు. నవల అనేకపాత్రల, అనేక  సంఘటనల సమాహారం. ఒక జీవితంలో ఒకమనిషి పుట్టుకతో జీవితం ఆరంభం అయితే నవల లో ఒక కేరక్టర్ రచయిత సృష్టించుతాడు.  జీవితంలో ఒక మనిషి పుట్టుకతో ఎన్నో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -6

జ్ఞాపకాల సందడి-6 -డి.కామేశ్వరి  “క్రూరకర్మములు  నేరక చేసితి “ తెలియక చేసిన పాపాలు , తెలిసిచేసిన పాపాలు (బొద్దింకలు , ఎలకలు, ఈగలు, దోమలు  వగైరా ) వాటి బాధ భరించలేక తప్పక చంపడం, చిన్నప్పుడు తెలియక తల్లినించి కుక్కపిల్లలని, పిల్లిపిల్లలని  దాచి వినోదించడం, బోనులో ఉడతలని పట్టుకుని వినోదించడం కాలికింద మనకు తెలియకుండా చీమలలాటివి చచ్చిపోవడం  ఇవన్నీ తెలియక చేసిన పాపాలు.  ఇవన్నీ అందరు చేసేవే. మరి మాంసాహారులు  జంతువులని చంపి తినడం పాపంకిందకివస్తుందా?  అది […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -5

జ్ఞాపకాలసందడి-5 -డి.కామేశ్వరి  మొన్న ఎవరో శేఖాహారంలో ప్రోటీన్ వుండే వంటలు చెప్పామన్నారు.  మనం తినే వంటల్లో పప్పుదినుసుల్లో చేసే అన్నిటిలో ప్రోటీన్స్ వున్నవే. పప్పు లేకుండా  సాధారణంగా వంటవండుకోము. కందిపప్పు, పెసరపప్పు రెగ్యులర్ వాడతాము. పాలకపప్పు, గోంగూర, తోటకూరపప్పు, మామిడికాయ, దోసకాయ, టమోటా పప్పు వీటన్నిటిలో  ఈ. రెండుపప్పులుతో విధిగా ప్రతి ఇంట పప్పు చెస్తాం. శేఖాహరులం, ముద్దపప్పు సరేసరి, ఇదికాక, ఆనపకాయ, పోట్ల, అరటి, బీర అన్నిటిలో పెసరపప్పు, సెనగపప్పు కానీ  వేసి చేస్తాం. సాంబారులో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -4

జ్ఞాపకాల సందడి-4 -డి.కామేశ్వరి  దీపావళి హడావిడి  అయ్యాక తిండి గోలకి కాస్త విరామమిచ్చి  ఇంకేదన్న రాద్దామంటే ఆలోచన తట్టలేదు. సరే, ఇవాళ చిన్న,పెద్ద ల వేళా పాళా లేని తిండి, బయట తినే జంక్  ఫుడ్ తో ఎంత అనారోగ్యాల పాలవుతున్నారో చెప్పాలనిపించింది. పాతకాలంలో ఏమిచేసుకున్న ఇంట్లోనే  అత్యవసరపడితేనే  హోటల్.  టిఫినో, భోజనామో. చిరుతిండి పిల్లలకి ఇంట్లోనే చేసేవారం. తల్లులు ఉద్యోగాలొచ్చాక టైంలేక అన్నీ బజారు సరుకే, పండగొచ్చినా ఓ స్వీట్ హాట్ (పులిహోరలాటివి  సహితం) కొనేస్తున్నారు. స్కూల్ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -3

జ్ఞాపకాలసందడి -3 -డి.కామేశ్వరి  నాకు  మా వారి వల్ల వచ్చినఒక మంచి అలవాటు ఇంటిఖర్చుల పద్దురాయటం. ఇపుడు మంచి అలవాటు అని వప్పుకుంటున్నాగాని  ఆయన వున్నపుడు చచ్చినా రాయలేదు. ఆయనకి, నాకు ఎప్పుడు ఒక గొడవ ఉండేది. నాకు ఇంటిఖర్చుకింద డబ్బు ఇవ్వాలి, అదెలా ఖర్చు పెడతానో నా ఇష్టం. మీకు మూడుపూటలా తిండిపెట్టడం నా వంతు. ఇచ్చిందాంట్లో మిగిలిందో, దీనికెంత దానికెంత అని అడగొద్దు అనేదాన్ని. ఆయనగారి గవర్నమెంట్ ఆఫీస్ బుద్ధి  నా దగ్గరచూపిస్తూ ముందు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -2

జ్ఞాపకాలసందడి -2 -డి.కామేశ్వరి  1971 -అపుడు మేము ఒరిస్సాలో బుర్ల అనే ఊరిలో ఉండేవారం. హిరాకుడ్  డాం ప్రాజెక్ట్ powerhouse లో అయన అస్సిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేసేవారు. నేను 62  లో రచనలు ఆరంభించాను, అపుడు ఒక రోజు రిజిస్టర్ పోస్టులో చిన్న పార్సెల్ వచ్చింది. ఆరోజుల్లో నాకెవరు పోస్టులో పార్సెల్ పంపుతారు అనుకుంటూ ఆశ్చర్యంగా అడ్రస్ చూస్తే మద్రాస్ నించి, కేసరికుటీర్ అని వుంది. కేసారికుటీర్ నాకేం పంపింది, ఎందుకు పంపిందో తెలియక  ఆరాటంగా […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -1

జ్ఞాపకాలసందడి -1 -డి.కామేశ్వరి  1952 లో పెళ్లయింది. ఒరిస్సాలో కటక్ లో మా ఆయన ఇంజనీరింగ్ స్కూల్ లో పనిచేసేవారు. ఆరోజుల్లో మద్రాస్ హౌరా మెయిల్ ఒకటే రైల్ మధ్యలో అర్ధరాత్రి కటక్ లోఆగేది. మానాన్నగారు విశాఖపట్నంలో డివిజినల్ ఇంజినీర్ హైవేస్ లో పనిచేసేవారు. ఆయన ముందువెళ్ళి అన్ని ఏర్పాట్లుచేసుకున్నాక పంపమని చెప్పివెళ్ళారు. వైజాగ్ లో మెడిసిన్ చదివే మరిదిని తోడిచ్చిపంపారు. అర్థరాత్రి  కటక్ లో స్టేషన్ కొచ్చి రిసీవ్ చేసుకున్నారు ఆయన. ఆ రోజుల్లో మనిషిలాగే […]

Continue Reading
Posted On :