జ్ఞాపకాలసందడి -2

-డి.కామేశ్వరి 

1971 -అపుడు మేము ఒరిస్సాలో బుర్ల అనే ఊరిలో ఉండేవారం. హిరాకుడ్  డాం ప్రాజెక్ట్ powerhouse లో అయన అస్సిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేసేవారు. నేను 62  లో రచనలు ఆరంభించాను, అపుడు ఒక రోజు రిజిస్టర్ పోస్టులో చిన్న పార్సెల్ వచ్చింది. 

 

ఆరోజుల్లో నాకెవరు పోస్టులో పార్సెల్ పంపుతారు అనుకుంటూ ఆశ్చర్యంగా అడ్రస్ చూస్తే మద్రాస్ నించి, కేసరికుటీర్ అని వుంది. కేసారికుటీర్ నాకేం పంపింది, ఎందుకు పంపిందో తెలియక  ఆరాటంగా పార్సెల్ విప్పా. ఆశ్చర్యం, అందులో ముఖమల్ పెట్టిలో బంగారు కంకణం. ఉత్తరం లో “ఈ ఏడాది గృహలక్ష్మి స్వర్ణకంకణం రచయిత్రి డి.కామేశ్వరి కి కేసరి కుటీరం వారు బహుకరించారు, అభినందనలతో  స్వీకరించండి”. అని వుంది. కంకణం మీద పేరు, సంవత్సరం, గృహలక్ష్మి స్వర్ణకంకణం అని రాసివుంది. కంకణంకి చిన్న గంట ఎంతో బాగుంది. పదిగ్రాముల కంకణం. అప్పటి నా ఆనందాశ్చర్యాలు మీరు ఉహించగలరు. ఒకరచయిత్రిగా  నన్నుగుర్తించి, మారుమూల ఎక్కడో వున్న నన్ను వెతుకుంటూ వచ్చిన మొదటిఅవార్డు. అది నిజమైన అవార్డు అని ఈనాటికి అనిపిస్తుంది. 

 

అంతకుముందే నెలక్రితం ఆంధ్రప్రభ నవలల పోటీలో  ‘అరుణ నవల’ మూడవబహుమతి గెలుచుకుంది. అపుడు కూడా ఈ బుర్ల అనే వూరు ఎక్కడుంది అని ప్రభ వీక్లీ వాళ్ళు వాళ్ళిచ్చిన టెలిగ్రాంకి నా నించి జవాబురాక  ఏంచెయ్యాలి అనుకున్నారట. రెండురోజుల తర్వాత ఆయన ఆఫీస్ కి వచ్చిన టెలిగ్రామ్ ఫోన్ లోచదివి వినిపిస్తే ఆరోజు కలిగిన ఆశ్చర్యం, ఆనందం, గర్వం ఇప్పటికి గుర్తుండే గొప్ప జ్ఞాపకాలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.