జ్ఞాపకాల సందడి-19

-డి.కామేశ్వరి 

నేను గత రెండేళ్ల నించి ఈ ఇంట్లోకి వచ్చిందగ్గర నించి బెడ్ మీద కూర్చుని యోగ చేస్తున్నా కింద కూర్చోలేక . నా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం నిలువెత్తుది వుంది. నేను కపాలభాతి చేస్తూ కన్నార్పకుండా  రెండు మూడు నిముషాలు తదేకంగా ఎదుట అద్దం వైపు నా వైపు దృష్టి ఉంచి చేసేదాన్ని.  మూడునిమిషాలు అయ్యాక కళ్ళు ముసుకు విశ్రాంతి ఇచ్చేదాన్ని .

కళ్ళుమూసుకోగానే  అద్భుతంగా  ఎదురుగా  నా బొమ్మ నీడ silhouette కనపడేది ,అంటే మొత్తం డీటెయిల్స్ అంటే నోరు ముక్కు కళ్ళు లాటి ఫీచర్స్ కాకుండా outline రూపంగా కనిపించేది.

మొదట్లో గమనించలేదు గమనించక అద్భుతంగా నేను కూర్చున్న పోజ్లో నా విగ్రహంలా కనిపిస్తూ నిమిషం రెండునిమిషాలకి క్రమంగా ఫేడవుట్అయిపోయేది.

బట్టలరంగు అదీ రోజూ ఒకటే.  నేనుఅది చూస్తూ చెయ్యి ఊపితే  ఏమార్పూ లేకుండా అలాగే కదలిక  లేకుండా ఉండేది. ఏమిటిది  ఇదివరకు రోజుల్లో ఋషులు, మునులు తపస్సు చేసుకుంటుంటే ఆత్మసాక్షాత్కారం  కనిపించేది. అంటే అంత అంకుఠిత కఠోర తపస్సు చేస్తే కనిపించేది అని చదివాను . 

అమ్మో ,అయ్యబాబోయి నాకేమిటి ఆత్మసాక్షాత్కారం ఏమిటి? తపస్సులు చేసి రాత్రింబగళ్లు ధ్యానం చేసిన గొప్పభక్తురాలినా?  నాలాటి మాములు మనిషికి అంత యోగం ఎలా పడుతుంది?ఎవరితో చెపితే అపహాస్యం చేస్తారు. మా ఇంట్లో అయితే సెంచరీ జోక్ కింద ప్రచారం చేస్తారు. అని నాఅంతట నేనే దాని సంగతి కనిపెట్టాలనుకున్నా.

 రకరకాల ప్రయోగాలు  అంటే ఓరోజు కళ్ళుమూసుకు చేస్తే కనపడలేదు. ఇంకో చోట అద్దం ఎదురుగా లేని చోట చేస్తే కనపడలేదు. ఇంకోసారి కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ చేస్తే కనపడలేదు. ఇలా అన్ని రకాలుగా చేస్తూ ఆఖరికి అద్దానికి, తదేకంగా చూడడానికి  ఏదో వుంది. అన్నదానికి ఏదో సంబంధం వుంది అన్నదానికి సెటిల్ అయ్యా. కానీ అదేమిటో సరిగా అర్ధంకాలేదు. సైన్సు చదివినవారికి అర్ధం అవుతుందేమో .

ఈ లోగా whatsapplo ఓ ఫోటో  చూసాక అర్ధమైనది ఏమంటే  అద్దం లో నా ప్రతిబింబాన్ని  తదేకంగా రెండు నిముషాలు చూసినపుడు  ఈ ప్రతిబింబపు నీడ రెటీనా మీద పడి ఫోటో తీసినట్టు అయి మనం ఇంకోచోట మళ్లీ  చూస్తే  ఆఫొటో ప్రతి గోడ మీద పడి మనకు కనిపిస్తుంది. అన్న  నా థీరీ  నిజామా అన్నది ఫిజిక్స్ చదువుకున్న వారికీ తెలుస్తుందేమో.  లేదంటే అలా కనిపించిన కారణం విశదీకరించమని మనవి.

నా ఆలోచన నిజమే అయితే  నాకు నోబుల్  ప్రైజ్ ఇచ్చేయాలి.  చదువులేకపోయినా  ఇంత గొప్ప సంగతి కనిపెట్టినందుకు. మరోసారి ఆ బొమ్మచూడండి ఇపుడు. మీరు అద్దం ప్రయోగం చేయండి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.