
చిత్రం-17
-గణేశ్వరరావు
గత పదేళ్లలో ఆఫ్రికన్ చిత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇర్మా స్టెర్న్ చిత్రాలకు. చిత్రకళా ప్రపంచంలో ఆమె విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. 1966లో ఆమె మరణించింది. ఆ మధ్య ఆమె గీసిన లేడి కళ్ళ భారతీయ వనిత బొమ్మ $3 మిలియన్ల కు అమ్ముడయింది. 2015 లో ఒక లండన్ ఫ్లాట్ లో వంట గదిలో నోటీస్ బోర్డు లా వాడుతున్న ఆమె చిత్రం బయట పడింది. మండేలా సహాయార్థం అది 1950 లో అమ్ముడయింది , అది విచిత్రంగా చేతులు మారుతూ వంట గదిలోకి చేరింది. ఇలాంటి కోల్పోయిన చిత్రాన్ని మళ్ళీ వేలాం వేస్తే ఈ సారి అత్యధిక ధర కు అమ్ముడయింది. ఆఫ్రికా ఆర్థికంగా కోలుకోవటం తో అక్కడ చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆఫ్రికాలో ప్రసిద్ధి చేందిన బొన్హామ్స్ హౌస్ విజయాన్ని లండన్ లోని ఆక్షన్ హౌసెస్ అనుకరించాలని చూస్తున్నాయి.
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
