
జలపాతం (పాటలు) -1
బంగరు కొండ లలిత గీతం
-సాదనాల వెంకటస్వామి నాయుడు
బంగరు కొండ నా బంగారు కొండ
అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండమురిపాల కుండా , తెలుసు కొని మసలుకోనిను వీడకుండా , నిను వేడకుండాలాలీ జో జో , లాలి జోజోలాలీ జో జో , లాలి జోజో. !! బంగరు !! నీ చిట్టి చేతులు, నా చెక్కిలి నిమిరితేచిన్ని చిన్ని పాదాలు నా గుండెను తాకితేనీ చిరు నవ్వులు నా మోవిని మీటితేనా తనువు పరవశాన ఊయలే కాదా !! బంగరు!! వీపు మీద నిను మోసి , గుర్రమాటాడించిగుక్క పట్టి ఏడిస్తే గోరుముద్ద తినిపించిచందమామ చూపించి , జోలపాట వినిపించిఅలరించే అమ్మను అలుసు చేయబోకురా !! బంగరు !!చెప్పిందే చెబితే చాదస్తమనుకోకుఈ కంట నీరుంటే మదితనమనుకోకుకాని కాలంలోనా కనికరమే ఉంచరాఅటుదిటు జరిగేనా ఆసరాగ నిలవరా !! బంగరు !!బంగరు కొండ నా బంగారు కొండఅమ్మ మనసు తెలుసుకో అది పాలకుండఅమ్మ మనసు చూసుకో అది పగలకుండా.
****

ప్రముఖ కవిగా , గాయకుడిగా , నటుడిగా , పరిశోధకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, పత్రికా సంపాదకుడిగా బహుముఖీన ప్రతిభ కలిగిన వ్యక్తి శ్రీ సాదనాల వేంకట స్వామి నాయుడు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతిని అందుకున్నారు. వీరి పరిశోధన గ్రంథం” కృష్ణా పత్రిక సాహిత్య సేవ- ఒక పరిశీలన” తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పతకం పొందింది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి జాతీయ స్థాయిలో బహుమతిని కవిత్వ రచనకు సాదనాల అందుకున్నారు. “దృశ్యం ” కవితా సంపుటి కి రెండు రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకున్నారు. వీరు రచించిన రెండు గీతాలు ఆకాశవాణి జాతీయ స్థాయి కార్యక్రమం “సుగమ్ సంగీత్” లో రెండు సార్లు ప్రసారం అయ్యాయి. వీరు రచించిన “నాయుడు బావ పాటలు” సంపుటి లోని గీతాలు దూరదర్శన్ , ఆకాశవాణి , ఈ టీవీ లలో ప్రసారం అయ్యాయి. ఏ గ్రేడ్ సంగీత దర్శకులు సంగీతం సమకూర్చిన ఈ గీతాలను ఎందరో ప్రసిద్ధ గాయనీ గాయకులు ఆలపించారు. “పుష్కర గీత గోదావరి” (నదీ పుష్కరాల మీద తెలుగు లో వెలువడిన మొట్టమొదటి ఆడియో కేసెట్ ), “సుముహూర్తం” , “అక్షర దీపం “, “కట్టె మిగిల్చిన కన్నీటి గాథ” ఆడియో కేసెట్ల లలో పాటలను రాశారు.
