జలపాతం (పాటలు) -1

బంగరు కొండ లలిత గీతం

-సాదనాల వెంకటస్వామి నాయుడు

బంగరు కొండ నా బంగారు కొండ

అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండమురిపాల కుండా , తెలుసు కొని మసలుకోనిను వీడకుండా , నిను వేడకుండాలాలీ జో జో , లాలి జోజోలాలీ జో జో , లాలి జోజో.     !! బంగరు !! నీ చిట్టి చేతులు, నా చెక్కిలి నిమిరితేచిన్ని చిన్ని పాదాలు నా గుండెను తాకితేనీ చిరు నవ్వులు నా మోవిని మీటితేనా తనువు పరవశాన ఊయలే కాదా  !! బంగరు!!   వీపు మీద నిను మోసి , గుర్రమాటాడించిగుక్క పట్టి ఏడిస్తే గోరుముద్ద తినిపించిచందమామ చూపించి , జోలపాట వినిపించిఅలరించే అమ్మను అలుసు చేయబోకురా   !! బంగరు !!చెప్పిందే చెబితే చాదస్తమనుకోకుఈ కంట నీరుంటే మదితనమనుకోకుకాని కాలంలోనా కనికరమే ఉంచరాఅటుదిటు జరిగేనా ఆసరాగ నిలవరా  !! బంగరు !!బంగరు కొండ నా బంగారు కొండఅమ్మ మనసు తెలుసుకో అది పాలకుండఅమ్మ మనసు చూసుకో అది పగలకుండా.

****

Leave a Reply

Your email address will not be published.