వెనుతిరగని వెన్నెల(భాగం-21)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-21)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు.

***

తెలుగు డిపార్టుమెంట్లో మొదటి సంవత్సరం పరీక్షలకు టైం టేబుల్ అతికించి ఉన్న గోడ దగ్గిర సాలోచనగా నిలబడిపోయింది తన్మయి

తను  పరీక్షలు ఎలాగయినా గట్టెక్కాలి. కాదు, కాదు. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అన్నిటినీ మించి పరీక్షల సమయంలో బాబు సంగతి ఆలోచించాలి.”

తల దించుకుని నోట్సులో టైం టేబుల్ రాసుకుంటున్న తన్మయి కళ్లు మూస్తూ  “ఇలా రోజుల తరబడి మాయమైపోతే ఎలాగమ్మా?” అంది అనంత.

బదులుగా నిట్టూర్పు  చూసిఏమైంది తన్మయీ!” అంది పక్కకు తీసుకెళ్తూ.

ఏం లేదు, పరీక్షలు దగ్గిర పడ్తూంటే గాభరాగా ఉంది.” అంది తన్మయి.

ఓస్, అంతేనా! నీ ముఖం చూస్తే భలే భయమేసింది. అయినా నోట్సులు రాసుకుంటున్నావుగా భయమెందుకు? అసలు నేనే మీ ఇంటికి సాయంత్రం వద్దామనుకుంటున్నాను.” అంది.

తలెత్తి అనంత వైపు చూసింది తన్మయి.

నాకో సహాయం కావాలి తన్మయీ. హాస్టల్లో నాకు సంవత్సరం సీటు రాలేదన్న సంగతి నీకు తెలుసుగా. హాస్టల్లో తెలిసిన ఫ్రెండ్ రూములో గెస్టుగా కాలక్షేపం చేస్తున్నా. ఇప్పుడా రూముకి మరొక అమ్మాయిని అలాట్ చేసేరు. ఇక నాకు ఉద్వాసన తప్పింది కాదు. ఎంత ప్రయత్నించినా ఇప్పటికిప్పుడు మరొక గది దొరకడం కష్టం. ఎలాగూ ఎల్లుండి  నించి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు కదా! అంత వరకూ  నీకభ్యంతరం లేకపోతే  రెండు రోజులూ  మీ ఇంట్లో ఉండొచ్చా? అంది.

మాత్రానికి నన్ను అడగాలా? రెండ్రోజులు ఏదో రకంగా ఎడ్జస్టు అవుదాంలేఅంది సంతోషంగా తన్మయి

హమ్మయ్య. గొప్ప భారం తీరిందనుకో. ఉండు, రాజుకి చెప్పొస్తాను.” అంది అనంత.

డిపార్టుమెంటు లో కరుణ కోసం చూస్తూ ఒక్కో గది దగ్గిరా ఆగి మెల్లగా చూస్తూ ముందుకు నడవ సాగింది తన్మయి.

ఆధునిక సాహిత్యాన్ని చెప్పే ప్రొఫెసరు గది దగ్గిరికి రాగానే కరుణ  బయటకు వస్తూ  కనిపించేడు.

..మంచి సమయానికి వచ్చేరు. రండి, అంటూ …” తన్మయిని లోపలికి తీసుకు వెళ్లి, “మాస్టారూ ఇంగ్లీషు పోయెం ని  తెలుగులోకి ట్రాన్సిలేట్ చేసింది ఈవిడేఅని పరిచయం చేసేడు.

కూర్చోండి..” అన్నాడాయన ఏదో రిఫరెన్సు పుస్తకంలోకి చూస్తూ

తన్మయి బిడియంగా కుర్చీ ముందుకు జరిగి కూచుంది.

కరుణ రిలాక్స్ కమ్మన్నట్లు  సైగ చేసేడు.

చూసేను మీ అనువాదం. చాలా బావుంది. ఇంకేవైనా చేసేరా?” పుస్తకాన్ని మూసి తన్మయి వైపు చూసి అన్నాడాయన .

లేదండీ, ఇదైనా ఏదో అనుకోకుండా..” అని నసిగింది తన్మయి. నిజానికి బియ్యే లో కనబడ్డ ప్రతీ కవితనీ అనువాదం చేస్తూనే ఉంది.

ఇంగ్లీషు ఇంత బాగా వచ్చినపుడు తెలుగు ఎమ్మే ఎందుకు చేస్తున్నారు?” అన్నాడాయన.

జవాబుగా చిర్నవ్వు నవ్వింది. కారణం తనకీ తెలియదు.

ఏం లేదు. అసలు మీరంతా తెలుగు ఎమ్మేలు చేసి ఏం సాధిస్తారు?” అన్నాడు భృకుటి ముడి వేసి.

సమాధానంగాఏం ఉంది మాస్టారూ, మీ లాగ తెలుగు బోధకులమవుతాం.” అన్నాడు చిన్నగా నవ్వుతూ కరుణ.

నా ఉద్దేశ్యంలో  తెలుగు ఎమ్మేలు వట్టి దండగఅందరికీ యూనివర్శిటీలలో అవకాశాలు వస్తాయనుకుంటున్నారా? బయట  ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడ చూసినా సంస్కృతం సెకండ్ లాంగ్వేజీగా ఉంది. ఇక గవర్నమెంటు కాలేజీలలో ఉద్యోగం రావడానికి అసలు నోటిఫికేషన్లే రావడం లేదు. బియ్యీడీలైనా చేసేరా కనీసం టీచర్ పోస్టులకి అర్హత కోసం? ” అన్నాడు.

తన్మయి బెంబేలుగా తల అడ్డంగా ఊపింది. కరుణ ఏవో సమాధానాలు చెప్పేడు

అక్కణ్ణించి బయటకు వచ్చాక కూడా ఆయన వేసిన ప్రశ్న చెవుల్లో మారు మ్రోగుతూందిఏం సాధిద్దామని తెలుగు ఎమ్మే?”  

ఒక్క సారిగా ఎక్కడ లేని దిగులు, నిస్సత్తువ పుట్టుకొచ్చాయి తన్మయికి. ఎన్నో కలల్తో యూనివర్సిటీ లోకి అడుగు పెట్టింది తను. ఎమ్మే  చదివితే ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయన్న ధీమాగా ఉండేది.  

తల పైకెత్తి చెట్ల గుబురు కొమ్మల మధ్య  ఎండా, నీడల తో చిల్లులు పడ్డట్లున్న ఆకాశం కేసి చూసి దీర్ఘంగా ఊపిరి పీల్చింది

ఉహూ. అవన్నీ నిజాలు కావు. తనకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. ధైర్యంగా ఉండాలిఅనుకుంది

అయినా అంతలోనే పక్కన నడుస్తున్న  కరుణ బెంగ ముఖం చూస్తూ “అవునా, అసలేమీ అవకాశాలు లేవా?” అంది

ఏదో ఆలోచిస్తున్న కరుణఏమన్నారు?” అని, అన్యమనస్కంగా తల అడ్డంగా ఊపాడు

అతనికి కూడా  చదువు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలదు తన్మయి

దారిలో అనంత, రాజు కలిసేరు

వీళ్ల  దిగులు ముఖాల్ని చూసి నవ్వుతూ  “హయ్యో, అసలా ప్రొఫెసరు దగ్గిరికి ఎవరు వెళ్లమన్నారు మిమ్మల్ని? ఆయనొక పెసిమిస్టు. అవేమీ పట్టించుకోకండి. అసలే ఫస్టియర్ పరీక్షలు దగ్గిర పడ్తున్నాయి. ముందు వాటి సంగతి చూద్దాంఅంది అనంత.

పుస్తకం తీసి పద్యం పాడబోయి, తల అడ్డంగా ఊపిఇవేళ్టికి నన్నొదిలేయండిఅని కళ్ళు మూసుకుని బెంచీ మీద పడుకున్నాడు కరుణ

మీరు ఆధునిక భాషా శాస్త్రం చదివేరా?” అని నోట్సు అందించేడు రాజు

దీక్షగా పుస్తకంలోకి తలొంచి కూచున్న తన్మయిని చూసిఇంటికెళ్లి చదువుకుందువులేఅని లేచింది అనంత.

అనంత వెనక బండి మీద కూచుని పుస్తకం తీయబోయింది తన్మయి

అనంత ఎప్పుడూ బండి చాలా వేగంగా నడుపుతుంది. స్పీడుకి ముందు జాగ్రత్తగా సర్దుకుని కూచోవడమే కష్టమనిపించిస్పీడు తగ్గించు అనంతాఅంది

ఇంతలో పక్క నించి మరొక బైకు మీద వెళ్తున్న ఇద్దరు కుర్రాళ్లు దాదాపు రాసుకుంటున్నట్లు సడెన్ గా పక్కకు వచ్చి నోటితో అసహ్యంగా శబ్దం చేసేరు

అసంకల్పిత ప్రతీకార చర్యలా అనంత ఒక్క ఉరుము ఉరుముతూ  “ఛీ వెధవల్లారాఅంటూ అరిచింది. దెబ్బకి హడిలిపోయి బైకు వేగం పెంచుకుని వెళ్ళిపోయేరు

తన్మయికి కాస్సేపు గాభరా వచ్చేసింది. “బండి ఆపవా ఒక్క నిమిషంఅంది.

అంతకే హడిలిపోతున్న తన్మయి వైపు చూస్తూనువ్వు కొంచెం ధైర్యం నేర్చు కోవాలమ్మాయ్అంది నవ్వుతూ  అనంత

ఇంటి ముందు  శేఖర్ బండి చూసిఅమ్మో, అప్పుడే వచ్చేసేడు.” అంది పైకి గాభరాగా తన్మయి.

శేఖర్ బాబుని తీసుకుని వాళ్ల తాత గారింటికి వెళ్లి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లేడు పొద్దున్న.

అనంతని శేఖర్ కి పరిచయం చేసింది తన్మయి. “ఎల్లుండి వరకూ ఉండెళ్తానంటే రమ్మన్నాను.” అంది.

సమాధానంగాఅయ్యో, తప్పకుండా, ఊరు మీది?” అని పరిచయంగా, చక్కగా మాట్లాడుతున్న శేఖర్ని చూసి స్థిమిత పడింది తన్మయి.

నిద్రపోతున్న బాబుని ముద్దాడి అందరికీ టీ పట్టుకొచ్చింది.

మీ వారు చాలా కలివిడి మనిషి. మా రాజు ఇలా ఉంటే  బావుణ్ణుఅంది అనంత గలగలా నవ్వుతూ.

రాజెవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూసి, “, కాబోయేవారా?” అన్నాడు శేఖర్.

ఇంతలో గేటు తీసుకుని లోపలికి వస్తూన్న రాజుని, కరుణని చూసి అటు నడుస్తూఅదుగో, మాటల్లోనే వచ్చేరు.” అంది అనంత.

చాలా థాంక్సండీ.” అన్నాడు రాజు వస్తూనే తన్మయి వైపు చూస్తూ.

కరుణని పరిశీలనగా చూస్తూన్న శేఖర్ దగ్గిరికి వచ్చి షేక హాండ్ ఇస్తూనా పేరు కరుణ, శేఖర్ గారూ. అదుగో కనబడే గేటే నా నివాసం.” అన్నాడు.

పరిచయాలయ్యేక , “అన్నట్టు తన్మయీ, మన బాబు పుట్టిన రోజు గురించి తాతగారికి చెప్పగానే, ఆయన వాళ్లింటి డాబా మీద చేద్దామన్నారు.” అంటూ

మీరంతా మా అబ్బాయి మొదటి పుట్టినరోజుకి తప్పక రావాలిఅన్నాడు.

తన స్నేహితుల పట్ల శేఖర్ చూపిస్తున్న ఆదరాభిమానాలకి సంతోషం నిండిన కళ్లతో తన్మయి అందరినీ సాయంత్రం భోజనానికి ఉండిపొమ్మంది.

రాజు, కరుణససేమిరా వద్దంటూలేచారు.

రాత్రి ముందు వరండాలో స్నేహితురాలి పక్కన తనూ చాప, బొంత వేసుకుని పడుకుంది తన్మయి.

చాలా సేపటి వరకూ కాలేజీ విషయాలు చెప్పుకుంటూ ఎప్పుడో నిద్రపోయేరు.

తన్మయి చాన్నాళ్ల తర్వాత ఆనందంగా నిద్రపోయిందా రాత్రి.

****

మూడో రోజు పొద్దున్న నిద్రలేస్తూనే ఎర్రగా ఉన్న అనంత కళ్లని చూస్తూ, “అదేం అనంతా, నిద్ర సరిగా పట్టలేదా?” అంది తన్మయి.

సమాధానంగా ముభావంగా ఉన్న అనంత తోఅంతా ఓకేనా?” అంది తన్మయి.

అసలెప్పుడూ ముభావంగా తనని చూడకఏమైంది?” అని మళ్లీ అంది

శేఖర్ బయటికి వెళ్లేక, “ఛీ, ఛీ, అదేం పాడు బుద్ధి మీ ఆయనకి? రాత్రి నేను బాత్రూముకి వెళ్లి వస్తూ  ఉండగా వెనక నుంచి వచ్చి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. నేను వెంటనే చెంప ఛెళ్లుమనిపించాను. నిన్ను పిలవబోతే దణ్ణం పెట్టి వెళ్లిపోయేడు.” అంది

తన్మయికి కాళ్ల కింద భూమి కుంచించుకు పోయినట్లయ్యింది. బాధ, ఉక్రోషం తో కూడిన కన్నీళ్లు వచ్చాయి

అయ్యో, నువ్విలా బాధ పడ్తావనే చెప్పాలా, వొద్దా అని ఆలోచించానిప్పటి వరకూ, ఇక ఆగలేక చెప్పేసాను. అయినా తప్పు నాదేలే. అప్పుడే నిన్ను లేపాల్సింది. పాపం నువ్వసలే అలిసిపోయి నిద్రపోయావుఅంది.

తన్మయి స్నేహితురాలికి జరిగిన అవమానానికి బాధ్యత వహిస్తూజరిగిందానికి క్షమించు అనంతా. ఇంకెప్పుడూ అతనున్నపుడు మా ఇంటికి రాకు.” అంది దు:ఖపడ్తూ.

ఛా, ఛా, నీ తప్పేం ఉంది ఇందులో. రాజుకి తెలిస్తే పెద్ద గొడవ చేసేస్తాడు. పరీక్షల సమయంలో మీ ఇంట్లో ఉందామనుకున్నాను. ఇప్పుడా అవకాశం లేదు. ఎప్పుడూ నీ ముఖం చూసి ఏదో బాధ ఉంది నీకు అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడర్థమైంది. అయినా నీలాంటి మంచి అమ్మాయికి వీడెక్కడ దాపురించాడు?”  అంది.

తన్మయి కథంతా విని, “నిన్ను ఒకప్పుడు ప్రేమించేనని నీ వెంట తిరిగి ఇప్పుడు ఇలా విసిగిస్తున్నాడంటే, నువ్విస్తున్న అలుసేనేమో ఆలోచించు. మంచి భర్త కాలేని వాడు, ఇంత అందమైన పసివాడికి మంచి తండ్రి మాత్రం ఎలా అవుతాడు?నేను ఊర్నించి వచ్చాక డిపార్టుమెంటులో కలుద్దాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని నీ ఆరోగ్యం పాడుచేసుకోకు.” అంది అనంత.

సాయంత్రం శేఖర్ ఇంటికి వస్తూనేఇదుగో, బయట బండి ఇక నీదేఅన్నాడు తాళం చెవులు ముఖం మీద ఊపుతూ. “మా బాసు చవగ్గా ఇచ్చేస్తాను తీసుకోమంటే కొనేసాను. అంతే కాదు రేపు ఫ్రిజ్ రాబోతూంది మనింటికి. మా ఫ్రెండు షాపులో ఆర్డరు చేసేను.ఇవన్నీ మా అత్తగారు నాకు ఇచ్చేరని చెప్పుకోవాలి అందరికీ. నువ్వూ అలాగే చెప్పు. ఎంత కాదనుకున్నా ఎవడన్నా బాగుపడ్తే ఏడ్చి పోతారు జనందేవుడి దయ వల్ల ఇన్నాళ్లకి కాసిన్ని డబ్బులు కళ్ల చూడగలిగేను.”

ముభావంగా ఉన్న తన్మయి వైపు చూస్తూఏదైనా మంచి మాట చెప్పినా ఎదవ ఏడుపు ముఖవేనా?” అన్నాడు.

తన్మయి ఆవేశంగా అతని చేతుల్లోంచి బండి తాళాలు తీసుకుని నేలకేసి కొట్టింది

నీకు సిగ్గూశరం ఉందా? నువ్వసలు మనిషివేనా?” గట్టిగా అరిచింది.

 ఏవైందన్నట్లు అమాయకత్వం నటిస్తున్న అతని ముఖాన్ని చూస్తూ  “ఛీఅని పెద్దగా ఏడుస్తూ  “నా స్నేహితురాలితో నువ్వు నడుచుకునే పద్ధతి అదేనా?” అంది ఇంకా గట్టిగా.

ఏవిటే రెచ్చిపోయి అరుస్తున్నావు? చీకట్లో నువ్వనుకున్నానుఅన్నాడు బుకాయింపుగా.

అబద్ధం. పచ్చి అబద్ధం. మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు?” అంది ఎర్రని కళ్లతో.

చిన్న విషయానికి ఇంత రాద్ధంతం ఏవిటే. అయినా నిన్నెవడు తీసుకు రమ్మన్నాడు దాన్ని ఇంటికి? మాటిమాటికీ నన్ను అనడం కాదునువ్వు యూనివర్శిటీ పేరు చెప్పి మగవాళ్లతో రాసుకు పూసుకు తిరగడం లేదని నన్ను నమ్మమంటావా? చూసేనుగా దాని కాబోయే వాడినీ, నీ కాబోయే వాడినీఅన్నాడు వెకిలిగా.

తన్మయి నేల మీద కూలబడింది దు:ఖంతో. అతని నాలుకకు నరం లేదు. మనిషి కాదితను మృగం

ఛీ. దరిద్రపు బతుకు. శుభమా అని రెండు వస్తువులు అమర్చుకుంటే, ఎవడో చచ్చినట్లు నట్టింట్లో కూచుని ఏడుస్తూంది.” అని దభాలున తలుపు వేసేసి బయటికి వెళ్లిపోయేడు.

దరిద్రపు బతుకు ఎవరిదో అర్థం కాని తన్మయి రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.

****

పిల్లాడి పుట్టిన రోజు  ఏర్పాట్లు  ఘనంగా చేసేడు శేఖర్

పెద్ద డాబా మీద రాత్రి పూట వంద మందికి భోజనాలు పెట్టేడు. పెద్ద కేకు తెచ్చి, వీడియోలు, ఫోటోల తోధాం ధూంఅని చేసేడు. చుట్టూ ఊళ్లళ్లో ఉన్న చుట్టాలనీ, అతని స్నేహితుల కుటుంబాలనీ పిలిచేడు.

అతనితో  మాట్లాడక పోవడం వల్ల అసలు ఇదంతా నాతో చెప్పలేదన్న మాటఅనుకుంది తన్మయి.

తన్మయి తల్లిదండ్రులు పిలవకపోయినా తమ బాధ్యత అన్నట్లు  పిల్లాడికి బంగారం చెయిను, మురుగులు పట్టుకుని సాయంత్రం బస్సుకి వచ్చేరు

పుట్టినరోజు ఖర్చు భరించాల్సి వస్తుందని మీ అత్తగారోళ్లు మొత్తానికే రాకుండా ఎగేస్తారనుకున్నానుఅని వ్యంగ్యంగా  కొడుకుతో దేవి అనడం వింది తన్మయి

శేఖర్ తల్లిదండ్రులు  పెత్తనం అంతా చెలాయించేరు. డాబా మీద మధ్యలో వేసిన టేబులు పక్కన కుర్చీలో బాబునెత్తుకుని కూచోవడం ఒక్కటే తన్మయి పని.

ఎంత గొప్పగా చేస్తే ఏవి లాభంరా, నీ పెళ్లాం ముఖంలో కళా కాంతీ లేకపోయేకాఅని సాగదీసింది దేవి ఫంక్షను అవుతూనే.

దాన్ని పట్టించుకోకమ్మా, అదెప్పుడూ ఏడుపు మొహవేసుకుని ఏడుస్తాది.”  లైటింగు సెట్లు విప్పుతూ అన్నాడు శేఖర్.

జ్యోతి కూతురి వెన్ను నిమిరిందిఏవీ మాట్లాడొద్దన్నట్లు“.

తన్మయికి అతని మాటలు కొత్తవీ కావు, వింతగానూ లేవు.

అసలివేళ అక్కడ జరుగుతున్న బాబు పుట్టిన రోజు ఆనందం మనస్సులో మచ్చుకైనా లేదు.

ఫంక్షను కాగానే చుట్టాలంతా అక్కడే డాబా మీద దుప్పట్లు పరుచుకున్నారు.

తల్లి పక్కన చేరి కళ్లు మూసుకుంది తన్మయి.

బాబుని తీసుకుని కిందికి వెళ్లేడు శేఖర్. అసలే అలిసిపోయిన చంటాడిని ఇప్పుడెందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు తన్మయికి.

అర గంట సేపైనా చంటాడిని తీసుకు రాకపోయే సరికి కిందికి వెళ్లింది తన్మయి.

అక్కడ కనబడ్డ దృశ్యం చూసిశేఖర్అని గద్దింపుగా ఒక్క కేక పెట్టింది. వాళ్ల మేనమావలతో తాగుడు, పేకాట పార్టీ లో కూచున్నాడు శేఖర్.

అందులో ఒక మావయ్య పిల్లాడి పెదవుల దగ్గిర గ్లాసు పెట్టి తాగించబోతున్నాడు.

సిగిరెట్టు పొగల మధ్య చుట్టూ ఉన్న పది మంది మగవాళ్లు పగలబడి నవ్వుతున్నారు.

తన్మయి అరుపు విని అదిరిపడి బాబుని తీసుకొచ్చి తన్మయి చేతికి ఇచ్చేడు శేఖర్ మేనమామ.

ఇక అదే చికాకులో సందులోంచి బయటికి బాబునెత్తుకుని చీకట్లో బయటికి నడిచింది తన్మయి.

లోపల శేఖర్ ఇదేం పట్టించుకోకుండా  గట్టిగా దేనికో నవ్వడం వినిపిస్తూంది.

హడావిడిలో చెప్పులు వేసుకోలేదు. ఎక్కడికి నడవాలో తెలీదు. రాళ్లు గుచ్చుకుంటున్నాయి.

పైన డాబా మీంచి చూసిన తన్మయి తండ్రి వెనకే పరుగెత్తుకొచ్చేడు. “ఎక్కడికమ్మా చీకట్లో బాబునెత్తుకుని.” అన్నాడు రెక్క పుచ్చుకుని వీధి మలుపులో.

పెద్ద వీధి మలుపు తిరిగితే రోడ్ల మీద ఆటోలు కనబడతాయి.

తండ్రి చెయ్యి విదిలించుకునినేను ఇంటికి వెళ్లిపోతున్నాను నాన్నా, మీరూ అమ్మా వెనకే వచ్చెయ్యండిఅంది ఆటో పిలుస్తూ

తన్మయి ముఖం చూస్తూసరే, వచ్చేస్తాం. నువ్వు కూడా మాతో వద్దువుగాని. ఆగుఅన్నాడు.

తన్మయి వినకుండా ఆటో ఎక్కి కూచోవడం చూసి తన్మయిని జరగమని, తనూ కూచున్నాడు భాను మూర్తి.

తన్మయిని ఇంటి దగ్గిర దించి, “అమ్మని తీసుకుని మళ్లీ వస్తానుఅని అదే ఆటోలో వెనక్కి వెళ్లేడు.

ఇంటికి వచ్చేసరికి నిస్సత్తువతో కాళ్లు కదలక తలుపు తీస్తూనే దు:ఖంతో కూలబడిపోయింది తన్మయి. బాబుని హత్తుకుని ఏడుస్తూ ఉందేమో, వాడి తలంతా కన్నీళ్లతో తడిసిపోతూంది.

అలిసిపోయి నిద్ర పోతున్న పసివాడిని గుండెలకు హత్తుకునినాన్నా, నీకిదేం ఖర్మరా.. ” అంటూ వెక్కి వెక్కి పడసాగింది.

————

మర్నాడు ఉదయం  శేఖర్ ఇంటికి రాలేదు.

దేవి వచ్చింది. ఇంట్లోకి వస్తూనేఏమ్మా మీ కూతురికి మంచీ, చెడూ నేర్పించుకోరా? ఇదేనా మీ గొప్ప పెంపకం? అవతల కొడుకు పుట్టినరోజని నా కొడుకు పొంగుకుంటూ అందరినీ పిల్చుకుంటే,  ఈవిడిలాగ పిల్లాణ్ణి తీసుకుని రాత్రికి రాత్రి వచ్చేస్తాదా? మగోళ్ళ మధ్యకి అసలెందుకు వెళ్లిందీ అంట.” అని అరవసాగింది

 నేల మీద వెనక్కి తిరిగి పడుకున్న తన్మయి అసలు లేవలేదు, వెనక్కి తిరిగి చూడలేదు.

చూసేవా కండకావరం, అత్తగారు వచ్చిందని మర్యాదైనా ఉందా మీ కూతురికి? ఇలా మొండితనంతో నా కొడుకుని ఎంత వేధించుకు తింటూందో చూస్తూనే అర్థం అవుతూందిఅని విరుచుకు పడింది.

జ్యోతి ఏదో చెప్పేలోగా భానుమూర్తి ఎదురుగా వెళ్లి , “అక్కయ్యగారూ క్షమించండి. ఏదో చిన్నపిల్ల, దానికింకా పెద్దరికం రాలేదుఅన్నాడు.

పెద్దరికం రాకపోతే నేర్పించవయ్యా. గారాబాలు చేసి నెత్తికెక్కించుకోవడం కాదు. దాన్ని చెంపా, చెంపా వాయించి పంపించు.” ఇంకాస్త గట్టిగా అంది.

జ్యోతి వెంటనే రోషంతోఏవమ్మా, మా పిల్లని మేం ఎప్పుడూఅన్నాఅని అదిలించింది లేదు. ఇవేళ నువ్వు చెపితే చెంపలు వాయించడానికి. అయినా మీ కొడుకు చేసింది బావుందా? పసివాడితోనా ..హవ్వ?” అని నోరు నొక్కుకుంది.

అదీ సంగతి. మీరిలా వెనకేసుకు రాబట్టే కొరివి మమ్మల్ని ఇలా కాల్చేస్తూందిఅంది దేవి ఎద్దేవాగా.

ఇదుగో చూడండి అక్కయ్య గారూ, ఏదో అయ్యిందేదో అయిపోయింది కాస్సేపట్లో అమ్మాయిని, మనవణ్ని తీసుకుని వస్తాను.” అన్నాడు నమస్కారం పెడ్తూ. తప్పు ఒప్పుకుంటున్నట్లు  భాను మూర్తి.

ఇన్ని జరుగుతూన్నా వెనక్కి తిరిగి చూడని తన్మయిని ఈసడింపుగా చూస్తూ  “ఇదుగో మధ్యాహ్నం భోజనాల వరకు టైం ఇస్తున్నా. నా మనవడు నాకు కనిపించాలి.” అంటూ అప్పుడే వచ్చిన శేఖర్ బైకు మీద ఎక్కి కూచుంది దేవి.

తల్లిని దించింది ఇతనేనన్న మాట అనుకుంది బైకు శబ్దం విని తన్మయి.

ఏవిటమ్మా ఇదంతా?” అన్నాడు భానుమూర్తి తల పట్టు కుంటూ.

మన ఖర్మఅని  నెత్తి కొట్టుకుని ఏడుస్తూన్న తల్లిని చూస్తూ, “అమ్మా, ఇక ఏడాది వచ్చింది కదా. బాబుకి పాలు మానిపించొచ్చాఅంది తన్మయి అసందర్భంగా.

జ్యోతి కూతురి వైపు చూసి కళ్లు తుడుచుకునిబాబుని తీసుకుని మాతో సాయంత్రం మన ఊరు వచ్చెయ్యి. కొన్నాళ్లాగి వద్దువులే.” అంది.

అక్కడ తన చుట్టూ ఏం జరుగుతూ ఉందో అన్న దాని కంటేపదిహేను రోజుల్లో  ఎమ్మే ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయన్నదే తన్మయి మనస్సులో గట్టిగా మెదులుతున్న సమస్య

సమయంలో వెళ్లడమే మంచిదేమో. అక్కడుంటే బాగా చదువుకోవచ్చు. “పరీక్షలు ఎలాగో గట్టెక్కే వరకూ బాబుని అమ్మ దగ్గిర అలవాటు చెయ్యాలికఅనుకుంది తన్మయి.

కానీ శేఖర్ని కాదని వెళ్తే జరిగే రాద్ధాంతం ఇష్టం లేదు.  వాళ్లంతా కలిసి తన తల్లిదండ్రుల్ని ఆడిపోసుకుంటారు

బాబుకి తలార స్నానం చేయించింది. తను కూడా తయారయ్యి తల్లిదండ్రుల్ని తీసుకుని శేఖర్ తాత గారింటికి భోజనాల సమయానికి వెళ్లింది

అంతా తన్మయిని చూసి అసలక్కడేమీ జరగనట్లు మామూలుగా పలకరించేరు.

సాయంత్రం చుట్టాలంతా వెళ్లేంత వరకూ ఉండి తన్మయి తల్లిదండ్రులతో ప్రయాణమయ్యింది. వెనక్కి వచ్చిన తన్మయిని చూసి ఏమనుకున్నాడో ఏమో తన్మయి ఊరు వెళ్తాననగానే తలూపేడు శేఖర్.

——–

రెండ్రోజుల్లోఅమ్మా, ఇక ఏడాది వచ్చింది కదా. బాబుకి పాలు మానిపించొచ్చాఅని మళ్లీ అడిగింది తన్మయి.

నిజానికి సమాధానం తల్లికంటే తనకే బాగా తెలుసు

బాబు తన దగ్గిర పాలు  తాగడం అంటే తన్మయికి తెలిసిందొక్కటే. తన గుండెల్లో ఉన్న అత్యంత ప్రేమని అందజేసే మార్గం. అంతే

ఇప్పుడు పాలు మానిపించడమంటే బాబు కంటే తనకే ఎక్కువ బాధగా ఉంది. బాబుని తన నుంచి వేరు చేసి బైటి ప్రపంచం వైపు విసిరేస్తున్నట్లున్న మెలిక తిప్పుతున్న బాధ

కానీ తనిప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంత కంటే మార్గం లేదు

రాత్రంతా గుక్క పెట్టి ఏడుస్తున్న పసి వాడికి పాలివ్వకుండా భుజాన వేసుకుని తిప్పుతూ, విసిరి కొడ్తున్న పాల సీసా ని మళ్లీ మళ్లీ దగ్గిరికి తెస్తూ  ప్రయత్నిస్తూనే ఉంది

తెల్లారగట్ల ఏడ్చి ఏడ్చి  అలిసిపోయి నిద్రపోతున్న పసివాడి బుగ్గల్ని రాస్తూ  “నన్ను క్షమించు నాన్నాఅంది కళ్లు తుడుచుకుంటూ

కూతురితో పాటూ రాత్రంతా మెలకువగా ఉన్న జ్యోతి కూతురి దగ్గిరికి వచ్చి తల నిమిరింది. “మరీ ఇంత సున్నితంగా ఉంటే ఎలాగమ్మా?” అంటూ.

తెల్లారగట్ల  పసివాడిని అక్కున చేర్చుకుని తల్లి ఒడిలో తల దాచుకుని పడుకున్నప్పుడు ఇక ప్రపంచంలో బాధలూ లేవన్నంత ప్రశాంతంగా అనిపించింది తన్మయికి.

చాలా విచిత్రంగా రెండో రోజు నించి తల్లిపాలు మానేసేడు బాబు

చూసేవా నీ  కొడుకు ఎంత సులువుగా పాలసీసా పట్టుకున్నాడో!   మాత్రానికి   రాత్రంతా ఏడుస్తూ కూచున్నావుఅని నవ్వింది జ్యోతి.

****

పరీక్షలు రెండ్రోజుల్లో ఉన్నాయనగా  బాబుని అమ్మ దగ్గిర వొదిలి స్థిమితంగా బస్సెక్కింది తన్మయి.

బస్సు కదిలే వరకూ బాబు తల్లి  వైపు దుముకుతూనే ఉన్నాడు. బస్సు కదలగానే ఒక్క సారిగా విపరీతమైన దు:ఖం వచ్చేసింది తన్మయికి.

మొదటి సారి బాబుని వొదిలి పెట్టిందేమో బస్సు విశాఖపట్నం చేరే వరకూ దు: పడ్తూనే ఉంది.

శేఖర్ ఇన్నాళ్లుగా తనెప్పుడొస్తుందో ఫోను చెయ్యడం గానీ, బాబు గురించి అడగడం గానీ చెయ్యలేదు.

అక్కడుండగానా కొడుకు.. నాకొడుకుఅని తెగ పొంగిపోయే మనిషికి  ఊరెళ్తే కొడుకు అవసరం లేదన్న మాటఅనుకుంది తన్మయి.

తనెళ్లిందగ్గర్నించీ శేఖర్ కూడా ఇంట్లో లేనట్లున్నాడు. ఇంటి తాళం తీసి చెత్తగా ఉన్న ఇల్లంతా ఊడ్చి, స్నానం చేసి, ఫోను కోసం బయటికి పరుగెత్తింది.

నీకేం బెంగ లేదు. బాబు ఇంచక్కగా ఆడుకుంటున్నాడు. నువ్వు పరీక్షలు బాగా రాసిరాఅంది జ్యోతి అవతలి నుంచి.

ఫోనులో బాబు గొంతు “…” అని వినగానే గుండె వేగంగా కొట్టుకుంది తన్మయికి.

వెనక్కి వస్తూఏమనుకోకు నాన్నా. ఇంతకంటే వేరే మార్గం లేదు నాకుఅనుకుంది లోపల్లోపల.

శేఖర్  బాబుని వొదిలి వచ్చినందుకు  గొడవ చేస్తాడోమో  అని ఆలోచిస్తూ   స్టవ్వు మీద కాస్త బియ్యం పెట్టి, పుస్తకాలు ముందేసుకుని కూచుంది

చదవడం మొదలు పెట్టగానే దీక్షగా లీనమై పోయింది. అదొక్కటే తన్మయికున్న వరం. ఎన్ని సమస్యల్లో ఉన్నా  పుస్తకాలు తీస్తే ఇక ఏదీ జ్ఞాపకం రాదు తనకి

ఇంటాయన మీటర్ రీడింగంటూ తలుపు కొట్టేడు మధ్యాహ్నం.

తన్మయి మాములుగా గేటు దగ్గరకు వెళ్లి నుంచుంది.

 గేటు దాటి అప్పుడే అటుగా వెళ్తున్న కరుణ కనిపించేడు. పరీక్షలకు శ్రద్ధతో చదువుతున్నట్లు పుస్తకం చేతబట్టుకున్న తన్మయిని చూస్తూనే గబుక్కున దగ్గిరికి వచ్చేడు.

 “ఏవిటండీ, మీరు? ఎల్లుండి నించి పరీక్షలు పెట్టు కుని ఎక్కడికి వెళ్లిపోయేరు?” అన్నాడు.

అంతలోనేమీరు నన్ను క్షమించాలి. మీ అబ్బాయి పుట్టిన రోజుకి రాలేకపోయాను. ” అన్నాడు.

ఫర్వాలేదులెండిఅంది తన్మయి

అంతా చదివేసేరా?” అని, “ఏవిటి నన్ను లోపలికి రానివ్వరా ఇక్కడే నిలబడి మాట్లాడతారా?” అన్నాడు చనువుగా.

తన్మయిసోరీ. రండి. ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని లోపలికి పిలవడం మర్చిపోయేనుఅంది.

వాకిట్లో బండి చూస్తూమీ బండి రంగు బావుందండీఅన్నాడు

ఇంట్లోంచి బయటకు వెళ్తున్న ఇంటాయనని చూస్తూఅందుకా మీరు బయట నిలబడింది, ఎప్పుడూ బయట కనబడరు కదాఅన్నాడు.

టీ కప్పు అందుకుంటూచూడండి, పరీక్షలలో బాగా మార్కులు రావాలంటే నా దగ్గిర కొన్ని చిట్కాలున్నాయి.” అన్నాడు తమాషాగా కళ్లెగరేస్తూ.

తన్మయి ఏదో అడిగేలోగాఅవన్నీ చెప్పాలంటే కొంచెం ఖర్చవుతుంది. అంటే మీ ముత్యాల వంటి చేతి రాతతో రాసుకున్న నోట్సు కాస్సేపు నాకివ్వాలి. చదివి పొద్దున్నే తెచ్చిస్తాను. కావాలంటే మరో సబ్జెక్టు  నోట్సు మీకిస్తానుఅన్నట్లు మన వాళ్లంతా లైబ్రరీ దగ్గిర కంబైండ్ స్టడీస్ అంటూ చేరుతున్నారు రోజూ ఉదయం. రేపు మీరూ వస్తారుగా”  అని నవ్వి బయలుదేరేడు.

కాస్సేపు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది తన్మయికి. “  ప్రపంచంలో చదువు మాత్రమే ఉండి  ఉంటే ఎంత బావుణ్ణు ! ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉండడం వల్ల  విజ్ఞానానికి విజ్ఞానం, ఆరోగ్యానికి ఆరోగ్యంఅని నవ్వుకుంది

అతనిచ్చిన నోట్సు తెరిచి గబగబా చదవసాగింది

సాయంత్రం పాఠాలన్నీ ఒకటికి పది సార్లు మననం చేసుకుంటూ,  చిన్న వరండా బల్బు వెలుగులో పద్యాల్ని వల్లె వేస్తూ  చుట్టూ పుస్తకాల మధ్య పడి అలాగే నిద్దట్లోకి జారుకుంది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.