
అద్దానికి ఏమి తెలుసు?
-చందలూరి నారాయణరావు
నీవు
అంటే ఏమిటో అద్దానికి
ఏమి తెలుసు?
దగ్గరగా ఉంటూ
అందాన్ని మాత్రమే మాట్లాడుతుంది.
నిన్ను
దాచుకున్న మనసును
అడిగి చూసేవా?
ఎంత దూరంగా ఉన్నా
ప్రేమే ఊపిరిగా జీవిస్తూనే ఉంటుంది.
****
Please follow and like us:

పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు.
వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు
ప్రవృత్తి: వచన కవిత్వం
రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి
