ఆమె కవితలు

-పాలపర్తి ఇంద్రాణి

  1.  

ఆమె ఉల్లాసాన్ని
ఉడుపులుగా
ధరించి వచ్చింది
వారు ఆమెను
బాధించలేక పోయారు

ఆమె వైరాగ్యాన్ని
చేత పట్టుకు వచ్చింది
వారు ఆమెను
బంధించలేక పోయారు.

ఆమె వినయాన్ని
వెంట పెట్టుకు వచ్చింది
వారు ఆమెను
వేధించలేక పోయారు.

ఆమె జీవితాన్ని
తపస్సుగా మార్చుకుంది
వారు మూతులు
తిప్పుతూ
తొలగిపోయారు.

2. 

నేను 
వివేకము 
విచక్షణ ఉన్న

ఈశ్వర సృష్టితప్రాణినిఅని ప్రకటించావునువ్వు అది వినిటింకర వంకరనాగుపాములునంగిరి నంగిరివానపాములుహిహ్హిహీఅని నవ్వి హింగిరి హింగిరిగానీ వెంట పడ్డాయిఅప్పుడు నువ్వువంటిట్లో దూరిచెంచాల వెనుకమిల్లి గరిటెల వెనుకదాక్కున్నావు నీ అమ్మఅమ్మమ్మవాళ్ళ అమ్మఅందరూ అక్కడేనక్కి ఉండడం చూసిఆశ్చర్య పడ్డావు అంతలో,నువ్వు ఎక్కడదాక్కున్నావోకనిపెట్టేసిననాగు పాములువాన పాములువాళ్ళందరినీపొగిడినట్టేనిన్నూవంటింటి కుందేలుఅని వేనోళ్ళ పొగిడాయి. 3.

కామాన్ని జయించలేని వాడు

క్రోథాన్ని జయించలేని వాడులోభాన్ని జయించలేని వాడు స్త్రీని చూడగానే,హిహ్హీ,ఆడది!అని నవ్వారు. ఏది అవసరమోఅదే వినడం అన్నవిద్య నేర్చినఆ మోహనమూర్తి క్షణమైనావెనుతిరగక,వెలుగు విత్తనాలనుభూమి గర్భంలోఒక్కటొక్కటిగాపాతి పెడుతూస్వర్గం వైపుకుసాగిపోయిందిఆమె

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.