
మేలుకొలుపు
-రాజేశ్వరి రామాయణం
ఆశల కావడి భారందేహపు విల్లును నిలువెల్లా విరిచేస్తుంటేవూహాల రంగుల సౌధంకళ్లెదుటే పెళ్లలుగా విరిగిపడుతుంటేనీకంటూ మిగిలిన ఓ క్షణంనిన్నిపుడు ప్రశ్నిస్తోంది నీదికాని కలల్ని మోసుకొనికాలాన్నంతా రెప్పలపై కూరుకొనిఎదురుపడ్డ ముళ్ళన్నిటినీ పూవులుగా పులుముకుంటూఆకలి దప్పులు తాగేశావ్ నువ్ విసిరేసిన విశ్రాంతి శాశ్వతంగా నిన్ను అక్కున చేర్చుకుంటున్న వేళబాసలు చేసిన బంధం బరువుగా నిట్టూరుస్తూప్రాణం పోసిన పాశం మేఘాల అంచున రంగుల లోకపు హంగులకు కావలి కాస్తోంది ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా నుసిగా మారే కర్పూరానికి వెలుగొక్కటే కాదు ఆసాంతం మసిచేసే గుణముందని తెలిపావానువ్వుగా మారిన ఎడారి కూడా కాక్టస్ లకు నెలవేనని చెప్పావా ఏనాడో చచ్చిన నీకు నీ వూపిరి పాట తీతువురాగంగా వినిపిస్తే వగచేదెందుకులే..ఏడుకట్ల సవారీ గమ్యం చేరకముందే బతుకు గద్దెపై స్వేచ్చా గానానికి అస్తిత్వం అందెలుగా చిందేయ్
*****

రాజేశ్వరి రామాయణం వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. తెలుగు ,ఆంగ్ల ,హిందీ భాషా సాహిత్యాన్ని చదవడం వీరికి ఆసక్తి..అడపాదడపా కవిత్వం రాయడంతోపాటు అనువాదాలు చేస్తుంటారు..పిల్లలతో మమేకం అయ్యే కార్యక్రమాలు అంటే మక్కువ.
