
“నెచ్చెలి”మాట
మరుపు మంచిదేనా?!
-డా|| కె.గీత
“మరుపు మంచిదే”
ఇదేదో
ప్రకటన
కాదండోయ్!!
పచ్చి నిజం-
మరి పండుదేవిటి?!
“కొన్ని
మర్చిపోకపోతే
మంచిది-
కొన్ని
మర్చిపోతే
మంచిది-”
ఆహా!
వారెవ్వా!
అన్నారా…
అయితే
కొటేషన్ కాదు ముఖ్యం!
మర్చిపోవాల్సినవేవిటో
మర్చిపోకూడనివేవిటో
తెలుసుకోవడం
జాబితా రాసుకోవడం-
జాబితా రాసుకుని
మర్చిపోతే?
దీర్ఘంగా ఆలోచించడమే
“ఇంటి పై కప్పు కోసం కాదు…”
మళ్లీ
ప్రకటన
కాదండోయ్!!
పండు నిజం-
“కొన్ని
కావాలనుకుని
మర్చిపోయేవి
కొన్ని
ఎక్కువైపోయి
మర్చిపోయేవి”
ఆహా
వారెవ్వా
అనకపోయినా
కొటేషన్ కాదు
ఎక్కువైపోయి
మర్చిపోయేవి
(పట్టించుకోకపోయేవి)
కోవిడ్ జాగ్రత్తల్లాగా-
ఏ వేరియంట్ అయినా
భయపడేదే….. లా-
యుక్రెయిన్
మీద
రష్యా
అక్రమ
యుద్ధంలా
ఏ దేశాన్ని
ఎవరు
ఆక్రమించుకున్నా
పట్టించుకొనేదే…లా-
మరి
కావాలనుకుని
మర్చిపోయేవి
క్షమార్హాలేనా?
ముక్కుపచ్చలారని
ఆడపిల్లల మీద
అత్యాచారాల్లా-
దుర్మార్గానికి
పాల్బడుతున్న
సామాన్యుల్ని
ఘటనా స్థలంలో
కాల్చేసి జబ్బలు
చరుచుకోవడమే కాదు
అసామాన్యుల్ని
కనీసం
పట్టుకోండి-
క్షమార్హం
కాని
మరుపు
మంచిదేనా?
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటు రాసిన వారికే కాక ఆర్టికల్ కు సంబంధించిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
మే, 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:జానకిరామం
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: మీను (కథ), రచయిత్రి: బండి అనురాధ
ఇరువురికీ అభినందనలు!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

డా.గీతగారి సంపాదకీయమండీ .నిజమే సంపాదకీయమే .మరచిపోవద్దు ..
అవును .సంపాదకీయంలో చెప్పిన సవాలక్ష సమస్యలు .ఆమె అన్ని చెప్పక పోయినా “చిలువలు పలవలై “బతుకుని చిద్రం చేస్తున్న ముఖ్యమైన మూడు సమస్యలు చాలవాండి.మూడు లక్షల బ్రతుకు లైనాముక్కలైపోయిన వైనం వినే ఉంటాం .మరి మరచిపోకుండా ఆసమస్యలను మూలాలనుండి పెకిలిచడంలో పాత్ర పోషించాలిగదా మనం కూడా …’మంచి సంపాదకీయం వ్రాసిన డా.గీత గారికి అభినందనలు .
ధన్యవాదాలు విశాలాక్షి గారూ!