
భవిత
– టి. వి. యెల్. గాయత్రి
చెట్టులేదు చేమ లేదుచిట్టడవు లెక్కడ? లేనే లేవుపులుగు పోయి పుట్ర పోయిపశుల జాతి పోయి పోయివెనకడుగై కనుమరుగైగతము లోకి జారి పోతేఒంటరిగా వేదనతోభగభగమని మండి పోతూవేడి పుట్టే వాడి సెగలుపుడమి తల్లి కక్కు తుంటేఎక్కడ? ఎక్కడ? నీ భవిత?చెప్ప వోయి వెఱ్ఱి మనిషి! గాలి నిచ్చి జీవమిచ్చి చేవ నిచ్చి మేలుచేయుచెట్టు చేమ పెంచ వోయి!చేర దీసి నీరు పెట్టిభూత కోటి బ్రతుకు పట్టిభూమాతకు బహుమతిగాపచ్చదనము పెరగనీయి!
*****
Please follow and like us:

నా పేరు టి. వి. యెల్. గాయత్రి. పూణే మహారాష్ట్రలో నివాసము. గృహిణిని. నాలుగు శతకములు వ్రాసాను. ప్రతిలిపిలో మినీ కథలు వ్రాసాను. నేను పద్యాలు, కవితలు, కథలు, వ్యాసాలు వ్రాస్తూ వుంటాను.
