
ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి
-డా. టి. హిమ బిందు
జాబిల్లి చెంత
వెన్నెల రేయి చల్లనిదే..
నిదుర ఒడిలో
జోలపాడే రేయి మధురమైనదే
ఒంటరి మనసులకు
నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే
ఒంటరి ప్రయాణంలో
గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే
అస్వస్థతలో
తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే
ఆశయాల సాకారంలో
సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే…
కోప తాపాల నడుమ
కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే…
ప్రేమ తోడులో
ఊసులాడు రేయి ఆనంద నిలయమే….
ఎన్ని రేయిలయినా
ప్రతి రేయి ప్రత్యేకమే..
ప్రతి ఉదయం
కొత్త ఆశల ఉషోదయమే….
*****

రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. డి. పూర్తయింది. పర్యావరణంపై పరిశోధన పత్రాలు, అనేక వ్యాసాలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పండుగలు పర్యావరణంపై రాసిన పుస్తకము సుస్థిరోత్సవం. పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్దే మానవ మనుగడకు భరోసా అనే సత్యాన్ని అందరూ గ్రహించేట్టు చేయగలగాలని ఆకాంక్ష.
