
బద్ధకంగా బతికే ఉంటాయి
– శ్రీ సాహితి
ఒక్కో రోజుకు
బాకీ పడతామో,
బాకీ తీరుతుందో తెలియదు.
పగలంతా ఊహల్లో ఈత
రాత్రంతా మెలకువలో మునక
ఊడిగం చేసే ఆలోచనలో
విశ్రాంతి లేని నిజాలు
వెలుతురును కప్పుకుని
ఎండలో ఎగురుతూ
చీకటిని చుట్టుకుని
చలిలో ముడుక్కుని
తలను నేలలో పాతి
ఆకాశానికి కాళ్ళను వ్రేలాడుతీసి
సంద్రంలా మారిన మెదడులోని
తెరలు తెరలుగా కలలు
నిద్రను ఢీ కొని
బద్దలైన రోజులో
బద్ధకంగా బతికే ఉంటాయి.
*****
Please follow and like us:

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
