
“నెచ్చెలి”మాట
హక్కులు
-డా|| కె.గీత
హక్కు
అనగానేమి?
బాధ్యత..
అధికారము..
స్వామ్యము..
అబ్బా!
నిఘంటువుల్లోని
అర్థాలు
కాదండీ-
అసలు
హక్కులు
అనగానేమేమి?
సమానత్వపు హక్కు-
స్వాతంత్య్రపు హక్కు-
దోపిడిని నివారించే హక్కు-
మతస్వాతంత్య్రపు హక్కు-
సాంస్కృతిక హక్కు –
విద్యాహక్కు-
రాజ్యాంగ పరిహారపు హక్కు-
ఆస్తి హక్కు –
అనబడు
రాజ్యాంగ బద్ధమైన
ప్రాథమిక హక్కులు
మరియు….
అబ్బా!
అరిగిపోయిన
విరిగిపోయిన
పగిలిపోయిన
అలిసిపోయిన
రికార్డు
హక్కులు
కాదండీ….
రోడ్డెక్కిన
హక్కులు
బైఠాయించిన
హక్కులు
పోరాడుతూనే వున్న
హక్కులు
ప్రాణాలకు తెగిస్తున్న
హక్కులు
హమ్మయ్య
కొంచెం దార్లో
పడ్డారు
అంగన్వాడీ వేధింపుల నిరోధపు హక్కు
ఉపాధ్యాయుల కనీస జీతపు హక్కు
స్త్రీల అబార్షన్ హక్కు
ఇంకొంచెం
ముందుకు
రండి
నివేదికలు
నివేదనలు
నిరసనలు
వగైరా
హక్కులు
ఆయుధాలు …….
పోలీసులు……
స్టాకులు …….
వగైరా
వ్యతిరేక హక్కులు
మరియు
ప్రాణరక్షణ హక్కు
జీవించే హక్కు
బతగ్గలిగే హక్కు
ఇంకచాలు
హతోస్మి-
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
జనవరి 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: ఉదయశ్రీ ప్రభాకర్
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: జీవితం అంచున- రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి
ఇరువురికీ అభినందనలు!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
