ఓసారి ఆలోచిస్తే-5

ధ్యేయం

-డి.వి.రమణి

          “ఎం బిడ్డ ఇస్కూల్ నుండి లేట్ వచ్చినవ్ ?’ ప్రేమగా అడిగాడు వీర్రాజు

          “మాథ్స్ టీచర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు …” కాళ్ళు కడుక్కుంటూ జవాబిచ్చింది
సత్యవతి.

          “ఇదిగో …అమ్మయొచ్చింది … చూడు ఏమి కావాలో ..” చుట్ట ఒకసారి పీల్చి అన్నాడు.

          “అదే మరి నాకు పని , మహారాణిగారొచ్చారు ఇంకా సేవలు మొదలు , ఇంట్లో పని
అంటుకోదు … కూలికెళ్ళొచ్చి నేనే చెయ్యాలా ? ఆ అక్క మహా తల్లి దీన్ని నా మీద
పడేసి పోయింది …తప్పుతుందా…” పెద్ద గొంతేసుకుని అరుస్తోంది

          “ఎహె ఎందే నీ గోల ? ముందే సెప్పినా, అమ్మాయిని చూసేదానికే నిన్ను మనువాడింది … పోయిన సీతమ్మనేమన్న అన్నావంటే బొక్కెలిరగ దిస్తా … “పక్కనున్న బాల్చీని ఒక్క తన్ను తన్నాడు వీర్రాజు …కోపంగా

          “దీనికేం తక్కువలే … నేనెళ్ళి నాలుగు రాళ్లు సంపాదిస్తేనే ఇల్లు గడిచేది , నువ్వు
పనికి బోతావ్ ఇంట్లో దమ్మిడీ ఇవ్వవు … నీ తాగుడుకు నీకె పైసలుచాలవ్ ..
దోస్తులతో జల్సా , ఇంటి బాధ్యత అసలుందా ??? నా ఒక్కదానిదేనా ???ఏందో
చెబుతున్నాడు …”విసుగ్గా అంది

          “అయ్యా నువ్వాగు నేను చేస్తాలే వచ్చిన కదా “ అని పుస్తకాల సంచిలోపల పెట్టి
వంటగదిలో కెళ్ళింది సత్య పనులు చెయ్యటానికి

          లోపల గది పక్కనొక బెడ్ రూమ్.. ముందు చిన్న వసారా ఆ తర్వాత చిన్న పెరడు
ఆ కాస్త జాగా లోనే అన్ని కూరలు పండిస్తోంది రత్తాలు. ఈ రోజు ఒక్క పని కూడా చేసినట్టు లేదు … సత్య ఒక్క మాట కూడా అనకుండా చీపురు తీసుకుని ఇల్లు ఊడ్చి, అంట్ల గిన్నెలు కడిగి , బకెట్ లో ఉన్న బట్టలన్నీ ఉతికి ఆరేసి స్నానం చేసి వచ్చింది.

          ఒక్క నిమిషం, జాలేసింది రత్తాలుకి , పాపం పొద్దుననగా వెళ్ళింది అనిపించి ,”
సత్యాలుదా అన్నం తిందువుగని, ఈ రోజు పానం బాగోలేక ఏ పని ముట్టలేదు “
సంజాయిషిగా అంది .

          “ఫర్లేదు పిన్ని … “ నెమ్మదిగా అని అన్నం ముందు కూచుంది, వేడి అన్నంలో
పచ్చడి వేసింది, పాత ఊరగాయ ఎదో వాసనొస్తుంది అయినా ఏమి అనలేదు సత్య
మాట్లాడకుండా తినేసి పల్చటి మజ్జిగ పోసుకుని తింది.

          “అందుకే చెప్తున్నా మా తమ్ముణ్ణి మనువాడు ఎదురు ఒక లక్ష ఇస్తానన్నాడు అది
వడ్డీకి తిప్పుకుంటే రోజులెళ్ళిపోతాయ్ అంటే మీ అయ్యా కాదంటాడు …. “ ఆ మాట వింటూనే వచ్చి కాలితో ఒక్క తన్ను తన్నాడు వీర్రాజు , “ ఇంకో పాలి ఆ మాటన్నావంటే నాలిక చీరేస్తా, అమ్మాయి కేమి తక్కువే? 40 ఎల్లా వాడికి 16 ఏళ్ళ పిల్లకి కట్టబెడతావా? ఆడికి మొదటి భార్య పురిటిలోపోతే , రెండో భార్య లేచిపోతే ముక్కు పచ్చలారని నా కూతురు కావాలా ఆడికి ?” అని రంకెలేశాడు …

          గబా గబా వీర్రాజు చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొచ్చింది సత్య …“నువ్వట్టా చూస్తూనే ఉండు నేను ఆడికి ఇచ్చి చేస్తా ఎట్టా అవుతావు ఆపు “ అంతే గట్టిగా అరిచింది రత్తాలు కూతురివైపు నిస్సహాయంగా చూసాడు వీర్రాజు అతనికి ఎందుకో భయం పట్టు కుంది

***

          ఒక వారం గడిచింది , ఇంటర్ పరీక్షలవుతున్నాయి ఇంకొక్క పరీక్షా ఉంది. సీరియస్ గా చదువుకుంటోంది సత్య …అప్పటికి 4 రోజుల నించి రత్తాలు తమ్ముఁడు
వెనకయ్య ఇంట్లోనే ఉన్నాడు. అక్కతో ముచ్చట పెడుతూ కొంత డబ్బిచ్చినట్టున్నాడు కొత్త వస్తువులు కనిపిస్తున్నాయి. సత్య అడగలేదు …వీర్రాజుకుడా.

          సత్య కి ఒకటే ధ్యేయం … పోలీస్ అవ్వాలి … కొంత వరకు జరుగుతున్న అన్యాయాల్ని ఆపాలి … ఎవరితో మాట్లాడదు , తన పనేమిటో అంత వరకే …
ఇంటర్ పరీక్షలైపోతే హైదరాబాద్ వెళ్లి ట్రైనింగ్ కి అప్లై చేసుకోవాలి ఇవే ఆలోచనలు
ఎప్పుడు …అన్ని సర్టిఫికేట్ లు, ప్రైజులు ఒక దగ్గర చాల జాగ్రత్తగా పెట్టుకుంది .
పిన్ని ఆలోచనలు తెలిసిన, అయినప్పుడు చూద్దాములే అని పట్టించుకోలేదు …
చివరి పరీక్ష రాసి వచ్చి పడుకుంది అలిసిపోయి. మాటలు వినిపిస్తుంటే మెలుకువ వచ్చింది చిన్నగా లేచి పక్కకొచ్చింది, వంటగదిలోంచి మాటలు ..చిన్నగా మాట్లాడు తున్నాడు వెంకయ్య

          “రేపు పొద్దునే గుళ్లో పెళ్లి అందుకోసం అన్ని తెచ్చాను “ అని సంచి ఇచ్చాడు రత్తలుకి …,,” పొద్దుటే లేపి తాయారు చెయ్యి చీర, తాళి అన్ని ఇందులో ఉన్నాయ్ “ అంటూ ఒక్కసారి గుండె ఆగినంతపనైంది సత్యకి, సత్య వెనకే నిలబడ్డ వీర్రాజుకి కూడా.
తెలీని భయం ఆవహించింది … నెమ్మదిగా సత్య చేయిపట్టుకుని లోపల గదిలోకి తీసుకొచ్చి , మంచం కింద ఉన్న భోషాణంలోంచి ఒక చిన్న సంచి కొంత డబ్బు
చేతిలో పెట్టి ,

          “తల్లి నీ బతుకు నువ్వు బతుకు ఎదో ఒక ఉద్యోగం చేసుకుని , బాగుపడు నేను బతుకు ఉంటె ఎక్కడున్నా వస్తాను తల్లి “ కళ్ళ నీళ్లతో అన్నాడు …

          “అయ్యా “ అని పట్టుకుని ఏడ్చేసింది సత్య … “ ఏడవకు తల్లి నా మాటవిను పద
తొందరగా వెళ్ళిపో వాడొస్తే మళ్ల కష్టం “ అని చెయ్యి పట్టుకుని పెరటి తలుపుతెరిచి .,
పంపేసి సత్య పడుక్కున్న దగ్గర దిండ్లు పెట్టి దుప్పటి కప్పి ఏమెరగనట్టు వచ్చి
పడుకున్నాడు. నిద్ర నటిస్తూ… ఉదయం ఎదుర్కోబోయే తుఫాన్ కి తనని తాను
తాయారు చేసుకుంటూ ….

***

          వడివడిగా నడుస్తూ రామాలయం లోపలకి వెళ్ళింది, చిమ్మ చీకటి ఇంట్లోంచి రోడ్డు మీద కొచ్చిన సత్య … కోవెల మెట్ల మీద కూచుని వెక్కి వెక్కి ఏడ్చింది. భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తుంటే … తలమీదనించి చున్నీ కప్పుకుని ఆలోచిస్తోంది… తూరుపు లో తొలి వెలుగు రేఖలు ప్రతి వస్తువు మీద పడి బంగారంల మెరిసిపోతున్నాయి, తొలి కిరణాల వెచ్చదనం శరీరాన్ని తాకుతూ కొత్త అశలకి ఊపిరి పోస్తోంది కానీ సత్యకి ఏమి అనిపించటల్లేదు …

          “ఎవరది ?” పూజారి రామస్వామిగారి గొంతు వినిపించి, టక్కున లేచి నిలబడింది
సత్య , తలొంచుకుని …జవాబివ్వకుండా

          “వీర్రాజు కూతురివి కాదు , అమ్మ సత్యా “ అనగానే అయన కాళ్ళ మీద పడి ఏడ్చేసింది సత్య ,” నన్ను కాపాడండి , “ అని 

          భుజాలు పట్టి లేవదీసి ,”చెప్పమ్మా ఏమైంది “ అన్నారు కరుణ నిండిన గొంతుతో
జరిగింది అంతా చెప్పింది …” సరే పద చూద్దాము ఏమి చెయ్యాలో …” అని పూజారి
గారింటి వెనకున్నమరొక పూజ గదిలో, ఇంకొక తలుపు తీసి వేరే ఇంట్లో కూచోబెట్టారు … ,” చూడు తల్లి విశ్రాంతి తీసుకో హైదరాబాద్ వెల్దాము నేనన్ని చూసుకుంటాను ఎవరోచ్చిన బయటకి రాకు, నీకు ఆహారం అందిస్తాను ఏమి ఆలోచించకు రాత్రంతా పడుకుని ఉండవు. ఈ ఉదయంలో మనం వెళ్లలేము రాత్రి బస్సుకి వెల్దాము “ అని తలుపు దగ్గరగా వేసి వెళ్లిపోయారు … లేచి తలుపు గడియ వేసుకుని పడుకుంది ఎప్పుడు నిద్రపట్టిందో మెత్తటి పరుపుమీద పడుక్కోగానే నిద్రపోయేసింది .

          అలికిడి అవుతుంటే మెలుకువ వచ్చింది ఎవేరో చిన్నగా తలుపు కొడుతున్నారు,
భయంగా తలుపు తీసి ఒక కన్నులోంచి వచ్చిందేవరా? అని చూసింది , ఒక చిన్నపాప కంచం మీద మూత పెట్టినది పట్టుకుని నిలబడి ఉంది, లోపలి వచ్చి చప్పున తలుపేసేసింది …

          ఆ అమ్మాయే చెప్పింది ఎలా సత్య కోసం వెతుకుతున్నది … పూజారిగారి
ఇల్లుకూడా వెతికారట, పిన్ని వచ్చి అరిచి వెళ్ళిందిట సాయంత్రవరకు ఆ పాపే తోడుంది సత్యకి … సాయంత్రం మల్లి 5 గంటలకి ఏవో తినటానికి స్నాక్స్ టీ పంపారు, భయం వదలలేదు …

రాత్రి అయింది …

          పూజారిగారు నేను బుక్స్ సంచి మర్చిపోయానని విని , అవెలాగో తెప్పించారు. లాస్ట్
బస్సులో బురఖా వేసుకుని ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చాను పూజారిగారి వెంట … ఊర్లో బయలుదేరేటప్పుడు ఎవరో ఎక్కి అందర్నీ పరిశీలిస్తున్నారు, చూస్తూ అడుగు తున్నారు … నన్ను బురఖా ఎందుకు వేసుకోమన్నారో అర్ధం అయింది. చాల భయమేసింది సత్యకి, కళ్ళు మూసుకుని పడుకున్నట్టు కూచున్నది గమనిస్తూనే ఉంది
బస్సు ఉరి పొలిమేర దాటగానే ఊపిరి తీసుకుంది …

***

          హైదరాబాద్ లో ఆస్మాన్ ఘఢ్ దగ్గర బస్సు దిగి లోపాలకి ఆటోలో వెళ్ళాము సత్య
బురఖా లోనే ఉంది . రామస్వామి ఒక పెంకుటింటి ముందు ఆగారు , తలుపు కొట్టగానే ఒకామె వచ్చి తలుపు తీశారు …

          “ రా అన్నయ్య , ఎవరి అమ్మాయి?” ఆశ్చర్య పోతు అడిగింది …

          “ మన వీర్రాజు కూతురు ….” అని మొత్తమ్ జరిగింది చెప్పాడు .. ఇంకా జోడించి ,”
ఈ అమ్మాయి పోలీస్ అవాలని అనుకునేది.. ఇంట్లోవాళ్ళు పడనివ్వలేదు నువ్వెలా
చేస్తావో నాకు తెలీదు నువ్వే ఈ అమ్మాయికి భవిష్యత్తు కూర్చాలి అంతేకాదు…
అందాకా ఏదన్న ఉపాధి కూడా చూడు నువ్వు పనిచేసే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్
లో …

          ఇంకొక మాట, ఇది, రహస్యంగా జరగాలి, ఎందుకంటే? వీళ్ల మామవరస
ఒకతనున్నాడు, ఈ అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టటానికి వాళ్ళ పిన్ని రెడీ
అయిపోయింది, ఇంట్లోంచి వచ్చేసింది …. ఇవిగో ఇంటర్ రాసింది హాల్ టికెట్ అన్ని
ఉన్నాయి …సర్టిఫికెట్స్ మెడల్స్ అన్ని మరి ఏమి చెయ్యాలో చూడు మీ ఇంట్లో
ఉంచుకో “ అని చెప్పారు.

          ఒక పూట కూడా అయినా వాళ్ళనైనా చూడని, ఇంకొకరి గురించి ఆలోచించని,
స్వార్ధపూరితమైన మనుష్యుల మధ్య కొత్త మనిషిని పోషించటం ఎంత కష్టం ??? సత్య
మనసు కృతజ్ఞతతో నిండిపోయింది …ఏమిచ్చి వీళ్ళ ఋణం తీర్చుకోగలదు?

          శారద, పూజారిగారు చాలానే ధైర్యం ఇచ్చారు … శారద భర్త శంకర్ రావు ఇన్ కం
టాక్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తారు. ఆయన కూడా .. వాళ్ళకి పిల్లలు లేరు ఇద్దరే ఉంటారు సత్య కి ఆ ఇల్లు కొత్తగా కానీ పరాయిగా కానీ అనిపించలేదు .

***

          చూస్తుండగా 3 సంవత్సరాలు గడిచాయి … సత్యకి కాలేజీలో కష్టం మీద సీట్
వచ్చింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ వెళ్ళేది, ఎక్కడ
ఎవెరితో మాట్లాడకుండా పోలీస్ జాబ్ కి కోచింగ్ తీసుకుని పరీక్షా రాసి మంచి
మార్కులతో పాస్ అయింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ కూడా వచ్చింది …
జాబ్ తెచ్చుకోవటం కష్టం కాలేదు కానీ అందర్నీ ఎదుర్కోవటం కష్టమై పోయేది, చీకటి
పడితే ఇంటికెళ్ళాలి అంటే భయం … బస్సుస్టాండ్ నించి ఇంటివరకు ఒక్కర్తే నడుస్తుంటే భయంగానే ఉండేది. తండ్రి గుర్తొచ్చి చాలా ఏడ్చేది , ఏమైనా పట్టుదలతో
తాను సాధించాలి అని అనుకున్నది సాధించింది … ఒకసారి తండ్రిని చూడాలి అని
ఉరికి బయలుదేరింది సత్య.

          ఊరు 4 ఏళ్లలో చాలనే మారింది, బస్సు దిగి ఇంటి వైపు అడుగులేసింది …
దారిలో గుర్తుపట్టి పలకరించారు … అందరికి జవాబులిస్తూ ముందుకి వెళ్ళింది తలుపు దగ్గరగా వేసి ఉంది … ఎప్పట్లా ఇంటి ముందు ముగ్గులేదు దుమ్ము పేపర్లు ఆకులు …పేరుకుని ఉన్నాయి ,”అయ్యా” అంటూ తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది … గదిలో పాత కుర్చీలో కూచుని ఉన్నాడు వీర్రాజు, “అయ్యా ఎట్టున్నావ్” అంటూ ముందుకు వచ్చింది సత్యాన్ని చూస్తూనే ,”వచ్చినావా తల్లి” అని చేతులు పట్టుకుని ,”నా తల్లి
ఎట్టున్నావ్ రా , మీ పిన్ని రోజు నిన్ను తలుచుకుని కుమిలిపోతోంది , పని
చెయ్యలేక పోతోంది , నేను మంచాన పడ్డాను “ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు .
“నేనొచ్చినా కదా నేను చూసుకుంటాలే “ అని లోపలికి వెళ్ళింది బావిలో నీళ్లు
తోడుతోంది రత్తాలు సత్యని చూస్తూనే దగ్గరకొచ్చి కావలించుకుని ఏడ్చేసింది … ,”ఊరుకో పిన్ని నేనొచ్చాగా … మనం హైదరాబాద్ వెల్దాము నేను చూసుకుంటాను పద “ అని
లోపలికి తీసుకువచ్చింది.

          “సత్య మా తమ్ముడు చాలా చెడ్డవాడు వాడిని పోలీసులు తీసుకువెళ్లారు, ఇలాగే
అమ్మాయిలని తీసుకెళ్లి అమ్మేస్తున్నాడట …నీ జీవితం వాడి పాలపడలేదు, నాదే
తప్పు …” అంటూ ఉండగా … ఆపేసింది సత్య .

          “పిన్ని ఫర్లేదు అయిపొయిందిగా పూజారిగారి వల్ల నేను బయటపడ్డాను , ఇంక
భయం లేదు. అయ్యకి మంచి వైద్యం చేయిద్దాము, నువ్వు విశ్రాంతి తీసుకుందువుగాని ఇన్నాళ్లు కష్టపడ్డావ్ గా “

          “నిన్ను కట్టుకునే వాడు ఒప్పుకుంటాడా?” సందేహం వెలిబుచ్చింది

          “ఫర్లేదు … అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా” నవ్వుతూ అంది ఇద్దరినీ కూచోబెట్టి అంతా మాట్లాడి, సాయంత్రం పూజారిగారిని, ఇంకా కొంతమంది పెద్దలని సమావేశ పరిచి ఇంటిని అంగన్వాడి అద్దెకి ఇవ్వమని తాళాలు పూజారిగారికి ఇచ్చేసింది
తండ్రిని పిన్నిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది సత్య … తన ధ్యేయం నిర్ణయించిన దిశగా …

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.