
అనుసృజన
మీనాకుమారి హిందీ కవిత-4
అనువాదం: ఆర్.శాంతసుందరి
అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.
4.
యూ( తేరీ రహగుజర్ సే దీవానా-వార్ గుజరేకాంధే పే అపనే రఖ కే అపనా మజార్ గుజరే నీ వీధిలోంచి పిచ్చిదానిలా నడిచానునా భుజం మీదే నా సమాధి మోస్తూ నడిచాను బైఠే రహే హై( రస్తే మే దిల్ కా ఖండహర్ సజాకర్శాయద్ ఇసీ తరఫ్ సే ఏక్ దిన్ బహార్ గుజరే శిథిలమైన మనసును అలంకరించుకుని ఈ దారిలో కూర్చున్నానుఏదో ఒకరోజు ఇటువైపు వసంతం రాకపోతుందా అనుకుంటూ! బహతీ హుయీ యే నదియా ఘులతే హుయే కినారేకోయీ తో పార్ ఉతరే కోయీ తో పార్ గుజరే ప్రవహిస్తున్న వాగూ, కరిగిపోతున్న తీరాలుఎవరైనా ఒడ్డున దిగరా? ఎవరైనా ఈ తీరం చేరుకోరా? తూనే భీ హమ్ కో దేఖా హమ్ నే భీ తుఝ్ కో దేఖాతూ దిల్ హీ హార్ గుజరా, హమ్ జాన్ హార్ గుజరే నువ్వూ నన్ను చూసావు, నేనూ నిన్ను చూసానునువ్వు మనసు పారేసుకుని వెళ్ళిపోయావు, నేను నా ప్రాణాలనే పారేసుకున్నాను!
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
