
క ‘వన’ కోకిలలు – 16 :
చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )
– నాగరాజు రామస్వామి
సాహిత్య స్వర్ణ యుగంగా ఖ్యాతి
లీ పో ది ఆత్మాశ్రయ కవిత్వం.
ఈ నాటికీ, లీ పో కవితలు చైనా
అతను రచించిన 1000 కవితలలో
లీ పో తొలినాళ్ళ కవిత్వం సు
ఉత్తర చైనాలో ఆనాడు నెలకొన్న
లీ పో కు ఉన్న మరి కొన్ని పే
లీ పో తాంగ్ వంశజుడు. మధ్య ఆసి
లీ పో చిన్న నాటనే చాలా గ్రం
లీ పో కొన్నాళ్ళు రాజోద్యోగం
లీ గొప్ప మేధావి. వికీపీడియా
ఇవి, లీ పో ఆంగ్లానువాదాలకు నా తెలుగు సేతలు:
1. (Staying the Night at a Mountain Temple)
వంద అడుగుల ఎత్తు ఆ కోట బురుజు,
చేయిసాచి నక్షత్రాలను కోసుకోవచ్చు.
గట్టిగా మాట్లాడే సాహసం చేయను,
స్వర్గ నివాసుల ప్రశాంతి భగ్నమౌ
నా భయం.
2. నా ఏకాంత వినోదంలో నేను :
(Amusing Myself – Li Bai)
మధు చషకం నా ముందు,
గమనించనే లేదు సుందర సూర్యాస్తమయాన్ని,
నా ఒడి మడతలలో రాలిన సుమ దళాలను
పక్షులు లేని, మానవ సందడి లేని
ఏకాంతం;
సుష్టుగా తాగిన నేను
లేచి నడచాను
పిల్ల కాలువలోని చందమామ కేసి.
3. పురా పవనం
(Ancient Air (39) Li Bai
ఎత్తైన కొండనెక్కి
నాలుగు సముద్రాలను పరికించాను,
అంతంత దూరాలకు విస్తరించిన
నింగీ నేలా!
సమస్త హేమంత ద్రవ్యం మీద కప్పు
ఉధృతంగా వీస్తున్న గాలిలో ఎడారి
నదీ జలాలలో లక్ష కెరటాల ఉప్పెన.
మసకబారుతున్న సూర్యతేజం,
ఆకాశంలో ఎడతెగని మబ్బుల బారులు,
గూటికి చేరుకుంటున్న సందె పక్షు
ముళ్ళ కంచెమీద స్థిరపడుతున్నవి
ఇది ఇంటికి మరలాల్సిన సమయం.
ఇక, వెనుతిరుగతాను
కత్తిని విదిలిస్తూ,
దుర్గమ బాటల పాటలు పాడుకుంటూ.
4. (Laolao Ting Pavilion – Li Ba)
వీడికోలు వేళ
ఈ నింగి కింది ఏ నేల ఎదను అంతగా
ఆ నేల లౌలో టింగ్.
ఆమని అనిలాలకు తెలుసు గుండెపిం
ఇక ఏ నాటికీ చిగురించదు నీటిగట్టు మల్లె పొద.
5. (Long Yearning) Li Bai
ఛాంగాన్ లో ఉండాలని గాఢ కాంక్ష.
అక్కడ
పసిడి కమ్ముల దిగుడుబావి చెంత
గొల్లభామలు హేమంత గీతాలు అల్లు
వెదురు చాపను హత్తుకున్న తడిమం
ఇక, ఈ తలపులను మానుకుంటాను;
నా ఒంటరి దీపం కాంతిని కోల్పోతు
నేను వెల్లకిలా వాలిపోయి
నింగిలోని చంద్రున్ని చూస్తూ వృ
మంచి మనుషి
అంబుదాల అంచుల అవతల పూచిన అందమై
పైన ఆకాశమంత ఎదిగిన చీకటి రాత్రి,
కింద అలలెత్తుతున్న ఆకుపచ్చని న
ఈ ఆకాశం సువిశాలం, ఈ రోడ్డు సు
ఏదో చేదు నా ఊపిరిలో తేలుతున్నది.
నా చేతనాత్మ కదలకున్నది;
కఠినమైనది ఈ కొండ కనుమ ఇరుకు దా
సుదీర్ఘమైన నా ఈ తీవ్రకాంక్ష ఎడ
*****

వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.
