
అనుసృజన
ఒంటరి స్త్రీ శోకం
హిందీ మూలం: సుధా అరోడా
అనువాదం: ఆర్.శాంతసుందరి
ఒకరోజు ఇలా కూడా తెల్లవారుతుందిఒక ఒంటరి స్త్రీభోరుమని ఏడవాలనుకుంటుందిఏడుపు గొంతులో అడ్డుపడుతుంది దుమ్ములాఆమె వేకువజామునేకిశోరీ అమోన్ కర్ భైరవి రాగం క్యాసెట్ పెడుతుందిఆ ఆలాపనని తనలో లీనం చేసుకుంటూవెనక్కి నెట్టేస్తుంది దుఃఖాన్నిగ్యాస్ వెలిగిస్తుందిమంచి టిఫిన్ ఏదైనా చేసుకుందామని తనకోసంఆ పదార్థం కళ్ళలోంచి మనసులోకి జారిఉపశమనం కలిగిస్తుందేమోననే ఆశతోతినేది గొంతులోంచి జారుతుందికానీ నాలుకకి తెలియనే తెలియదుఎప్పుడు పొట్టలోకి వెళ్ళిందోఇక ఏడుపు దుమ్ములా పేగులని చుట్టేస్తుందికళ్ళలోంచి బైట పడే సొరంగం కోసం వెతుకుతూఒంటరి స్త్రీఒంటరిగానే వెళ్తుంది సినిమా చూసేందుకుఏదో సీన్ చూసి హాలు నవ్వులతో మారుమోగిపోయినప్పుడుసిగ్గుపడుతుంది తను అక్కడ లేనందుకుతనని వెతుక్కుంటుంది పక్కనున్న ఖాళీ సీటులో…అక్కడ నీళ్ళసీసా పెట్టి మర్చిపోయినట్టుమళ్ళీ తన సీటులో కూర్చుంటుంది ముడుచుకునిఒంటరి స్త్రీచదువుతుంది పుస్తకంలో ఇరవైరెండో పేజీమర్చిపోతుందిముందు చదివిన ఇరవైఒక్క పేజీల్లో ఏమి చదివిందో…పుస్తకం మూసిపక్కన ఉన్న మెదడు తీసితలమీద పెట్టుకుంటుంది గట్టిగామళ్ళీ మొదలుపెడుతుంది చదవటం మొదటి పేజీ నుంచీ…ఒంటరి స్త్రీ ఆరుబైట మైదానంలో కూడాఊపిరి పీల్చుకోలేదు హాయిగాపచ్చదనంలో వెతుకుతుంది ఆక్సిజన్ కోసంఊపిరితిత్తులు బోలుగా ఉన్నట్టనిపిస్తుందివాటిలో వచ్చి పోయే ఊపిరిఅనిపించదు ఊపిరిలానోటితో పీల్చుకుంటుంది గాలినితను బతికే ఉన్నానా లేదా అనితాకి చూసుకుంటుంది…ఒంటరి స్త్రీఉన్నట్టుండిశోకం నిండిన పెట్టెనితెరుస్తుంది తనముందు పెట్టుకునిఅందులో ఉన్నవన్నీ చెదిరిపోనిస్తుంది వరసగాసాయంత్రం పొద్దుపోయేదాకా ఏడుస్తుంది మనసుతీరాఅప్పుడు అనిపిస్తుందామెకిహఠాత్తుగా ఊపిరి పీల్చటంసాఫీగా సాగుతోందని…… ఆ తరవాత ఒకరోజుఒంటరి స్త్రీ ఒంటరిగా మిగలదుతన వేలు అందిపుచ్చుకుంటుందితనతోనే సినిమా చూస్తుందివెతకదు పక్క సీట్లో నీళ్ళసీసా కోసంపుస్తకంలో ఇరవైరెండో పేజీని దాటి సాగుతుంది ముందుకిగుండెలనిండా ఊపిరి పీల్చుకునిఆఘ్రాణిస్తుంది దాన్ని మల్లెల సువాసనలాతన చిరునవ్వుని సాగదీయగలుగుతుందికళ్ళ కొసలదాకాతనకోసం సృష్టించుకుంటుంది సరికొత్త నిర్వచనంనేర్చుకుంటుందిఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకునేఉపాయం.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
