
మరో దుశ్శాసన పర్వంలో..!
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– ఎన్. లహరి
నాలో నిత్యం జరిగే సంఘర్షణలకు కాస్త విరామమిచ్చినన్ను నేను వెతుక్కునే ప్రయత్నంలోనాదనుకునే సమూహంలోకి ధైర్యంగా అడుగులేస్తుంటాను నన్ను నేను నిరూపించుకోవడానికి ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమిస్తాను ఏమరపాటు జీవితాన్ని కోల్పోమంటుందిమంట గలపిన సంప్రదాయంవిషసంస్కృతి పిడికిళ్ళలో ముడుచుకు పోయింది వింత సమాజం, విభిన్న పోకడలుసంస్కృతీ సాంప్రదాయలకు నెలవంటూ సెలవిస్తూనేవావి వరసులు మరచిపోయి ప్రవర్తించేవిష సంస్కృతి తాండవిస్తోంది కామాంధులు కారణాలెతుక్కొని మరీచేతులు చాస్తుంటారు బంధాలు కరువైన చోట క్షేమ సమాచారాల ప్రసక్తే లేదు ఏకాంతంలో కూడా కారుచీకట్లు కమ్ముకునేలాఅసభ్యకర మాటలుహృదయాన్ని తూటాల్లా చీలుస్తాయి స్వప్న లోకంలో విహరిస్తూఈ కన్నీటికి అర్థం వెతుకుతూ ఉండాలిచివరికి నీకు నువ్వు ఏమవుతావు అన్న ప్రశ్నేచితి మంటై లేస్తుంది
*****

ఎన్. లహరి, MCA చేశారు. జన్మస్థలం దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా , తెలంగాణ.
అభిరుచులు:
కవితలు, కథలు మరియు సమీక్షలు రాయడం, డాన్స్ మరియు యోగ చేయడం, బాాడ్మంటన్, కేరమ్స్ మరియు చెస్ ఆడటం.
రచనలు:
మినీకధలు: 70 కి పైగా..
కవితలు: 200 కు పైగా..
సమీక్షలు: 20
నేను రాసిన కవిత్వాలతో కూడిన “అక్షర నేత్రాలు” కవితా సంపుటిని శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్, హైదరాబాద్ వారు తమ స్వంత నిధులతో ముద్రించి, గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిచే ఆవిష్కరింప చేశారు.
స్కూల్ దశలో రాసిన కథలు మరియు కవితలకి అనేక బహుమతులు గెలుచుకున్నాను.
సుమారు 300 నానీలతో మరొక సంపుటి త్వరలో ఆవిష్కరణకు రానున్నది.
ప్రేరణ:
కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, మాజీ వైస్ ఛాన్సలర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నానీల సృష్టికర్త అయిన మా పెద్దనాన్న డా. ఎన్. గోపి గారి రచనలు చదివి సాహిత్యం మీద ఎంతో అభిరుచిని పెంచుకున్నాను.

Nice