
అనుసృజన
జలియాన్ వాలా బాగ్ మే వసంత్ (జలియన్ వాలా బాగ్ లో వసంతం)
– ఆర్.శాంతసుందరి
యహా( కోకిలా నహీ(, కాగ్ హై( శోర్ మచాతే
కాలే కాలే కీట్, భ్రమర్ కా భ్రమ్ ఉపజాతే.ఇక్కడ కోయిలలు కూయవు కాకులు గోల చేస్తాయినలనల్లటి పురుగులు తుమ్మెదల్లా భ్రమింపజేస్తాయి
కలియా( భీ అధఖిలీ , మిలీ హై( కంటక్ కుల్ సే
వే పౌధే , వే పుష్ప్ శుష్క్ హై( అథవా ఝులసే.మొగ్గలు కూడా అరవిచ్చి ముళ్ళతో కలిసిపోయాయిమొక్కలూ, పూవులూ ఎండిపోయో కమిలిపోయో కనిపిస్తాయి పరిమల్ హీన్ పరాగ్ దాగ్ సా బనా పడా హైహా!యహ్ ప్యారా బాగ్ ఖూన్ సే సనా పడా హై.సువాసన లేని పుప్పొడి మచ్చల్లాగ పడి ఉందిఅయ్యో! ఈ అందమైన తోట రక్తంతో తడిసి ఉంది ఓ,ప్రియ్ రుతురాజ్ ! కింతు ధీరే సే ఆనా
యహ్ హై శోక్ స్థాన్ యహా( మత్ శోర్ మచానా.ఓ ప్రియమైన రుతురాజా ! కాస్త నెమ్మదిగా రావయ్యాఇది శోక భూమి, ఇక్కడ గోల చెయ్యకుమా వాయు చలే , పర్ మంద్ చాల్ సే ఉసే చలానా
దుఃఖ్ కీ ఆహే( సంగ్ ఉడాకర్ మత్ లే జానా.గాలి వీచినా, కాస్త నెమ్మదిగా వీచేట్టు చెయ్యి సుమావేదనా నిట్టూర్పులను తన వెంట ఎగరేసుకుని వెళ్ళ వద్దని చెప్పు
కోకిల్ గావే(,కింతు రాగ్ రోనే కా గావే
భ్రమర్ కరే గుంజార్ కష్ట్ కీ కథా సునావే.కోయిలలు పాడినా దుఃఖ రాగాలనే ఆలపించనీభ్రమరాలు ఝుమ్మనినా కష్టాల కథలే చెప్పనీ
లానా సంగ్ మే పుష్ప్ , న హో( వే అధిక్ సజీలే
హో సుగంధ్ భీ మంద్ , ఓస్ సే కుఛ్ కుఛ్ గీలే.నీ వెంట పువ్వులు తీసుకురా, కానీ అవి మరీ ఆకర్షణీయంగా ఉండనీకువాటి తావి కూడా మరీ గాఢంగా ఉండనీకు, మంచుతో కాస్త తడిసి ఉండనీ
కింతు న తుమ్ ఉపహార్ భావ్ ఆకర్ దిఖలానా
స్మృతి మే పూజా హేతు యహా( థోడే బిఖరానా.కానీ నువ్వు వచ్చినప్పుడు ఇక్కడికి కానుకలు తెచ్చినట్టు అనిపించనీకుస్మరించుకునేందుకు, పూజ కోసం కొన్ని పూలని ఇక్కడ వెదజల్లు
కోమల్ బాలక్ మరే యహా( గోలీ ఖాకర్
కలియా( ఉనకే లియే గిరానా థోడీ లాకర్సుకుమారులైన పిల్లలు తూటాల దెబ్బకి మరణించారిక్కడవాళ్ళ కోసం కొన్ని మొగ్గల్ని తెచ్చి ఇక్కడ జారవిడు
ఆశావోం సే భరే హృదయ్ భీ ఛిన్న్ హుయే హై(
అపనే ప్రియ్ పరివార్ దేశ్ సే భిన్న హుయే హై(ఆశలతో నిండిన హృదయాలు కూడా ఛిద్రమయ్యాయిప్రియమైన తమ కుటుంబాలు దేశాన్ని విడిచి పోయాయి
కుఛ్ కలియా( అధఖిలీ యహా( ఇసలిఎ చఢానా
కరకే ఉనకీ యాద్ అశ్రు కే ఓస్ బహానాకొన్ని అరవిచ్చిన మొగ్గల్ని ఇక్కడ సమర్పించుకోవారిని జ్ఞాపకం చేసుకుని మంచు బిందువుల కన్నీళ్ళు కార్చు
తడప్ తడప్ కర్ వృద్ధ్ మరే హై( గోలీ ఖాకర్
శుష్క్ పుష్ప్ కుఛ్ వహా( గిరా దేనా తుమ్ జాకర్విలవిలలాడుతూ వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు తూటాలు తగిలినువ్వు వెళ్ళి అక్కడ కొన్ని ఎండిన పూవులు వేసి రా
యహ్ సబ్ కరనా, కింతు యహా( మత్ శోర్ మచానా
యహ్ హై శోక్ స్థాన్ బహుత్ ధీరే సే ఆనా.ఇవన్నీ చెయ్యి కానీ ఇక్కడ గోల మాత్రం చెయ్యద్దుఇది శోకస్థలి ఇక్కడికి చాలా నెమ్మదిగా రా. (ఝాన్సీ కీ రానీ, జలియన్ వాలా బాగ్,లాంటి గొప్ప దేశభక్తి కవితలు రాసిన సుభద్రా కుమారీ చౌహాన్ (1904 – 1948) చిన్న వయసులోనే మరణించంది. హిందీ విద్యార్థులందరికీ ఆమె కవితలు పరిచయమే.)
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
