
మా బిచ్చవ్వ ( కవిత)
-ఈ. వెంకటేశ్
గ్రామంలోసూర్యుడు నలుపు రంగుపులుముకుని మేల్కొంటాడుదళితులకు జరుగుతున్నఅన్యాయాలను చూడలేక. గాలి మలయ మారుతంలామెల్లగా తాకుతూ వెళ్ళదుతుఫానుల పెనుగాలులు వీస్తాయిగడీలు ,మేడలునిజాం వారసుల గర్వాన్నిసత్యనాస్ చేస్తాయి. మాది ఊరంటే ఊరు కాదుచైతన్యాన్ని రక్ష మాంసాలుగాకలిగి జీవమున్న జవసత్వాలు కలిగిన పుణ్యభూమి. మా యవ్వ తన అనుభవంతోచెప్పే జీవిత సత్యాలముందునాలుగు వేదాలు నాలుకగీసుకోవడానికి కూడా పనికిరావు. ఉత్పత్తి కులంలో జన్మించివ్యవసాయంలో గిట్టుబాటు కాకదళారీల మధ్య ఒంటరి ఖైదీలాఇప్పటికీ మోసపోతూనే ఉన్నాం.. పనిచేయడం చెమటోడ్చడంతప్ప ఇతర వేషాలు వేయలేని వాళ్ళంఎప్పుడైనా నేను పని తప్పితేమా బిచ్ఛవ్వపిచ్చలకు ఉరివేస్తా జాగ్రత్త అనితియ్యగా తిట్టేది. మా యవ్వ చీర కొంగుమడిసి కలుపు తీస్తేభూమంతా చెమట సువాసనలతోమత్తెక్కి మూర్చపోయేది. మగవాళ్ళని సైతంవ్యవసాయ పనిలోముందుకు వెళ్ళనిచ్చేది కాదుఎవడైనా కారు కూతలు కూస్తేదవడలు ఇరగకొట్టేది. పిడకలు ఏరుకు రారా అనినన్ను బాగా సతాయించేదినేను ఎంతకు వెళ్ళక పోతేనీ పెళ్ళాం పెద్దమనిషిగా గానుఅంటూ నవ్వుకుంటూ ఎక్కిరించేది. చివరగా మా బిచ్చవ్వ ను చూస్తుంటేనాకు చాకలి ఐలమ్మ వారసురాలిగానాకు స్పష్టంగా అనిపించేది.
*****

వెంకటేశ్ కవి. గుడిసె జ్ఞానం అనే కవితా శీర్షిక ప్రచురితమైంది.
