
ఊపిరితో ఊదుకుని…… (కవిత)
– శ్రీ సాహితి
గుండెను
అక్షరంతో తవ్వుతుంటే
కంగు కంగుమనే కాలం మ్రోతకు
గాఢ నిద్రలో మనసు
ఉలిక్కిపడి
గాయపడ్డ నిజాలని
ఊపిరితో ఊదుకుని
పడిన మచ్చలను
నిజాయితీతో మాన్పి
జీవితమంతా మెరిసే
ఒక్క కలను
తృప్తిగా పొదువుకోవాలని ఉంది
*****
Please follow and like us:

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.

చాలా బాగుంది