కాదేదీ కథకనర్హం-19

తిరిగిరాని గతం – 2

-డి.కామేశ్వరి 

ఎందుకొచ్చిందంటే సరి అయిన జవాబు మహిమ దగ్గిర లేదు. చిన్నప్పటి నుంచి కాస్త ఙ్ఞానం వచ్చిందగ్గిర నుంచి అంటే పది ఏళ్ళు దాటిందగ్గిర నించి పెళ్ళి, మొగుడు పెళ్ళాల సంబంధం అంటే అదో అంటే పది విల్లు దాటిందగ్గిర నించి పెళ్ళి, మొగుడు పెళ్ళాల సంబంధం అంటే అదో రకం ఏవగింపు, జుగుప్స, భయం లాంటిది మనసులో చోటు చేసుకుంది. రాత్రిళ్ళు నిద్ర మధ్యలో మెళకువ వచ్చినప్పుడు బెడ్ లాంప్ వెలుగులో తండ్రి తల్లి దగ్గిరికి చేరి….పగలంతా ఎంతో గంభీరంగా కనిపించే అయన అదో రకంగా నవ్వుతూ, తల్లి తండ్రి ప్రవర్తన చూసి అదో రకం జుగుప్సతో కళ్ళు గట్టిగా మూసు కునేది. అంతేకాదు యింట్లో పనిమనిషి వారానికో రోజు ఏడుస్తూ వచ్చేది. మొగుడయితే అలా కొడ్తాడా, కొడ్తే ఎందూరుకుంటుంది ఇది. ఆ చిన్న వయసులో ఎన్నో సందేహాలు. పోనీ అప్పి అంటే సరే పక్కింటి వరలక్ష్మమ్మగారు తల్లి దగ్గిర అన్ని చెప్పుకుని ఏడిచేది. చిన్నప్పుడు అత్తగారి చేతిలో వాతలు, మొగుడు చేతిలో దెబ్బలు, పెద్దయ్యాక కొడుకుల చేతిలో చివాట్లు అవమానాలు భరిస్తూ రోజంతా పడి వంటింట్లో చాకిరి చేసినా కోడళ్ళ దేప్పుళ్ళు….అన్నీ వింటూ ఆడదాని జీవితం అంతా అలా మొగాళ్ళకింద నికృష్టంగా బతకడమా అనిపించేది ఆ తెలిసీ తెలియని వయసులో. నాలుగిళ్ల అవతల గుమస్తాగారి భార్య కామాక్షి పాతికేళ్ళకే నలుగురు పిల్లల్ని కని ఆస్థిపంజరమై రోజంతా పిల్లలతో ఉచ్చలు, దొడ్లు, అంట్లు, వంటతో యిటు కడుపుతోనో, అటు చంటిపిల్ల తోనో తప్ప, కనపడక ఎందుకు వీళ్ళు ఈ పెళ్ళి సంసారం అనే రొంపిలో పడి బాధలు కొని తెచ్చుకుం టారు అనుకునేది పదిహేనేళ్ళ మహిమ – పెళ్లవగానే తన పుట్టిన రోజులు కూడా మర్చిపోయి యిరవై నాలుగు గంటలూ పెళ్ళాంకొంగు పట్టుకుని గదిలోంచి ఊడిపడని పెద్దన్నయ్యలో మార్పుకి ఎంత ఆశ్చర్యం కల్గిందీ…… ఆర్నెల్లు దాటేసరికి ఆ ప్రేమదోమ అంతా ఎగిరిపోయి ఇద్దరూ ఎలా వాదించుకుంటూ దేబ్బలాడుకునే వారో చూసి పెళ్ళంటే ప్రేమంటే యింతేనా, మూడు నాళ్ళ ముచ్చటా” అన్పించింది. అ దృశ్యాలు మహిమని హంట్ చేసి స్త్రీ పురుష సంబంధం పట్ల మరింత ఏహ్యత పెంచి – పెళ్ళి అంటే అదో రకం ఏవగింపు భయం కల్గించాయి – ఇలా ఎన్నో చూసినవి, చదివినవి అన్ని కలిసిన అనుభూతులన్నీ కలిపి వడబోసి యూనివర్శీటీ స్థాయికి చేరేసరికి పెళ్ళి అనేది అర్ధంలేని, అవసరంలేని బంధాన్ని తను తగిలించుకుని చేతులారా బాధలు కొని తెచ్చుకోరాదన్న నిర్ణయానికి వచ్చేసింది మహిమ.

“ఏమిటే మాట్లాడవు…..ఏం మాట్లాడాలో తెలియడంలేదు. చూడు మహిమా నీవు మాములుగా చూడవలసినవి భూతద్దంలోంచి చూస్తూ, ఏవేవో ఊహించుకుంటూన్నావని పిస్తుంది. మగాళ్ళంటే, మొగుళ్ళంటే రాక్షసులని ఎందుకు అనుకోవాలి. ఎక్కడో నూటికి కోటికి అలా ఉండొచ్చు. ఎంతోమంది సహృదయులు, సంస్కారులుంటారు. అందులో ఈ రోజుల్లో అంత చదువుకున్నవాళ్ళు, తమతో సరిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న భార్యల్ని నీవనుకున్నట్టు యిల్ ట్రీట్ చెయ్యడంలేదు…..”

“ఆ…..చూస్తున్నాం…..రోజూ పేపరు తెరిస్తే వరకట్నం చావులు, పెళ్ళాన్ని కాల్చుకు తినే మొగుళ్ళ కధలు, సంసార భాదలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవాళ్ళు, రేప్ లు చేసి చంపేసే కధలు…..హు…..ఆడదాని బతుకు మరి పోయిందని మనల్ని మనం నమ్మించుకుని ఆత్మవంచన చేసుకుంటున్నాం.” వ్యంగ్యంగా అంది.

‘చూడు మహీ….దేశంలో ఎనభై కోట్ల ప్రజలుంటే పేపర్లల్లో వార్తల్లో వచ్చే వార్తల్లో చావులు, రేపులు పదో పదిహేనో ఉంటుంటాయి. అంటే ఎక్కడో ఏదో ఒకటి అర సంఘట నలు పేపర్లలో వచ్చినంత మాత్రాన అదే అందరిళ్ళల్లో జరిగే సంఘటనలని ఎలా అంటావు…..అదే నిజమైతే ప్రతిరోజూ యిన్ని లక్షల మంది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు – పెళ్ళి, సంసారంలో కేవలం కష్టాలు కన్నీళ్ళు అవమానాలే వుంటే ఈ సంబంధాన్ని తగిలించుకోడానికి నూటికి తొంబై తొమ్మిది మంది ఎందుకు తయారవుతున్నారు?” జవాబు చెప్పమన్నట్లు చూసింది.

“ఏం చేస్తారు ఆడపిల్లలు- ఇదిగో ఇలా తల్లి తండ్రి చంపితే ఎదురు చెప్పి ఒంటరిగా నిలబడే ధైర్యం లేక….ఈ సమాజంలో ఓ పెళ్ళి కాకపోతే, మగాడి అండలేకపోతె బతకలే మన్న పిరికివాళ్ళు ఈ ఆడవాళ్ళు….’ ఆవేశంగా అంది.

వల్లి, ఎలా మహిమని కన్విస్ చేయడం అన్నట్టు నిస్సహాయంగా చూసింది- చిన్నప్పటి నుంచి అంటే కాన్వెంట్, హైస్కూలు, కాలేజీ వరకు ఇద్దరూ కలిసి చదువు కున్న స్నేహితులు……మహిమ అందం, తెలివిపట్టుదలా అంతా చూసి ఎంతో ఆకర్షితు రాలయ్యేది వల్లి. క్లాసులో చదువులో ఫస్టు వచ్చే మహిమ అంటే హీరోయిన్ వర్షిప్ వల్లికి – బి.ఎ. కాంగానే తల్లిదండ్రులు పెళ్ళి చేస్తే బుద్దిగా చేసేసుకుంది. మహిమ ఎమ్.ఎస్సీ చేసి ఇంకా పై చదువులు చదివి ఉద్యోగాలు చెయ్యాలనుకుంటుందని తెల్సి నా పెళ్ళంటే ఇంత విముఖంగా వుందన్నది ఆమెకీరోజు వరకు తెలియదు. ఆమెకి నచ్చ చెప్పాలని వచ్చింది గాని మహిమ ధోరణి చూస్తె అది అంత సులభంగా సాధ్యపడేదిగా అన్పించలేదు.

“మహీ…..చూడు మా పినమామగారి అబ్బాయి ఎంత స్మార్ట్గా వుంటాడో తెలుసా. ఇంజనీరింగ్, ఎం.బి.ఏ చేసి టాటా కన్సల్టన్సీస్లో బొంబాయిలో ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడో తెలుసా; ఫ్లైట్, కారు….పట్టుమని ఇరవై ఎనిమిదేళ్ళు లేని అతను అప్పుడే ఇంత మంచి పొజిషన్లో వున్నాడు…..మంచి ఫ్యూచర్ వుంది. నరేష్ చాలా బుద్దిమంతుడు. బాగా తెలుసు అతని స్వభావం నాకు….ఇలాంటి సంబంధం కావాలనుకున్నప్పుడు రాదు – ముందసలు అబ్బాయిని చూడు…..తరువాత సంగతి ఆలోచిద్దాం – ప్లీజ్ నా కోసం….”

“వల్లీ…..చూడు….పెళ్ళిచూపులయ్యాక వద్దంటే మరింత ఇన్సల్ట్ ఫీలవుతారు ఎవరన్నా. అందుకే ముందే వద్దంటున్నాను. మంచి సంబంధం కాదన్నానా నేను. చేసుకోదలచనప్పుడు అనవసరంగా చూడ్డం ఏమిటి, సారీ, మీ బంధువులబ్బాయి నీ పొజిషన్ నాకర్ధం అవుతుంది. కాని నాకెందుకో ఇప్పుడసలు చేసుకోవాలని లేదు. ఏమో చూద్దాం కొన్నాళ్ళు పొతే నా మనసు మారితే….”

అప్పటివరకు నీకోసం కూచుంటారా ఇతను…..’ కోపంగా చూసింది మహిమ నవ్వింది.

“ఇతన్ని కూచోమన్నానా నేను- అసలు వల్లీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే నాకెవరన్నా తటస్థపడి’, ఇద్దరి అభిప్రాయాలు కల్సి, నాకు నచ్చితే నా అంతట నేను చేసుకుంటాను. ఇలా పెళ్ళిచూపులు, అరెంజేడ్ మేరేజ్ నేను చేసుకోను. మీవాళ్ళకి చెప్పేయి ఆ మాట…..’ స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా అంది.

వల్లి నిస్సహాయంగా చూసి లేచి నిలబడింది.

తరువాత నాలుగు అయిదు రోజులు ఇంట్లో ఎంత గొడవ జరగాలో అంత జరిగింది. తల్లి ఏడుపులు, తండ్రి హితబోధలు, అన్నల బెదిరింపులు, వదినల హితబోధలు ఏవీ మహిమని కదల్చలేకపోయాయి. అంతా నిస్పృహతో మహిమని శాపనార్ధాలు పెట్టినట్టే, “నీ ఖర్మ…..నీ రాత ఎలా వుందో అందుకే నీకీ పెడబుద్దులు పుట్టాయి. పెద్దవాళ్ళు నీ మంచికోరి చెప్పింది వినకపోతే నీవే తరువాత అనుభవిస్తావు. మేం వున్నన్ని రోజులు బాధపడ్తాం. తరువాత నీ అతీగతీ ఎవరికీ పట్టదు. అప్పుడు నీవు కావాలన్న నీకు కావాల్సింది దొరాకపోవచ్చు. కానీ అనుభవమే నీకు పాఠం చెప్తుంది.” అన్నాడు తండ్రి. “పోనీ నీ అంతట నీవు చేసుకున్నా ఆ చేసుకునేదేదో మరీ ఆలస్యం కాకముందు చేసుకో….” ఆఖరి ఆశగా తల్లి అంది.

* * *

          కాలచక్రంలో ఇరవై రెండేళ్ళు గడిచిపోయాయి. మహిమ డాక్టర్ మహిమ అయింది. మూడేళ్ళు ఫారెన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ సంపాదించుకుని యూనివర్శీటీ ప్రొఫెసర్గా స్థిరపడింది. బంగళా, కారు, పనికి, వంటకి మనుషులు…..వుండాల్సిన హంగులన్నీ వున్నాయి.

ఈ ఇరవై రెండేళ్ళల్లో ఆరేడు ఏళ్ళు చాలా బిజీగా అసలు దేన్నీ గురించీ ఆలోచించే తీరిక లేకుండా చదువు, ఫారెన్ వెళ్ళి రావడం, ఉద్యోగంలో స్థిరపడడంతో అయి పొయింది. రాజారావుగారు రెండు మూడుసార్లు పెళ్ళిప్రస్తావన తెచ్చినా మహిమ “డాక్టరేట్ అవ్వాలి ఇప్పుడప్పుడే నేనేం అనుకోలేదు” అంది. అయన నిట్టూర్చి ఊరుకు న్నారు. మహిమ ఫారెన్ నుంచి వచ్చేలోగానే ఓ రోజు హార్ట్ ఎటాక్ వచ్చి అయన పోయారు. తరువాత తల్లి ఏడుస్తూ నాలుగు అయిదు సార్లు బతిమిలాడింది. “నేనూ పోయాక ఇంక నిన్ను గురించి పట్టించుకునే వారెవరో……నామాట విను – చదువయింది ఉద్యోగం అయింది. ఇరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి. యింకేప్పుడు….” అంటూ గోలపెట్టేది. తండ్రి పోయాక తన దగ్గిర వచ్చి ముందసలు అబ్బాయిని చూడు…..తరువాత సంగతి ఆలోచిద్దాం – ప్లీజ్ నా కోసం….”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.