“నెచ్చెలి”మా

“కొత్త” ఉత్సాహం – 2026

-డా|| కె.గీత 

కొత్త
ఏడాది
వచ్చేసిందోచ్-

హ్యాపీ న్యూ ఇయర్
2026


సంవత్సరాలు
వస్తున్నాయి
పోతున్నాయి
ఇందులో
“కొత్త”
ఏవుందటా?
అసలు
ఉత్సాహం
ఏవుందట!

అదే మరి
అలా
నిరుత్సాహ
పడితే
ఎలా?

జీవితం
చివరాఖర్న
ఏవుందటా?
అంతా
ప్రతిదినంబునందే
యున్నది
అని యనుకొనవచ్చు
కదా

అలా
ఈసురోమని
పడి ఉండకుండా
ఏదోలా
కాస్త
ఉత్సాహం
కొని తెచ్చుకోవచ్చు
కదా!

అదేనండీ
ఎక్కణ్ణించొస్తుంది
కొత్త ఉత్సాహం
అదేదో
సెలవియ్యండి
కిందటేడాదిలానే
ఈ సంవత్సరమూ
ఈ సంవత్సరంలానే
వచ్చే ఏడాదీ
ఇందులో
కొత్త ఏం ఉంది?
వింత ఏం ఉంది?

హుమ్…
వింత ఏం లేకపోవచ్చు
కొత్తగా ఏదైనా
ప్రయత్నించవచ్చు
కదా-

కొత్త
ఏడాదిని
సంతోషంగా
ఆహ్వానించవచ్చు
కొన్ని కొత్త పనులు
ప్రారంభించవచ్చు
ఏవైనా కొత్త
విషయాలు
నేర్చుకోవచ్చు
నిన్ను వలె
నీ పొరుగు వారిని
ప్రేమించవచ్చు

చాలు చాలు
ఇన్ని కొత్త
విషయాలు
విన్నాకా
కొత్త
ఉత్సాహం
రాక ఛస్తుందా?

ఆ… సర్లే
హ్యాపీ న్యూ ఇయర్
2026!

అదే
కాస్త
ఉత్సాహంగా
చెబుదురూ!

అందరికీ
హ్యాపీ…….. న్యూ ఇయర్
చాలా?!

అందరికీ
మాత్రమే
కాదు
మీకు
కూడా!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

డిసెంబరు, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  శ్రీపతి లలిత

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: శబ్దాల శాంతి – డా.లక్ష్మీ రాఘవ

ఇరువురికీ  అభినందనలు!

****


Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.