
ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
1959 లో హైస్కూల్లో చదివేరోజుల్లో వై. జె ( యర్రమిల్లి జానకి ) పేరుతో కవితలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1965 లో వివాహమయిన దగ్గరనించి తమిరిశ జానకి పేరుతో రాస్తున్నారు.
16నవలలు, సుమారుగా 400 కథలు రాశారు. ఎనిమిది కథాసంపుటాలు , మూడు కవితాసంపుటాలు ప్రచురించారు. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 10 కథలు, 32 కవితలు ఇంగ్లీష్ లోకి అనువాదం అయ్యాయి. బాలల కథలు కూడా రాశారు.
1971 లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడిన వీరి మొట్టమొదటి నవల“విశాలి” అదే పేరుతో సినిమాగా వచ్చింది.
2007లో , 2011 లో తెలుగువిశ్వవిద్యాలయం వారి పురస్కారాలు నవలాపురస్కారం , ఉత్తమరచయిత్రి పురస్కారం అందుకున్నారు. 2011లో మద్రాసు కేసరికుటీరం వారి గృహలక్ష్మీ స్వర్ణకంకణం వచ్చింది. ఎన్నో నగరాలలోనూ, అమెరికా , కెనడాలలోనూ సన్మాన సత్కారాలు పొందారు.
నవలలు:
1)విశాలి (2)వీడినమబ్బులు (3)వెన్నెల విరిసింది (4)మనసు పాడింది సన్నాయి పాట(5)మలుపు (6)జీవితచక్రం (7)బొమ్మలు (8)ఇది ఏ రాగమో (9)అందానికి సమాధి 10)ముఖారిరాగం (11)అశోకవనంలో సీత (12)నీలిచందమామ (13)కధలాంటి జీవితం (14)రాజహంస (15)సాగరి
కథలసంపుటాలు:
(1)మూగమనసులు (2)మనసిది నీకోసం (3)మరొకతలుపు (4 డాక్టర్ రచయిత (5)తమిరిశ జానకి మినీ కధలు (6) సైలెంట్ స్ట్రీమ్(7)ఆడది (8) ఎంతో చిన్నది జీవితం
(ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి
గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
