ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

1959 లో హైస్కూల్లో చదివేరోజుల్లో వై. జె  ( యర్రమిల్లి జానకి ) పేరుతో కవితలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1965 లో వివాహమయిన దగ్గరనించి తమిరిశ జానకి పేరుతో రాస్తున్నారు.


16నవలలు, సుమారుగా 400 కథలు  రాశారు. ఎనిమిది కథాసంపుటాలు , మూడు కవితాసంపుటాలు ప్రచురించారు. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.  10 కథలు, 32 కవితలు ఇంగ్లీష్ లోకి అనువాదం అయ్యాయి.  బాలల కథలు కూడా  రాశారు.

1971 లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడిన వీరి మొట్టమొదటి నవల“విశాలి” అదే పేరుతో సినిమాగా వచ్చింది.


 2007లో , 2011 లో తెలుగువిశ్వవిద్యాలయం వారి పురస్కారాలు నవలాపురస్కారం , ఉత్తమరచయిత్రి పురస్కారం అందుకున్నారు. 2011లో మద్రాసు కేసరికుటీరం వారి గృహలక్ష్మీ స్వర్ణకంకణం వచ్చింది. ఎన్నో నగరాలలోనూ, అమెరికా , కెనడాలలోనూ సన్మాన సత్కారాలు పొందారు.

నవలలు:

1)విశాలి (2)వీడినమబ్బులు (3)వెన్నెల విరిసింది (4)మనసు పాడింది సన్నాయి పాట(5)మలుపు (6)జీవితచక్రం (7)బొమ్మలు (8)ఇది ఏ రాగమో (9)అందానికి సమాధి 10)ముఖారిరాగం (11)అశోకవనంలో సీత (12)నీలిచందమామ (13)కధలాంటి జీవితం (14)రాజహంస (15)సాగరి

కథలసంపుటాలు:
(1)మూగమనసులు (2)మనసిది నీకోసం (3)మరొకతలుపు (4 డాక్టర్ రచయిత (5)తమిరిశ జానకి మినీ కధలు (6) సైలెంట్ స్ట్రీమ్(7)ఆడది (8) ఎంతో చిన్నది జీవితం



(ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి
గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని
పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.