“నెచ్చెలి”మాట 

 పోటీ ఫలితాలు

-డా|| కె.గీత 

ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా  నెచ్చెలి కథ, కవితల పోటీల్లో ఉత్తమ పురస్కారాల ఎంపికకు  వినూత్నమైన  ప్రయోగం చేసాం. అదేవిటంటే పురస్కారాల ఎంపికలో నెచ్చెలి సంపాదకులు, నెచ్చెలి నిర్ణయించిన న్యాయనిర్ణేతలు మాత్రమే కాకుండా పాఠకులు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.  ఇందుకుగాను పాఠకులు ద్వితీయ వార్షికోత్సవ సంచికలో వచ్చిన పోటీ రచనలని చదివి విశేషణాత్మక కామెంట్లు పోస్టు చేశారు. పాఠకుల నుంచి అనూహ్యంగా విశేష స్పందన వచ్చింది. దాదాపు వెయ్యి పైచిలుకు కామెంట్లు వచ్చేయి. ఇందులో  ఇతోధికంగా పాల్గొన్న మీ అందరికీ నెచ్చెలి ప్రత్యేక నెనర్లు!

ఇక ఆలస్యం దేనికి?

మీరు, మేం కలిసి నిర్ణయించిన నెచ్చెలి ఉత్తమమైన రచనలు – పురస్కారాలు ఇవే:

సింగరాజు రమాదేవి- చప్పట్లు (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) 

రామా రత్నమాల- పల్లె ముఖ చిత్రం (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) 

Dr.K.Meera Bai- Kishan’s Mom (Neccheli 2nd Anniversary Awards Best Story)

Suchithra Pillai- Faces (Neccheli 2nd Anniversary Awards Best Poem)

బహుమతి పొందిన ఉత్తమమైన కామెంట్లు:

Sasi Inguva – Comment on “Queen with No Crown”

Savitri Ramana Rao – Comment on “గోడలు” 

V.Vijaya Kumar – Youtube Comment on “ప్రముఖరచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి” 

పురస్కారగ్రహీతలందరికీ  అభినందనలు! బహుమతి మొత్తం త్వరలో పంపబడుతుంది. 

కథలకు న్యాయనిర్ణేతలుగా బాధ్యత వహించిన కె.వరలక్ష్మి, పుట్టపర్తి  నాగపద్మిని, చాగంటి కృష్ణకుమారి గార్లు, కవిత్వానికి  న్యాయనిర్ణేతలైన  రేణుకా అయోల, కందుకూరి శ్రీరాములు గారు, ఆంగ్లంలో ఎంపికకు సహాయమందించిన విజయకుమార్, మంజుల జొన్నలగడ్డ గార్లకు, వరూధినికి  హృదయపూర్వక ధన్యవాదాలు.

నెచ్చెలి పాఠకులందరికీ మరొక సదవకాశం ఏవిటంటే, ప్రతినెలా వచ్చే నెచ్చెలి  పత్రికలో రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా పాఠకులైన మీకు నచ్చిన 3 రచనలు/ఆర్టికల్స్  మీద కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ! 

మరొక్క మాట:

నెచ్చెలిలో వచ్చే రచనల్ని వెతకాలంటే సులభ మార్గం: Search వాడండి. మీకు కావాల్సిన రచన పేరు గానీ, రచయిత పేరు గానీ సెర్చ్ బాక్స్ లో టైపు చేస్తే వెంటనే మీకు ఆయా రచన/ రచయిత రచనలు కనిపిస్తాయి. 


 అలాగే ప్రతినెలా నెచ్చెలి విడుదల అయ్యే తారీఖు 10 వ తారీఖు. గుర్తు పెట్టుకున్నారుగా!!

మీ అభిమాన “నెచ్చెలి” ఇలాగే విజయవంతంగా కొనసాగడానికి మీ సహకారం ఎప్పటిలానే అందిస్తూ నెచ్చెలి పత్రికకు సబ్ స్క్రైబ్ చేసుకోవడం, నెచ్చెలి యూట్యూబ్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవడం, నెచ్చెలి ఫేస్ బుక్ పేజీని  లైకు చెయ్యడం మర్చిపోకండేం!!! అందుకు చెయ్యాల్సిందల్లా హోమ్ పేజీ లో కుడిచేతి వైపు ఈ కింద ఇచ్చిన విధంగా కనిపిస్తున్న చోట వివరాలు సబ్మిట్ చెయ్యడమే! 

గమనిక: ఇప్పటికే సబ్ స్క్రైబ్ చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.