
ఆలాపన
-బండి అనూరాధ
నిదానంగా కురిసే ప్రేమని పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. దీపాలు కొండెక్కడం మామూలుకాదు. నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ కాంతిలో తేలిపోతారు ఎవరివి హృదయాలని వెతకకుఎక్కడ మనుష్యులూ అని తిరుగకువిరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకుదూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చినిన్ను నువ్వు గుచ్చుకోకుగ్రహించుదారంలేనివి ఆధారాలు కావెప్పుడూ అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో విహరించడంద్వంద్వాల్లో మరణించడంఇప్పుడసలేమీ బాగోదు సంధిచేసేవాళ్ళకి తెలియదువిసిరివెయ్యబడిన రాళ్ళు మునిపటిలా దొరకవనిఎరవేసేవన్నీ వ్యర్ధవెన్నెలప్రయత్నాలనీనూ పెనుగాలులు నిజాలని కరుచుకుని ప్రేమని తెలుసుకునే రోజొకటి రావొచ్చుప్రయాణం తప్పనప్పుడు, ప్రేమ మృత్యువంత అందంగా ఉండితీరుతుంది.
*****

పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.
