
పుట్టింటి నేల మట్టి ( కవిత)
-పరిమి వెంకట సత్యమూర్తి
మెట్టింట అడుగిడినా వెంటాడుతూనే ఉండే పుట్టింటి మట్టివాసన!! మూడు ముళ్ళు ఏడడుగులుకొత్త బంధాలు ఏర్పడినాబుడి బుడి నడకలతో బుజ్జాయి మెట్టినింటిలో నడయాడినాపుట్టింటి నేలమట్టి అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది!! కన్నప్రేగు తెంచుకునిపుట్టింటి నేల మీదవాలినప్పటి నుంచికంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు!! రక్తం పంచుకుని తనతో పుట్టి పెరిగిన తోబుట్టువులతోఆడుకున్న మధుర బాల్య స్మృతులు!! వారి తీయని జ్ఞాపకాలుమదిలో పది కాలాలు పచ్చగానే ఉంటాయి!! పుట్టినప్పుడే “ఆడ” పిల్ల అని ఈడ పిల్ల కాదు అని గుర్తు చేస్తూగుడ్లనీరు కుక్కుకునిఒక అయ్య చేతిలో పెట్టే అమ్మానాన్నలు!! మెట్టినింటికి వచ్చినా కడ వరకూ ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి!! అన్నాచెల్లెళ్ళ బంధానికినిలువెత్తు సంతకంగా నిలిచే “శ్రావణపూర్ణిమ”ఇదే అదనుగా పుట్టింటికి పరుగెత్తే సోదరీమణులు వారిజీవితాలలో ఆ రోజు రాఖీ పండుగ ఒక మెరుపు!! భగినీ హస్తభోజనంకుతన అన్న వస్తాడనీతన చేతి వంట తినితనను దీవిస్తాడనీ ఒక సోదరి ఎదురుచూపులుయమ ధర్మరాజు చెల్లెమ్మయమున సోదరబంధానికి ప్రతీక!! తన కన్నబిడ్డ మూడు ముళ్ళ బంధానికి తీపి గుర్తుగా కడుపులో బిడ్డ కదలాడిననాడు వేలు పట్టి నడిపించిన తన బిడ్డ ఇంకో బిడ్డకు జన్మనిస్తోందని కాబోయే ఆ తాత కళ్ళల్లో ఎన్ని సంతోష సముద్రాలో!! వీడని వాడని పుట్టింటి మట్టి వాసనలు వెంటాడేభవబంధాలు!!
*****

పరిమి వెంకట సత్యమూర్తి తల్లితండ్రులు కీ.శే. PVSR ఆంజనేయులు, కీ.శే. సుబ్బలక్ష్మి. సతీమణి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి, విశ్రాంత తెలుగు సహాయ ఆచార్యులు
విద్యార్హతలు MA., M.Ed.,L.L.B., Dip.J., విశ్రాంత కేంద్రప్రభుత్వ ఉద్యోగి. 1981 లో EPF organization (Central Labour Dept.,) లో చేరి 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి 2016 లో పదవీ విరమణ చేశాను. కవి, రచయిత.
*నగదు పురస్కారాలు*:
1.బండికల్లు ఫౌండేషన్ వారి జాతీయ కవితల పోటీలో నా కవితకు ప్రోత్సాహక బహుమతి Rs.750/- నగదుతో సన్మానం
2.సాహితీ కిరణం సాహిత్య మాస పత్రిక వారి జాతీయ కవితల పోటీలో ప్రథమ బహుమతి Rs.2500/- నగదు శాలువ మెమెంటోతో సత్కారం
3. 2017 లో తెలంగాణ ప్రభుత్వంచే ప్రపంచ తెలుగు మహాసభలలో సత్కారం
4. మల్లినాథ కళా పీఠం ఏడుపాయల వారిచే సారస్వత మంజూష బిరుదు
5. శ్రీ కళా భారతి వి.కోట(చిత్తూరు) వారి పురస్కారం
6. ఇప్పటిదాకా దాదాపు 600 కవితలు వివిధ సాహిత్య వాట్సాప్ గ్రూపులలో రాయడం జరిగింది.
7. దాదాపు 70 సంకలనాలలో నా కవితలు ముద్రించబడ్డాయి.
ఉదయసాహితి సంస్థలో జంట నగరాల ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నాను.
