“నెచ్చెలి”మా

(అ)సంతృప్తి

-డా|| కె.గీత 

సంతృప్తి –
అసంతృప్తి –

ఒక్క అక్షరం
తేడాలో
ఏముంది?!

కాదు
కాదు

ఒక్క
అక్షరంలోనే
అంతా
ఉంది-
ప్రపంచమంతా
ఉంది-

అ(దే)
అన్నిటినీ
తలకిందులు
చేస్తుంది

అసలు
ఎవరికైనా
దేనికైనా
సంతృప్తి
అనేది
ఉందా?!

ఎన్ని
చేసినా
ఇంకా
ఎవరో
ఏదో
చేయలేదనే –

నిరంతరం
ఎవరో ఒకరి మీద
నెపాలే
నిరంతరం
ఏదో ఒక దానికి
ఫిర్యాదులే

అసలు
ఎవరైనా
మనకు
ఏదైనా
ఎందుకు
చెయ్యాలి?
అసలు
మనం
ఎవరికైనా
ఎప్పుడైనా
ఏదైనా
చేసామా!

అన్న
వివేచన
ఎవరికైనా
ఉందా?!

అసలు
సంతృప్తిని
ఇవ్వగలమా
దేనికైనా?!

మానవ మాత్రులం
సంతృప్తి
పడగలమా
దేనికైనా?!

అసంతృప్తిని
పొందినంత
సులభంగా
సంతృప్తిని
పొందగలమా?!

అవసరమైన
అసంతృప్తి
సరే-

అక్కర్లేని
అసంతృప్తి
దేనికి?!
ఏదేమైనా
ఏది
చేసినా
సంతృప్తి
లేని వారికి
ఏం
చేసినా
సంతృప్తి
కలగదు

ఎవరినో
నిందించక
ఫిర్యాదు చెయ్యక
మానరు

ఎవరి
ధర్మం
ప్రకారం
వారు
చెయ్యడమొక్కటే
మార్గం!

ఎవరి
సంతృప్తులూ
అసంతృప్తులతో
సంబంధం
లేకుండా

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

సెప్టెంబరు, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  చిట్టత్తూరు మునిగోపాల్

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: జీవిత చదరంగం (కథ) రచయిత – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

 ఇరువురికీ  అభినందనలు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.